జమ్మూకాశ్మీర్: కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇక్కడి వారేమంటున్నారు
x

జమ్మూకాశ్మీర్: కేజ్రీవాల్ అరెస్ట్ పై ఇక్కడి వారేమంటున్నారు

కాశ్మీర్ లో కేజ్రీవాల్ అరెస్ట్ పై మిశ్రమ స్పందనలు వచ్చాయి. సామాన్యులు ఢిల్లీ సీఎంపై జైలుకు వెళ్లడంపై ఆనందం వ్యక్తం చేయగా, రాజకీయ నాయకులు..


ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నాటకీయంగా అరెస్టు చేయడంపై కాశ్మీర్ భిన్నంగా స్పందించింది. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలు వ్యంగ్యంగా వ్యాఖ్యనాలు వినిపించగా, కొన్ని కేజ్రీవాల్ కు సమర్థనగా వచ్చాయి. మరికొంత ఆందోళన వెలిబుచ్చారు.

కేజ్రీవాల్ 2019 ట్వీట్
ఐదేళ్ల క్రితం కేజ్రీవాల్ చేసిన ట్వీట్‌ను జమ్మూ కాశ్మీర్‌లోని చాలా మంది మరిచిపోలేదు. ఆగస్టు 5, 2019, మధ్యాహ్నం 1.05 గంటలకు, కేజ్రీవాల్ 370, 35A అధికరణలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ, జమ్మూ కాశ్మీర్‌కు సెమీ అటానమీ ప్రత్యేక హోదాను సమర్ధిస్తూ అభినందన ట్వీట్‌ను పోస్ట్ చేశారు.

