
ఎయిర్ మార్షల్ ఏకే భారతి
సరిహద్దులో దళాలను తగ్గించడంపై దృష్టిసారించిన భారత్, పాక్
డీజీఎంల స్థాయిలో జరుగుతున్న చర్చల్లో ప్రతిపాదనలు
భారత్, పాక్ డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ సోమవారం రెండు దేశాల సైనిక చర్యలను నివారించే మార్గాలపై చర్చించారు. సరిహద్దులు, ముందు ప్రాంతాల నుంచి రెండు సైనిక దళాలను తగ్గించడానికి తక్షణ చర్యలను పరిగణలోకి తీసుకోవాలని అంగీకరించారు.
హాట్ లైన్ ద్వారా జరిగిన సంభాషణలో ఇద్దరు అధికారులు ఇరువైపులా ఒకే కాల్పులు జరపకూడదని నిబద్దతను కొనసాగించడంపై దృష్టిపెట్టారని కొన్ని సోర్స్ లు తెలిపాయి.
కాల్పుల విరమణ..
భారత్, పాకిస్తాన్ డీజీఎంలు అన్ని సైనిక చర్యలను నిలిపివేయడంపై ఒక అవగాహనకు వచ్చిన రెండు రోజుల తరువాత దాదాపు 45 నిమిషాల పాటు చర్చలు జరిపాయి. రెండుదేశాల మధ్య నాలుగు రోజులుగా తీవ్ర స్థాయికి చేరుకున్న శత్రుత్వాల తరువాత మే 10న కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి కొనసాగింపుగా ఈ చర్చలు కొనసాగాయి.
రెండు దేశాలు ఒకరి సైన్యంపై మరొకరు లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులు, దీర్ఘ శ్రేణి ఫిరంగిని ప్రయోగించిన తరువాత పాకిస్తాన్ కాళ్లబేరానికి వచ్చింది. ఈ ఘర్షణలు విస్తృతమైన సంఘర్షణ సంభావ్యతపై తీవ్రమైన ఆందోళనలు రేకెత్తాయి.
హాట్ లైన్ చర్చలు..
‘‘ఇద్దరు డీజీఎంల మధ్య చర్చలు సాయంత్రం 5 గంటలకు జరిగాయి. ఇరువైపులా ఎటువంటి కాల్పులు జరపకుండా లేదా మరొకరిపై శత్రు చర్యలు ప్రారంభించకుండా చూసుకోవడానికి వారి నిబద్దతను ఇద్దరూ పునరుద్ఘాటించారు. ’’ అని భారత సైన్యం తెలిపింది.
అలాగే సరిహద్దులోని ఫార్వార్డ్ ప్రాంతాలలో మోహరించిన దళాలను వెనక్కి పిలిపించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయి.
సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉన్నాయి...
మే 10న రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన సందర్భాలు ఉన్నప్పటికీ ఆదివారం రాత్రి అలాంటి సంఘటలేవి జరగలేదు. ‘‘జమ్మూకశ్మీర్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న ఇతర ప్రాంతాలలో రాత్రి వరకూ చాలా ప్రశాంతంగా ఉంది.’’ అన సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
ఆపరేషన్ సిందూర్ సారాంశం..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ లోని ఉగ్రవాద మౌలిక స్థావరాలపై కచ్చితమైన దాడులు చేసింది.
దీనికి ప్రతిస్పందనగా పాక్ మే 8,9, 10 వ తేదీలలో భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులకు పాల్పడింది. దీనికి తీవ్రంగా ప్రతిస్పందించిన భారత్, శత్రుదేశం వైమానిక స్థావరాలు, వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ నియంత్రణ కేంద్రాలు రాడార్ సైట్ లపై దాడులు చేసి నిర్వీర్యం చేసింది. తరువాత పాకిస్తాన్ వెంటనే కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రతిపాదించింది.
భారత సైనిక శక్తి..
డీజీఎం చర్చలకు ముందు భారత వైమానిక దళం స్థావరాలతో పాటు మిగిలిన దళాల వ్యవస్థలు అన్ని పనిచేస్తున్నాయని అవసరమైతే ఏవైన తదుపరి కార్యకలాపాలను చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని తెలిపింది.
భారత సైన్యం ఉగ్రవాదులతో వారి మౌలిక సదుపాయాలతో పోరాడుతోందని,కానీ పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదుల కోసం పోరాడటం జాలికరంమని ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు.
దేశంలో సైనిక స్థావరాలే లక్ష్యంగా పాక్ చేసిన అన్ని దాడులు మన వ్యవస్థలు అడ్డుకుని కూల్చేశాయని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు. భారత్ స్థావరాలకు అత్యంత స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని, అన్ని వ్యవస్థలు పనిచేస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం ఆదేశిస్తే ఏవైనా తదుపరి కార్యకలాపాలను చేపట్టడానికి సిద్దంగా ఉన్నాయని ఆయన అన్నారు.
Next Story