
బీహార్ ఓటర్ల సంఖ్య కుదించడమే ‘ఎస్ఐఆర్’ లక్ష్యమా?
ఏకపక్షంగా ఈసీ ఓట్లు తొలగిస్తోందని ఆరోపణలు చేస్తున్న విపక్షాలు
భారత ఎన్నికల సంఘం బీహార్ లో ఓటర్ల జాజితాను ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ(SIR) చేపట్టడంతో క్షేత్ర స్థాయిలో గందరగోళం నెలకొంది. బిహార్ లోని చాలా ప్రాంతాలలో బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులతో నిండిపోయిందని, ప్రభుత్వం జారీ చేసిన వాటికంటే 130 శాతం అధికంగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయని ఈసీ వాదిస్తోంది.
అయితే వీటికి ఎలాంటి ఆధారం లేదని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ఇవి రాజకీయంగా వ్యతిరేకతను రేకెత్తించాయి. ‘ ది ఫెడరల్’ తాజాగా నిర్వహించిన క్యాపిటర్ బీట్ లో సీనియర్ జర్నలిస్ట్ అశోక్ మిశ్రా, ఎన్నికల డేటా శాస్త్రవేత్త డాక్టర్ ప్యారేలాల్ గార్డ్ తమ విశ్లేషణను అందించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ ఎంత వరకూ వాస్తవం. ఇది ప్రతిపక్షాలు చెప్పినట్లు ఒక ప్రహసనమా?
డాక్టర్ ప్యారేలాల్ గార్గ్:
ఏకపక్ష వాదనలు, డేటా పారదర్శకత లేకుండా ఈ ప్రక్రియ నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే ఇది ఒక మోసంలా కనిపిస్తుంది. ఈసీ తన అధికారిన్ని మించి ప్రవర్తిస్తోంది.
పౌరసత్వాన్ని నిర్ణయించడానికి దానికి రాజ్యాంగ అధికారం లేదు. అయినప్పటికీ అది ఏకపక్షంగా వ్యవహరిస్తోంది. విదేశీ ఓటర్ల గురించి ధృవీకరించలేని వాదనలు ముందుకు తెస్తోంది. ప్రాథమికంగా లోపభూయిష్టమైన ప్రక్రియను నిర్వహిస్తోంది.
ఇది కేవలం పరిపాలన నిర్లక్ష్యం మాత్రమే కాదు. సరైన ప్రక్రియ లేకుండా భారతీయ పౌరులను విదేశీయులుగా ముద్ర వేయడం ద్వారా హక్కులను కోల్పోయే ప్రమాదం ఉంది.
అధ్వాన్నంగా ఇది ప్రజా నిధులను ఉపయోగించి జరుపుతోంది. ప్రజాస్వామ్య విధానానికి బహిష్కరణకు ఒక ప్రక్రియగా మారుస్తోంది. ఈసీ కేవలం అతిగా చేయడమే కాదు. పట్టపగలు రాజ్యాంగ రక్షణలను కూల్చివేస్తోంది.
ప్రజలను విదేశీ ఓటర్లుగా ఎవరు గుర్తిస్తున్నారు? బీఎల్ఓ నా?
అదే ఇబ్బందికరమైన విషయం. ఇది పరిశోధన ఆధారంగా జరిగిందని ఈసీ చెబుతోంది. కానీ మూలాలు అస్పష్టంగా ఉన్నాయి. వారు ధృవీకరించలేని అంచనాలు చెబుతున్నారు.
జనన మరణాల రేట్లు, కఠినమైన డేటా కాదు. ఎస్పీ జైన్ ఇన్సిస్టిట్యూట్, భారతీయ విద్యా భవన్ వంటి సంస్థలు ఇన్ పుట్ లను అందిస్తున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. కానీ వాటిలో పారదర్శకత లేదు.
క్షేత్ర స్థాయిలో బీఎల్ఓ లు కూడా తాము విదేశీ ఓటర్లను ఎదుర్కోలేదని చెబుతున్నారు. పౌరసత్వాన్ని నిర్ణయించాలంటే అది హోంమంత్రిత్వ శాఖ పని ఈసీ పనికాదు. ముందుగా నిర్ణయించిన ఎజెండాల కనిపించే దానిని సమర్థించుకోవడానికి కమిషన్ నకిలీ విద్యా అధ్యయనాలను ఉపయోగిస్తోంది.
ఓటర్లకు ఫారాలు, పత్రాలు నిరాకరించబడ్డాయా? బీహార్ లో మీరు ఏం గమనించారు?
