జైశంకర్ చైనా పర్యటన వ్యూహాత్మక దౌత్యమా?
x

జైశంకర్ చైనా పర్యటన వ్యూహాత్మక దౌత్యమా?

గల్వాన్ ఘర్షణ తరువాత పరిస్థితులను సాధారణీకరించడానికి ప్రయత్నిస్తున్నారా?


విజయ్ శ్రీనివాస్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రస్తుతం చైనాలో పర్యటిస్తున్నారు. గల్వాన్ ఘర్షణ తరువాత ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు చెలరేగిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు రెండు దేశాల మధ్య తిరిగి దౌత్య ప్రక్రియను ఆయన పునరుద్దరించబోతున్నారా? వాణిజ్యానికి సంబంధించిన చర్చలు జరపబోతున్నారా? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి.

రెండు దేశాల మధ్య సరిహద్దు సమస్యతో పాటు వాణిజ్య లోటు కూడా ఉంది. అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ విశిష్ట సహచరుడు అయిన మనోజ్ జోషి మాత్రం గల్వాన్ ఘర్షణ తరువాత రెండు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని విశ్లేషిస్తున్నారు.

బీజింగ్ తన వైఖరిని మృదువుగా మార్చుకుంటోందని, అమెరికాతో వాణిజ్య ఘర్షణలు ఇందకు కారణమని చెబుతున్నారు. న్యూఢిల్లీ వాణిజ్య ప్రాధాన్యతలను పెంచుకోవడానికి ఇది ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