“జమ్మూ కాశ్మీర్ పై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మేము మద్దతు ఇస్తున్నాము. దీనివల్ల రాష్ట్రంలో శాంతి, అభివృద్ధి నెలకొంటాయని ఆశిస్తున్నాం' అని ఆయన అప్పట్లో ట్వీట్ చేశారు. ఢిల్లీ సీఎం చేసిన ఆ ట్వీట్‌కు 10,000 రీపోస్ట్‌లు, 4,000 కోట్ ట్వీట్‌లు 90,000 లైక్‌లు వచ్చాయి. సామాజిక మాధ్యమం X లో యాక్టివ్‌గా ఉన్న కాశ్మీరీ యూజర్లు ఘూటు వాయిస్ లో ఇప్పుడు తమ ప్రతిస్పందనను తెలియజేశారు.
“ఢిల్లీ సిఎం పై ఈడీ చర్యను మేము స్వాగతిస్తున్నాము. ఢిల్లీ శాశ్వత శాంతి, అభివృద్ధిని కనుగొంటుందని మేము ఆశిస్తున్నాము" అని జునే భయా అనే యూజర్ ట్వీట్ చేశారు. ఫేస్‌బుక్‌లో మరొక కాశ్మీరీ సుదీర్ఘమైన పోస్ట్‌లో ఇలా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “కేజ్రీవాల్ ఆర్టికల్ 370 & 35 A ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తే ఆనందంతో గెంతులు వేశాడు. ఇదే చట్టవిరుద్దమైన అంశంతో బీజేపీ ఇప్పుడు అతడిని కటకటాల్లోకి నెట్టింది. ఇది అతడు కలలో కూడ ఊహించి ఉండడు. ఇప్పుడు తీహార్‌లో మీ సమయాన్ని ఆస్వాదించండి మిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ జీ ” తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.
రాజకీయ విశ్లేషకులు..
కాశ్మీర్ లోయకు చెందిన రాజకీయ వ్యాఖ్యాత రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.. కాశ్మీరీ సోషల్ మీడియా వినియోగదారులు కేజ్రీవాల్‌పై విరుచుకుపడటం ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించదు. "2019లో ఆర్టికల్ 370 రద్దును కేజ్రీవాల్ బహిరంగంగా సమర్ధించినందున, కాశ్మీర్‌లోని కొంతమంది ఢిల్లీ సిఎం ఇప్పుడు అరెస్ట్ అయితే వారు ఎందుకు స్పందించకుండా ఉంటారు". కాశ్మీర్‌కు చెందిన ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నూర్ అహ్మద్ బాబా ఢిల్లీ సిఎం అరెస్టు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి "నాయకత్వం లేనిది" విశ్లేషించారు
కేజ్రీవాల్‌ అరెస్టులోని చట్టపరమైన అంశాన్ని పక్కనబెట్టి రాజకీయాలను చూడాల్సిందేనన్నారు. "ఢిల్లీలో, జాతీయ స్థాయిలో రాజకీయ పరిస్థితులను ఇది ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి," అని నూర్ బాబా ది ఫెడరల్‌తో అన్నారు.
ప్రొఫెసర్ బాబా దృష్టిలో, తాజా పరిణామం “ప్రతిపక్ష కూటమిని బలపరుస్తుందా అయితే అది ఏ మేరకు ?” అనేది కూడా చూడవలసి ఉంది. రాజకీయాలలో ఐదు దశాబ్దాల అనుభవం ఉన్న J&K సీనియర్ రాజకీయ పరిశీలకులలో ఒకరు, కేజ్రీవాల్ అరెస్టు "జాతీయ రాజకీయాల్లో ఒక కీలక పరిణామం" అని అన్నారు.
“ఇది అరవింద్ కేజ్రీవాల్ ను హీరోగా చేయవచ్చు. లేదా ఏదైన జరగవచ్చు. ఏది ఏమైనప్పటికీ, రాబోయే ఒక వారం పది రోజుల్లో ఏం విషయాలు ఎలా జరుగుతాయనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది, ”అని పేర్కొన్నారు. మరోవైపు రాజకీయ నాయకులు కేజ్రీవాల్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. J&K మాజీ CM నేషనల్ కాన్ఫరెన్స్ (NC) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా, కేజ్రీవాల్ అరెస్టును రాబోయే లోక్‌సభ ఎన్నికలతో ముడిపెట్టారు.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు ఎన్నికలతో ముడిపడి ఉందని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రకటన వెలువడిన కొద్ది రోజుల్లోనే, సిట్టింగ్ సీఎం, ప్రతిపక్ష కూటమికి చెందిన ఒక ముఖ్యమైన భాగస్వామిని ED ఏకపక్షంగా అరెస్టు చేయడాన్ని మీరు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
అతని అరెస్టు దేశంలోని ప్రజాస్వామ్య సంస్థ క్రమంగా క్షీణించిన దానిలో ఒక సాక్ష్యం ”అని అబ్దుల్లా ఒక వీడియో ప్రకటనలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అవినీతి ఆరోపణల కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌ను గతంలో అరెస్టు చేసిన విషయాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.
2023 మధ్యలో ఢిల్లీ ప్రభుత్వ అధికారుల అధికారాలను కత్తిరించే ఆర్డినెన్స్ ను కేంద్ర ప్రభుత్వం జారీ చేసినప్పుడు కేజ్రీవాల్ దేశంలోని ప్రతిపక్ష పార్టీల మద్ధతును కోరాడు. అప్పట్లో కేజ్రీవాల్ పై సానుభూతి చూపే పరిస్థితి అబ్దుల్లాకు లేదు. “ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడ ఉన్నారు? అప్పట్లో ప్రభుత్వానికి మద్దతిచ్చిన ఆయన నేడు ఇతర పార్టీల మద్దతు అడుగుతున్నారు’’ అని అబ్దుల్లా వ్యాఖ్యానించారు.
రాజకీయ ప్రతీకారం: ముఫ్తీ
J&K మాజీ ముఖ్యమంత్రి అయిన మెహబూబా ముఫ్తీ, కేజ్రీవాల్‌ను "నిర్దోషిగా నిరూపించేంత వరకు నిర్దోషి" అని అభివర్ణించింది. కాశ్మీర్ కమ్యూనిస్ట్ నాయకుడు ఎంవై తరిగామి కేజ్రీవాల్ అరెస్టును "విచారకరమైన సంఘటన"గా అభివర్ణించారు.

“ఇటువంటి చర్యలు భారతదేశ అంతర్జాతీయ ప్రతిష్టను దెబ్బతీస్తాయి. తన రాజకీయ లబ్ధి కోసం అన్ని ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నప్పటికీ, అధికార బిజెపి ప్రభుత్వం ఎన్నికల్లో అధికారాన్ని పొందేందుకు భయాన్ని ఆయుధంగా ఉపయోగించుకోవడానికి ఇప్పటికీ వెనుకాడకపోవడం ఆశ్చర్యంగా ఉంది, ”అని తరిగామి ఫెడరల్‌తో అన్నారు.
ఆప్ కార్యకర్తలు నిరసనకు దిగారు
ఇంతలో, కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా తమ నిరసనను నమోదు చేయడానికి శ్రీనగర్‌లోని ప్రెస్ ఎన్‌క్లేవ్‌లో అనేక మంది AAP కార్యకర్తలు , ED చర్యకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. వారిని పోలీసులు వెంటనే అక్కడి నుంచి తప్పించారు.
Read More
Next Story