వామ్మో.. ఎంత డబ్బు.. అది కూడా పని మనిషి ఇంట్లో..
x

వామ్మో.. ఎంత డబ్బు.. అది కూడా పని మనిషి ఇంట్లో..

జార్ఖండ్ రాజధాని రాంఛీలోని ఓ ఇంటిపై ఈడీ దాడులు చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. నోట్ల కట్టలు లభించిన వ్యక్తికి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రికి సంబంధం ఉన్నట్లు..


జార్ఖండ్ లోని ఓ ఇంటి నుంచి కొంతమంది అధికారులు నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. సామాజిక మాధ్యమంలో వైరల్ అవతున్న ఫొటో రాంఛీలోని గడిఖానా చౌక్ లోని ఓ బిల్డింగ్ దని తేలింది. ఇలా కరెన్సీ నోట్లను బయటకు తీస్తున్న వారు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులని తెలుస్తోంది. డబ్బులు దొరికిన వ్యక్తికి జార్ఖండ్ రూరల్ డెవలప్ మెంట్ మంత్రి, అలంగీర్ ఆలం కార్యదర్శితో సంబంధం ఉన్నట్లు తేలింది. వాళ్ల ఇంటి పనిమనిషి ఇంటిపై ఈడీ దాడులు చేసినప్పుడు ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి.

రూ.20-30 కోట్లు ఉండవచ్చు
ఈ దాడుల్లో పట్టుబడ్డ విలువ దాదాపు రూ. 20-30 కోట్ల వరకు ఉండవచ్చని, కచ్చితమైన మొత్తాన్ని నిర్ధారించేందుకు కౌంటింగ్ మెషీన్లను ఉపయోగిస్తున్నట్లు ED వర్గాలు జాతీయ మీడియాకు తెలిపాయి. దొరికిన నగదు మొత్తం రూ. 500 నోట్ల డినామినేషన్ లో ఉంది. ఇందులో కొన్ని ఆభరణాలు కూడా దొరికినట్లు వార్తలు ప్రసారం అయ్యాయి.

ఆలం (70) జాతీయ మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయానికి సంబంధించి ఇప్పటివరకు "అధికారిక సమాచారం లేదు". "నేను టీవీ చూస్తున్నాను కొన్ని వార్తలు మాత్రం.. ప్రభుత్వం నాకు అందించిన అధికారిక PS (ప్రైవేట్ సెక్రటరీ)కి లింక్ చేయబడిందని చెబుతోంది," అన్నారాయన. ఆలం కాంగ్రెస్ నాయకుడు జార్ఖండ్ అసెంబ్లీలో పాకూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రైడ్ జరిగిన వ్యక్తి ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కోసం పనిచేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
పీఎంఎల్ఏ కేసు..
గత ఏడాది ఈడీ అరెస్టు చేసిన గ్రామీణాభివృద్ధి శాఖ మాజీ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర కుమార్ రామ్‌ తో ఈ సోదాలకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనపై దర్యాప్తు సంస్థ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది.
"రాంచీలోని గ్రామీణ పనుల విభాగంలో చీఫ్ ఇంజనీర్‌గా నియమితులైన వీరేంద్ర కుమార్ రామ్, కాంట్రాక్టర్లకు టెండర్ల కేటాయించినందుకు బదులుగా వారి నుంచి కమీషన్ తీసుకునేవాడని గత ఏడాది అరెస్ట్ సందర్భంగా దర్యాప్తు సంస్థ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ నెలలో ఆ అధికారికి సంబంధించిన దాదాపు 39 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.
"ఈ విధంగా నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వీరేంద్ర కుమార్ రామ్, అతని కుటుంబ సభ్యులు చాలా విలాసవంతమైన జీవనశైలిని గడపడానికి ఉపయోగించారు" అని పేర్కొంది.
జార్ఖండ్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఫిర్యాదు మేరకు రామ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు అయింది.


Read More
Next Story