అశోక్ మిశ్రా:
అక్కడ పూర్తిగా గందరగోళం నెలకొంది. బీఎల్ఓ లు ఇంటింటికి వెళ్లి మాట్లాడాల్సి ఉంటుంది. కానీ పాట్నాలో చాలా మంది పోలింగ్ బూత్ ల వద్ద నిలబడి ఓటర్లను తమ వద్దకు రమ్మని అడుగుతున్నారు.
అంతకంటే దారుణంగా పారిశుద్ధ్య కార్మికులకు ఖాళీ ఫారాల ఇవ్వడం నేను చూశాను. ఎపిక్ నంబర్లు లేని ఫారాలు, ఛాయాచిత్రాలు. పట్టణ ప్రాంతాల్లో ఇది చాలా గందరగోళంగా ఉంది.
కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇది వినాశకరమైనది. ఏ పత్రాలు ఆమోదయోగ్యమైనవో ఓటర్లకు తెలియదు. సుప్రీంకోర్టు పరిశీలన తరువాత కూడా ఒకే తరహ సూచన లేదు. బీఎల్ఓ లు గుడ్డిగా ఫారమ్ లను అప్ లోడ్ చేస్తున్నారు. పరిశీలన తరువాత ఉన్నతాధికారులకు వదిలివేస్తున్నారు.
ఫారమ్ స్క్రాప్ గా అమ్ముతున్నట్లు దొరికినట్లు చర్చ జరుగుతోంది? ఈ ప్రక్రియ గురించి అది ఏమి సూచిస్తుంది?
అశోక్ మిశ్రా:
అవును.. దేవ్ గఢ్ లో జిలేబీలను చుట్టడానికి ఫారమ్ లను ఉపయోగించారని నివేదికలు వస్తున్నాయి. ఒక విక్రేత వాటిని స్క్రాప్ గా కొన్నానని చెప్పాడు. ఇది ప్రక్రియ సమగ్రత పట్ల పూర్తి నిర్లక్ష్యం చూపిస్తుంది. ఇవి సున్నితమైన ఓటర్ డేటాను కలిగి ఫారమ్ లు ఉన్నప్పటికీ వాటిని తప్పుగా నిర్వహించి విస్మరిస్తున్నారు.
86 శాతం ఫారమ్ అప్ లోడ్ అయ్యాయని ఈసీ చెబుతోంది. కానీ వాస్తవానికి ఏమి అప్ లోడ్ చేశారో తెలియట్లేదు. చాలా సందర్భాలలో ప్రజలు ఆధార్, ఎపిక్ కార్డులను సమర్పించారు.
కానీ బీఎల్ఓ లు వాటిని ఎప్పుడూ ధృవీకరించలేదు. ఇది ధృవీకరణ లేకుండా జరుగుతున్న మాస్ డేటా ఆప్ లోడ్. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా లక్షలాది మంది ఓటర్ల భవిష్యత్ తో ఆటలాడుతోంది.
ఈ గందరగోళం ఉద్దేశపూర్వకంగా జరిగిందని మీరు అనుకుంటున్నారా? దీనివెనక లక్ష్యం ఏంటీ?
అశోక్ మిశ్రా:
ఈ గందరగోళం ఒక పథకం ప్రకారం జరిగినట్లు కనిపిస్తోంది. స్నేహపూర్వక మీడియా సంస్థలు అధికారిక సమాచారం లేకుండా లక్షలాది మంది విదేశీ పౌరులు జాబితాలో ఉన్నారని కథనాలు రాస్తున్నాయి. కానీ ఏ ఎన్నికల కమిషన్ అధికారి కూడా కచ్చితమైన సంఖ్యలతో ఇప్పటి వరకూ ముందుకురాలేదు.
ఎంపిక చేసిన ఓటర్లను తగ్గించడమే వీటి లక్ష్యం కావచ్చు. ముఖ్యంగా పెద్ద సంఖ్యలో అట్టడుగు వర్గాలలో ఉన్న జనాభా ఉన్న ప్రాంతాలలో మీరు ఓటర్ల సంఖ్యను కొన్ని కోట్ల మేర తగ్గిస్తే అది ఎన్నికల ఫలితాలను గణనీయంగా మార్చవచ్చు. అది పాలక పార్టీకి సహాయపడుతుంది. కానీ ఇది ఒక సమూహాన్ని మాత్రమే కాకుండా సమాజంతో సంబంధం లేకుండా అందరి ఓటర్లను ప్రభావితం చేస్తుంది.
