
పాక్ తో యుద్ధం చేస్తే భారత్ ఓడిపోతుంది: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
ఇంతకుముందు ఇదే తరహ వ్యాఖ్యలు చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
భారత్, పాకిస్తాన్ తో యుద్ధం చేస్తే ఇండియా ఓడిపోతుందని చత్తీస్ గఢ్ మాజీ ఎమ్మెల్యే యుడి మింజ్ వ్యాఖ్యానించడం దేశంలో తీవ్ర దుమారం రేపింది. ఇంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సైతం భారత్, పాకిస్తాన్ తో ఎందుకు యుద్ధం చేయాలని పాక్ అనుకూల వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ నేతలు ఇవే వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు
పహల్గామ్ లో పర్యటిస్తున్న పర్యాటకులలో కేవలం హిందువులని టార్గెట్ చేసి మరీ ఇస్లామిక్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. దాడి జరిగిన తరువాత రెండు రోజులకు ఆయన ఈ వ్యాఖ్యలు తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తరువాత వీటిని డిలీట్ చేశారు.
మింజ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై అధికార బీజేపీ భగ్గుమంది. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి మీడియా సలహాదారు పంకజ్ ఝా మాట్లాడుతూ..ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మనసులో భారత్ ఓడిపోవాలనే ఉంటుందని విమర్శించారు.
ఝా ఈ పోస్ట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్ ను చూపించారు. పేస్ బుక్ ఖాతాలోని సందేశం ఇలా ఉందని చూపించారు. ‘‘ఈ రోజు పాకిస్తాన్ పై నిర్ణయాత్మక యుద్దం గురించి మాట్లాడుతున్న వారు, ఈసారి భారత్, పాకిస్తాన్ తో కలిసి చైనాతో పోరాడవలసి ఉంటుందని, అలాంటి పరిస్థితుల్లో భారత్ ఓటమి ఖాయం అని తెలుసుకోవాలి’’ అన్నారు.
‘‘చైనా, పాకిస్తాన్ లోని అనేక ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు భారత్ ఈ ప్రదేశాలపై నేరుగా దాడి చేస్తే చైనా, పాక్ వైపు నిలుస్తుంది. ఫలితం గురించి ఆలోచించండి. కాబట్టి పుల్వామా పార్ట్ 2 తరువాత, బాలాకోట్ కౌవా మార్ట్ స్ట్రైక్ పార్ట్ కు సిద్దంగా ఉండండి’’ అని పేర్కొన్నారు.
‘‘దేశంలో నిరుద్యోగం భారీగా పెరుగుతుందని ద్రవ్యల్భోణం అదుపు తప్పింది. అటువంటి పరిస్థితుల్లో ఏదైనా యుద్ధం ఆత్మహత్యా సదృశ్యమైనది, రెండు దేశాల కష్టపడి పనిచేసే ప్రజలపై మోయలేని భారాన్ని పెడుతుంది’’ అని పోస్ట్ పేర్కొంది.
భారత్, పాకిస్తాన్, చైనా నాయకత్వం కలిసి కూర్చుని ఉగ్రవాద సమస్యకు పరిష్కారం కనుగోనాలని మిండ్ పేర్కొన్నారు. దేశంలో యుద్దాన్ని సమర్థిస్తున్న వారందరిని సరిహద్దులకు పంపాలని వ్యంగ్యంగా పోస్ట్ లో పేర్కొన్నారు.
మింజ్ పోస్ట్ పై ఝా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్ నాయకుడు చేసిన దేశ వ్యతిరేక ప్రకటన. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త దేశ ద్రోహి మీరు కచ్చితంగా చెప్పవచ్చు. వారు మతం మారితే దానిని చెత్త విషయంగా పరిగణించండి.
కాంగ్రెస్ కార్యకర్తలు మిమ్మల్ని ఎప్పుడూ మోసం చేస్తారో మీకు అర్థం కాలేదు’’ అని అన్నారు. మింజ్ పోస్ట్ కు చత్తీస్ గఢ్ కాంగ్రెస్ సమాధానం చెప్పాలని ఆయన అన్నారు.
నా ఖాతా హ్యాక్ అయింది..
తన పేస్ బుక్ ఖాతా హ్యక్ అయిందని యుడి మింజ్ అన్నారు. ‘‘ ప్రియమైన మిత్రులారా, ఇటీవల నా ఫేస్ బుక్ ఖాతా హ్యాక్ అయిందని మీ అందరికి తెలియజేయాలనుకుంటున్నాను. నా పేస్ బుక్ ఖాతాలో కొన్ని కార్యకలాపాలు జరిగాయి. అవి నా నియంత్రణలో లేవు. ఇది అపార్థాలకు కారణం కావచ్చు’’ అని మింజ్ ఒక ఫేస్ బుక్ పోస్ట్ లో విమర్శించారు.
‘‘ఈ అసౌకర్యానికి నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను ఫేస్ బుక్ మద్దతను సంప్రదించాను. నా ఖాతాను సురక్షితంగా ఉంచడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాను. దయచేసి నా ఖాతా నుంచి వచ్చే ఏదైనా అనుమానాస్పద సందేశం, లింక్ పోస్ట్ పై దృష్టి పెట్టవద్దు, వాటికి ప్రతిస్పందించవద్దు’’ అన్నారు.
అయితే మింజ్ ఈ పోస్ట్ పై బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అజయ్ చంద్రకర్ మాట్లాడారు. మింజ్ ఇటువంటి జాతీయ సమస్యలపై మాట్లాడకూడదని అన్నారు. ఈ సమస్యలపై మాట్లాడే బదులు. . కుంకురితో సహా జష్ పూర్ లో ఎన్ని విదేశీ సంస్థలు పనిచేస్తున్నాయో, వాటికి విదేశీ నిధులు ఏ ప్రయోజనాల కోసం వస్తున్నాయో ఈ నిధులను ఎక్కడ ఉపయోగిస్తున్నారో మింజ్ చెప్పాలని చంద్రకర్ అన్నారు.
మిన్జ్ 2018-2023 నుంచి జష్ పూర్ జిల్లాలోని కుంకురి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గిరిజనుల ప్రాబల్యం ఉన్న ఈ స్థానం నుంచి ప్రస్తుతం సీఎం సాయి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కుంకురి ప్రాంతంలో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉన్నారు. జాతీయ సమస్యలపై భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఏ భారతీయుడికి మంచిది కాదని చంద్రకర్ అన్నారు.
Next Story