లోక్ సభ ఎన్నికలను మాయవతి పట్టించుకోవడం లేదా? ఎందుకలా..
x

లోక్ సభ ఎన్నికలను మాయవతి పట్టించుకోవడం లేదా? ఎందుకలా..

దేశంలోనే పెద్ద రాష్ట్రమైన యూపీలో బీఎస్పీది చెప్పుకోదగ్గ ప్రస్థానం. కానీ ఈ సారి లోక్ సభ ఎన్నికలను పార్టీ సీరియస్ గా తీసుకోవట్లేదని తెలుస్తోంది. దీనివెనకున్న..


దేశంలో ఎక్కువ లోక్ సభ స్థానాలు ఉన్న రాష్ట్రం ఉత్తర ప్రదేశ్. దశాబ్దం క్రితం వరకూ ఇక్కడ ప్రాంతీయ పార్టీలైన సమాజ్ వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీలే అధికారంలో కొనసాగేవి. జాతీయ పార్టీలది నామమాత్రపు పాత్ర. కానీ 2014 తరువాత ఇక్కడ పరిస్థితి మారింది. బీజేపీ ఇక్కడ వేగంగా పుంజుకుంది. తరువాత పరిణామాలన్నీ అనూహ్యంగా మారాయి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ముఖ్యంగా బీఎస్పీ అధినేత్రి మాయవతి వేసే అడుగులు చర్చనీయాంశంగా మారాయి. ఆమె ప్రచార శైలిని చూసినట్లయితే ఇక్కడ తన అభ్యర్థులు విజయం సాధించడం కంటే ఎస్పీ, కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమిని కలవర పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మాయవతి వేసే అడుగులన్నీ 2027 నాటి అసెంబ్లీ ఎన్నికల కోసమని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే ఇవన్నీ బీజేపీ లాభించేలా ఉన్నాయి.

