
షార్జీల్ ఇమామ్
ఐదుగురికి స్వేచ్ఛ పై షార్జీల్ ఇమామ్ సంతోషంగా ఉన్నాడా?
ఢిల్లీ కుట్రలో కీలకంగా వ్యవహరించిన నిందితులు
53 మంది అమాయక ప్రజలు చనిపోవడానికి కారణమైన ఢిల్లీ అల్లర్ల కేసులో సుప్రీంకోర్టు ఏడుగురు ప్రధాన నిందితులలో ఐదుగురు బెయిల్ మంజూరు చేసింది. ఈ కుట్రకు కీలక సూత్రధారులుగా భావిస్తున్న షార్జిల్ ఇమామ్, ఉమర్ ఖలీద్ లకు బెయిల్ ఇవ్వడాన్ని తిరస్కరిస్తూ వారి పిటిషన్లను కొట్టివేసింది.
కానీ ఈ తేడాలు కుటుంబాలకు అర్థం లేనివి. సంతోషం, దు:ఖం ఒకదానికొకటి పక్కపక్కనే ఉన్నాయి. కొంతమంది తమ నుంచి వేరు కావడంతో ప్రధాన కుట్రదారులు సంతోషంగానే ఉన్నారు.
ఉమర్ ఖలీద్ భార్య బనో జ్యోత్స్య లాహిరి ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. జైలులో ఉన్న తన తోటీవారికి బెయిల్ లభించినందుకు ఆయన సంతోషంగా ఉన్నాడని చెప్పినట్లు పేర్కొన్నారు.
ఆశ ఉంది
ఖలీద్ తో జరిపిన సంభాషణను లాహిరి ఫేస్బుక్ లో పోస్ట్ చేసింది.‘‘బెయిల్ పొందిన తన సహచరుల పట్ల నేనే నిజంగా సంతోషంగా ఉన్నాను. చాలా ఉపశమనం కలిగింది’’ అని ఉమర్ అన్నారు.
‘‘నేను ములాఖత్ కోసం రేపు వస్తాను’’ అని బదులివ్వగా, ‘‘గుడ్ గుడ్ ఆ జనా, అబ్ యాహి జిందగీ హై’’(గుడ్ గుడ్ రా.. ఇప్పుడు ఇదే జీవితం) అని అన్నారు. వివక్షతో కూడిన సీఏఏ పోరాటానికి గొంతుకగా నిలిచిన కార్యకర్తలు ఎవరూ జైలులో ఉండటానికి అర్హులు కారని బనో జ్యోత్స్న అన్నారు.
కోర్టులో ప్రతిసారి ఆశతోనే బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేస్తామని అన్నారు. ఐదు సంవత్సరాలుగా విచారణ లేకుండా జైలు ఉన్నాడని, తరువాత ఉమర్ తో సహ బెయిల్ లభిస్తుందనే ఆశ తనకు ఉందని పేర్కొన్నారు.
చట్టపరమైన పోరాటం చేస్తాం..
షార్జీల్ ఇమామ్ సోదరుడు ముజమ్మిల్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు తీవ్ర నిరాశ గురిచేసినప్పటికీ మిగిలిన వారు స్వేచ్ఛగా జీవిస్తారని చెప్పారు. తీర్పు తరువాత నేను షార్జీల్ తో మాట్లాడాను.
‘‘చలో ఆజో కిసీకో తో ఆజాదీ మిలీ. షాయద్ హుమారీ తక్దీర్ మే యహాన్ కుచ్ ఔర్ వక్త్ లిఖా హై( కనీసం వీరికైనా ఈ రోజు స్వాతంత్య్రం వచ్చింది. బహుశా నా విధి ప్రకారం మరికొంతకాలం జైలులో ఉండాలని రాసి ఉంది) మాకు బెయిల్ వస్తుందని కుటుంబ సభ్యులు ఆశపడ్డారని కానీ అది నేరవేరలేదని అన్నారు.
‘‘మాకు బెయిల్ వస్తుందని మేము ఆశించాము. సహజంగానే మేము బెయిల్ కు అర్హులం. సుప్రీంకోర్టు కుట్ర కేసు గురించి మాట్లాడుతోంది. కానీ ఆ కుట్ర కేసులో ప్రమేయం ఉన్న చాలామంది వ్యక్తులు బెయిల్ పై బయట ఉన్నారు.
కుట్ర పన్నారనే ఆరోపణలపై 2-3 మంది మాత్రమే జైలులో ఉన్నారు. షార్జిల్, ఉమర్ ఎవరితో కుట్ర పన్నారో నాకు తెలియదు’’ అని అతను ‘ది ఫెడరల్’ తో అన్నారు.
ఈ ఇద్దరు సూత్రధారులనే ఆరోపణలను ఖండిస్తూ షార్జీల్, ఉమర్ ఎప్పుడు మాట్లాడుకోలేదని, వాట్సాప్ చాట్ లేదా కాల్ చేయలేదని, చాలామంది ఇతరులతో హజరైన ఒక సమావేశం మాత్రమే ఉంది. ఇది చార్జీషీట్ లో చేరలేదని అన్నారు.
స్వేచ్ఛను అవిశ్వాసంతో స్వాగతించిన..
బెయిల్ పొందిన మీరాన్ హైదర్ ఫర్జానా యాస్మీన్ సోమవారం ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. తమ ప్రియమైన వారికి బెయిల్ లభించిన కుటుంబాలకు కూడా ఆనందం లభించింది.
అయితే షార్జీల్, ఉమర్ ఖలీద్ కు బెయిల్ లభిస్తే బాగుండు. తీర్పు ముందు రోజు రాత్రి భయం, ఆశల మధ్య గడిచిందని చెప్పారు. తీర్పు తరువాత మధ్యాహ్నం 12 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ తో మాట్లాడినట్లు చెప్పారు. ఈ వార్తను తను నమ్మలేనని చెప్పారు.
షాదాబ్ తండ్రి కూడా తన కొడుకు బెయిల్ పై ఆనందం వ్యక్తం చేశారు. మరో ఇద్దరు నిందితులకు కూడా బెయిల్ లభించి ఉంటే బాగుండేదని చెప్పారు. వారు కూడా తమ పిల్లలని చెప్పారు.
షాదాబ్ కు సుదీర్ఘ జైలు శిక్ష తరువాత బెయిల్ లభించిందని అన్నారు. ఐదు సంవత్సరాల తరువాత బెయిల్ ఇచ్చిందని చెప్పారు. మిగిలిన వారు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Next Story