పేర్లు తొలగించబడిన లేదా పౌరసత్వం తొలగించినా వారికి ఎలాంటి అవకాశం ఉంది?
డాక్టర్ ప్యారేలాల్ గార్గ్:
ఈసీ నుంచి ఈ విషయంలో స్పష్టత లేదు. కాలక్రమం కూడా తగ్గించారు. ‘సార్’ కూడా జూలై 25 నాటికి ముగుస్తుంది. తుది ఓటర్ జాబితా సెప్టెంబర్ 30 నాటికి సమర్పిస్తారు.
కానీ ఎవరైన అక్టోబర్ లో తమ పేరు లేదని తెలిస్తే ఏం చేయాలి? ఓటర్లు కోర్టుకు వెళ్లవచ్చు. కానీ పేద, అణగారిన వర్గాలకు అది నిజమైన ఛాన్స్ కాదు. వాస్తవంగా ప్రజా నిరసన మాత్రమే ఏకైక మార్గం కావచ్చు. జేపీ ఉద్యమానికి బీహార్ జన్మస్థలం. ప్రజలు ఎప్పుడూ మౌనంగా ఉండరని చరిత్ర చూపిస్తుంది.
ఇలాంటి ప్రక్రియలకు చారిత్రక ఉదాహారణ ఉందా? గతంలో ఇలాంటి సవరణలు జరగలేదా?
డాక్టర్ ప్యారేలాల్ గార్గ్
2015 లో ఈసీ ఎన్ఈఆర్పీఏపీ(జాతీయ ఎన్నికల జాబితా శుద్ది, ప్రామాణీకరణ కార్యక్రమం ప్రారంభించింది. కానీ అది స్పష్టమైన నియమాలు, సమయపాలన ధృవీకరణ తో జరిగిందిద. ఇప్పుడు జరుగుతున్నది మాత్రం తొందరపాటు, అస్పష్టత, రాజకీయంతో ఉంది.
ఈసీ సాధారణ ప్రక్రియను పునరావృతం చేయడం లేదు. వారు దానిని ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. ఈ ప్రక్రియ డేటా శుద్దీకరణ అనే నెపంతో ఓటర్ స్థావరాలను పసిగట్టడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు, సమగ్రతకు చాలా ప్రమాదకరం.
ఈ ప్రక్రియ సెప్టెంబర్ నాటికి అసంపూర్ణంగా ఉంటే.. ఎన్నికలు ఏమైన వాయిదా పడతాయా?
అశోక్ మిశ్రా
అది సాధ్యమే. 7.89 కోట్ల ఓటర్లలో సగం మాత్రమే ధృవీకరణ జరిగిందని ప్రభుత్వం చెబితే అది ఎన్నికలను ఆలస్యం చేయవచ్చు లేదా తగ్గించబడిన ఓటర్లతో ముందుకు సాగవచ్చు. అది కొన్ని పార్టీలకు మాత్రమే ప్రయోజనం చేకూర్చవచ్చు. ఈ ప్రక్రియ వల్ల లక్షలాది మంది తమ ఓటు హక్కును కోల్పోవచ్చు.
చాలాకాలంగా ఓటర్లుగా ఉన్న వారికి కూడా తాము ఇంకా ఓటర్ల జాబితాలో ఉన్నామో లేదో తెలియదు. గయలో నేను 70 ఏళ్ల వృద్దురాలిని కలిశాను. ఆమె దశాబ్దాలుగా ఓట్లు వేస్తున్నట్లు సూచించే బీఆర్ కోడెడ్, ఎపిక్ కార్డులు అందించింది. అయినప్పటికీ ఓటర్ జాబితాలో ఆమె పేరు లేదు. ఇవన్నీ ఎన్నికల సంక్షోభానికి దారి తీయవచ్చు.
మనం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము?
డాక్టర్ ప్యారేలాల్ గార్గ్:
ఒక ప్రజాస్వామ్య సంస్థ తన విశ్వసనీయతను కోల్పోవడాన్ని మనం చూస్తున్నాము. తగిన ప్రక్రియ లేకుండా ఈసీ పేర్లను తొలగిస్తే అది రాజ్యాంగంలోని ఆర్టికల్ 326ని ఉల్లంఘించడమే అవుతుంది. ఈ అర్హతను నిర్వచించే అధికారం కేవలం పార్లమెంట్ కు మాత్రమే ఉంది. ఈసీకి లేదు. ఇక్కడ ఎవరు ఓటు వేయాలి, ఎవరూ వేయకూడదు అనేది ముందే నిర్ణయించబడుతుంది.
Next Story