బలాలను సమీకరించుకుంటుందా?
2027 నాటి అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా తన బలాన్ని సమీకరించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం (మే 7) మాయావతి తన మేనల్లుడు, రాజకీయ వారసుడు ఆకాష్ ఆనంద్‌ను ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంచినప్పుడే దీనికి సంబంధించిన మొదటి ప్రధానమైన సూచన వెలుగులోకి వచ్చింది. BSP జాతీయ సమన్వయకర్తగా ఆమె రాజకీయ వారసుడిగా నియమించిన ఐదు నెలల్లో ఆమె అతని రాజకీయ "అపరిపక్వత"గా గుర్తించింది. అతనికి రాజకీయ పరిపక్వత వచ్చే వరకూ పార్టీ బాధ్యతలను ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పినట్లు అయింది.
ఏప్రిల్ 28న BSP సీతాపూర్ లోక్‌సభ అభ్యర్థి మహేంద్ర సింగ్ యాదవ్ కోసం ప్రచారం చేస్తున్నప్పుడు ఆకాష్ సంయమనం పాటించకపోవడం, BJPపై విమర్శలు గుప్పించడంతో అత్తకు కోపం తెప్పించిందని బయట జరుగుతున్న ప్రచారం. ఇక్కడ ఆకాష్ పై విద్వేషపూరిత ప్రసంగం, దుష్ప్రవర్తనకు సంబంధించి పోలీసులు అతనితో పాటు మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సీతాపూర్‌లోని రాజా కాలేజీ క్యాంపస్‌లో బీఎస్పీ నిర్వహించిన ర్యాలీలో ఆకాష్ చేసిన ప్రసంగంలో, ఇతర పార్టీల నాయకులపై బూట్లు విసరాలని కోరారు. దీనికి తోడు కేంద్రంలోని ప్రభుత్వం ఉగ్రవాదుల ప్రభుత్వం అని ఆయన పేర్కొన్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. మరో దళిత నాయకుడు భీమ్ ఆర్మీ చీఫ్ నాగినా నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న చంద్రశేఖర్ ఆజాద్ పై కూడా ఇదే విధంగా ఆయన వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈయన సొంతంగా ఆజాద్ సమాజ్ వాదీ పార్టీ స్థాపించి దళితుల్లో మెల్లగా పాపులారిటీ పెంచుకుంటున్నారు.ఈయన ఎదుగుదలతో తన పార్టీకి ఎదురుదెబ్బ తప్పదనే భయంలో బీఎస్పీకి ఉంది. అందుకే అక్కసుతో ఆకాశ్ నోరు జారారు. దీని ప్రతిఫలమే ఆయనను పార్టీ ప్రచారం నుంచి పక్కకు పెట్టడం. అయితే ఎన్ని వ్యాఖ్యలు చేసిన పార్టీ ఆకాష్ పై చర్య తీసుకోలేదని ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఎస్పీ అధికారంలోకి రాకూడదనే ప్రధాన ఉద్దేశం
మాయావతికి లోక్ సభ ఎన్నికల పై ఆసక్తి లేదని చెప్పడానికి ప్రధాన కారణం..ఆమె ప్రకటించిన అభ్యర్థులు, ఇటీవల వేరే పార్టీల్లోకి వెళ్లిపోయారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మాయవతి పార్టీ ఫిరాయింపులను ఆపలేకపోయారు. ఇది పార్టీపై ప్రభావం చూపే అవకాశం ఉందని, పార్టీని అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం చేయాలని అనుకుంటోంది.
2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో BSP ఘోర పరాజయాన్ని చవిచూసింది. కేవలం 13 శాతం ఓట్లను మాత్రమే సంపాదించగలిగిన ఆ పార్టీ, కేవలం ఒక ఎమ్మెల్యే ను మాత్రమే గెలుచుకోగలిగింది. ఎన్డీయే 44 శాతం ఓట్లను సాధించగా, ఎస్పీ తన కూటమి భాగస్వామ్య పక్షాలతో కలిసి 37 శాతం ఓట్లను సాధించింది. కానీ సగం సీట్లను కూడా ప్రత్యర్థులు అందుకోలేకపోయారు. మాయావతికి సానుకూల అంశం ఏంటంటే.. వచ్చే ఎన్నికల్లో కూడా ఎస్పీ అధికారంలోకి రాదని తెలుసుకుంది.
2019కి ముందు జరిగిన ఎన్నికలలో SPతో పొత్తు పెట్టుకుని BSP పోటీ చేసినప్పటికీ, మాయావతి ఈసారి లోక్‌సభ ఎన్నికల కోసం అలా చేయడానికి నిరాకరించారు. పొత్తు వల్ల బీఎస్పీకి ఎటువంటి మేలు జరగట్లేదని మాయావతి గ్రహించారు. ఎస్పీ ఓట్లు తనకు బదిలీ కావట్లేదని పొత్తు ప్రతిపాదనలు పక్కకు పెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో BSP ఒంటరిగా పోటీ చేసినప్పటి నుంచి పరిస్థితులన్నీ వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి, పార్లమెంటులో ఒక్క సీటు గెలుచుకోలేకపోయింది. 2009 లోక్‌సభ ఎన్నికలలో, రాష్ట్రంలోని 80 లోక్‌సభ స్థానాల్లో 20 సీట్లను పార్టీ గెలుచుకుంది.
ఇండి కూటమి కంటే బీజేపీ..
లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీ ప్రాధాన్యతా జాబితాలో లేదని రుజువు చేసే మరో సంకేతం, జౌన్‌పూర్ పార్లమెంటరీ స్థానం నుంచి బిఎస్‌పి తన అభ్యర్థిని ఉపసంహరించుకోవడం.
మాయావతి జైలులో ఉన్న బలమైన వ్యక్తి ధనంజయ్ సింగ్ భార్య శ్రీకళ సింగ్ రెడ్డిని తప్పించి, సిట్టింగ్ ఎంపీ శ్యామ్ సింగ్ యాదవ్ కు తిరిగి టికెట్ ఇచ్చారు. ఇక్కడ బీజేపీ కిర్పాశంకర్ సింగ్ ను బరిలోకి దింపింది.ఈయన ఠాకూర్ వర్గానికి చెందిన వారు. ఎస్పీ బాబూ కుష్వాహాను అభ్యర్థిగా ప్రకటించింది. అయితే శ్రీ కళా రెడ్డి, కిర్పాశంకర్ ఒకే సామాజిక వర్గం కావడంతో ఓట్లు చీలిపోయి ఎస్పీ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి బీఎస్పీ యాదవ్ ను బరిలోకి దింపింది. దీనితో ఇక్కడ ఓట్లు చీలి ఎన్డీఏ కూటమి విజయం సాధించవచ్చు.
వారణాసిలో లెక్కలు ఎలా ఉన్నాయంటే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నియోజకవర్గం వారణాసి. ఇక్కడ కూడా ప్రత్యర్థికి చెందిన ఇండి కూటమి ఓట్లను చీల్చాలని మాయావతి ప్రణాళికలు వేసింది. ఇక్కడ నుంచి మోదీని ఎదుర్కోవడానికి బీఎస్పీ ముస్లిం అభ్యర్థి అథర్ జమల్ లారీని బరిలోకి దింపింది. ఈ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ముస్లిం ఓటర్లు ఉన్నారు, వీరి ఓట్లు జూన్ 1న ఏడవ దశలో ఓటింగ్ జరిగేటప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్, బీఎస్పీ అభ్యర్థి మధ్య చీలిపోతాయి. ఇది మోదీ సులభంగా లేదా భారీ తేడాతో దూసుకుపోవడానికి సాయపడుతుంది. 2014-2019 ఎన్నికలలో ఆయన తన సమీప ప్రత్యర్థుల కంటే లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం కనిపిస్తోంది.
మాయావతికి LS పోల్ ఎందుకు సీరియస్ గా చూడట్లేదు..
నిజంగా ఎన్నికల సందర్భంగా ఆమె ఎందుకు ప్రతిపక్ష పార్టీలతో పొత్తు పెట్టుకోలేదు. ఒంటరిగా బీజేపీని ఎదుర్కొనే శక్తి బీఎస్పీకి లేదు. దీనికి సమాధానం తన మేనల్లుడు. మాయవతి ఇప్పుడు తక్షణ అవసరాల కోసం కాకుండా దీర్ఘకాలం ప్రయోజనాల కోసం ఎదురుచూస్తుందని అర్థమవుతోంది. ఆమె మూడుసార్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు కానీ 2007 వరకు పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేయలేకపోయారు. అందుకే ఈ సారి కఠినమైన నిర్ణయాలు తీసుకుని పార్టీని కిందిస్థాయి నుంచి నిర్మించాలని అనుకుంటున్నారా.? వేచి చూడాలి.
Read More
Next Story