గల్వాన్ ఘర్షణ తరువాత భారత్- చైనా సంబంధాలలో విదేశాంగ మంత్రి పర్యటన మీరు ఎలా చూస్తారు?
చైనాతో గల్వాన్ యుద్ధం తరువాత మన దౌత్యాన్ని కొనసాగించడంలో జైశంకర్ కీలకపాత్ర పోషించారు. గత ఐదు సంవత్సరాలుగా ఆయన తన చైనా కౌంటర్ పార్ట్ లతో నిరంతరం టచ్ ఉన్నారు.
ఈ పర్యటన స్వరం ఉద్దేశపూర్వకంగానే తగ్గించారు. జైశంకర్ మాట్లాడుతూ.. సంబంధాలు స్థిరంగా మెరుగుపడుతున్నాయి అని పేర్కొన్నారు. ఇది సరిహద్దు ఘర్షణలను పరిష్కరించడంలో పెరుగుతున్న పురోగతికి ప్రతిబింబం.
ఏదైనా అర్థవంతమైన సంబంధానికి సరిహద్దు శాంతి తప్పనిసరి అనే భారత్ దీర్ఘకాలిక వైఖరిని ఆయన మరోసారి ఈ పర్యటనతో స్పష్టం చేశారు. గత ఏడాది అక్టోబర్ నాటికి లడక్ సమస్యపై కొంత పరిష్కారాన్ని సాధించాయి.
వాణిజ్యం, ప్రపంచ సహకారం ముఖ్యమైనవి అయినప్పటికీ అవి సరిహద్దు స్థిరత్వాన్ని దెబ్బతీయలేవని జైశంకర్ చెప్పారు. శాంతి, ప్రశాంతత, వాణిజ్యంపై ఆయన ప్రాధాన్యత భారత్ ప్రస్తుత వైఖరిని ప్రస్ఫుటం చేసింది.
ఈ పర్యటన రెండు దేశాల మధ్య ఒక వ్యూహాత్మక విరామం అని పిలవచ్చా?
కచ్చితంగా.. జైశంకర్ స్వయంగా ఈ సంబంధాలు స్థిరంగా మెరుగుపడుతున్నాయని చెప్పారు. ఇది ఒక దౌత్య మార్గం. ఇది నాటకీయ మలుపు కావచ్చు. కానీ ఇది ఒక మార్పును సూచిస్తుంది. ఈ సంవత్సరం చివర్లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని పర్యటనకు ఇది నాంది కావచ్చు.
జైశంకర్, చైనా ప్రతినిధి చాలాసార్లు సమావేశమైనప్పటికీ 2018 లో అనధికార వూహాన్ శిఖరాగ్ర సమావేశం తరువాత అగ్రనాయకత్వం ఒక్కసారి కూడా కలుసుకోలేదు. 2024 లో కజాన్ లో ఓసారి ముఖాముఖి ఎదురయ్యారు. కాబట్టి జైశంకర్ చైనా పర్యటన తిరిగి వాటిని పునరుద్దరించే అవకాశం ఉంది.
క్వాడ్ లో భారత్, దలైలామ వంటి సమస్యలు, ఇతర భౌగోళిక రాజకీయ సమస్యల గురించి ఏమిటీ? ఈ పర్యటన సందర్భంగా చైనా దౌత్య స్వరాన్ని అవి ప్రభావితం చేశాయా?
చైనా వైఖరిలో మార్పు వచ్చిందని నేను చెప్పను. కానీ గత నెలలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చైనాను సందర్శించి ముక్కుసూటిగా మాట్లాడారు. కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ద్వారా మాత్రమే వాస్తవ నియంత్రణ రేఖ ను నిర్వహించడం మాత్రమే కాకుండా సరిహద్దు విభజన సమస్యను పరిష్కరించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఇటీవల కాలంలో ఒక భారతీయ నాయకుడు శాశ్వత పరిష్కారం అవసరాన్ని ఇంత స్పష్టంగా చెప్పడం ఇదే మొదటిసారి. చైనా దౌత్యపరమైన వెనకడుగుతో స్పందించింది.
చైనాతో ఇప్పటి వరకూ 23 సార్లు మనవాళ్లు సమావేశం అయ్యారు. చివరిసారిగా 2024 డిసెంబర్ లో సమావేశం అయ్యాము. కానీ పెద్దగా ఏమి సాధించలేకపోయాము. మొత్తం దౌత్య స్వరం రాజీపడేలా కనిపించినప్పటికీ కీలకమైన నిర్మాణాత్మక సమస్యలు పరిష్కారం కాకుండానే ఉన్నాయి.
అమెరికా టారిఫ్ బెదిరింపులు, జైశంకర్ పర్యటన ఒకేసారి జరిగాయి. ఇప్పడు న్యూఢిల్లీ, వాషింగ్టన్ తో సంబంధం లేకుండా వాణిజ్య సంబంధాలను విస్తరించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఏమైన తెలుస్తుందా?
అమెరికా నుంచి టారిఫ్ బెదిరింపులు భారత్, చైనా రెండింటిని లక్ష్యంగా చేసుకుంది. చైనా- అమెరికా ఒప్పందం తుది దశకు చేరుకున్నప్పటికీ భారత్ తో మాత్రం చర్చలు జరుగుతున్నాయి. కానీ వాషింగ్టన్ ఇంత త్వరగా భారత్,చైనాతో తమ ఆర్థిక సంబంధం సాధారణీకరించడం వివేకవంతమైన ఆలోచన.
తక్కువ ఖర్చుతో కూడిన తయారీలో చైనా భర్తీ చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. కానీ నిజానికి మనం పారిశ్రామిక ఇన్ పుట్ లు, నైపుణ్యాల కోసం ఇప్పటికి చైనా పైనే ఆధారపడుతున్నాముం.
చెన్నైకి సమీపంలో ఉన్న ఐఫోన్ కర్మాగారాన్ని తీసుకోండి.. దానిలోని అనేక భాగాలు, నైపుణ్యం కలిగిన కార్మికులు చైనా నుంచే వస్తారు. ఆ నైపుణ్యం కలిగిన కార్మికుల ప్రవాహాన్ని చైనా పరిమితం చేస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి.
కాబట్టి అమెరికా, చైనా రెండు భారత్ ఆర్థిక ప్రగతికి సహకారంగానే ఉన్నాయి. చైనాతో మనం భారీ వాణిజ్యలోటును ఎదుర్కొంటున్నాము. అమెరికాతో వాణిజ్య మిగులును పొందుతున్నాము.
ఇప్పుడు మన ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. చైనాకు మరిన్ని భారతీయ వస్తువుల ఎగుమతి చేయడం, యూఎస్ నుంచి దిగుమతులను పెంచుకోవాలి.
చైనాపై విశ్వాసం తగ్గుతోందని చెప్పడం సరైనదేనా? అది ఇప్పటికే ద్వైపాక్షిక సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందా?
విశ్వాసలోటు చాలా వరకూ చెక్కుచెదరకుండా ఉంది. మా సంబంధం 1993, 1996, 2005, 2012 ఒప్పందాలతో ముడిపడి ఉంది. కానీ 2020 లో ఇవన్నీ పక్కకు తొలగిపోయాయి.
ఇప్పుడు మరోసారి మరమ్మతు దశలో ఉన్నాయి. ఒకసారి తెగిపోయిన నమ్మకం, త్వరగా నిర్మించడం కష్టం. వారు ప్రయత్నిస్తున్నారు దీనికి నిరంతర కృషి అవసరం.
ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ కు ఆయుధాలు సమకూర్చింది చైనా నేనా?
1980 ల నుంచి చైనా, పాకిస్తాన్ కు ఆయుధాలు అందిస్తోంది. ఇది కొత్త కాదు. ఆపరేషన్ సిందూర్ సమయంలో చైనా ప్రమేయం ఉందని నివేదికలు రావడం అతిశయోక్తి కావచ్చు. చైనా, పాకిస్తాన్ తను గట్టి సోదరుడిగా చూస్తోంది. వారి మద్దతు మన వ్యూహాత్మక వాతావరణాన్ని క్లిష్టతరం చేసింది.
కానీ చైనా మాత్రం భారత్- పాకిస్తాన్ విషయంలో ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటుందని నేను అనుకోవడం లేదు. వారు పాక్ తో సైనిక సహకారం కొనసాగిస్తారు. కానీ దానికి కూడా ఒక కారణం ఉంటుంది. మన వారి పాత్రను పరిగణలోకి తీసుకోవాలి. ఊహగానాలు చేయకూడదు.
Read More
Next Story