నేడు లోక్ సభలోకి వక్ఫ్ సవరణ బిల్లు
x

నేడు లోక్ సభలోకి వక్ఫ్ సవరణ బిల్లు

యూనివర్శిటీలపై కొత్త బిల్లు ప్రవేశపెట్టనున్న కేంద్ర హోంమంత్రి


వక్ఫ్ సవరణ బిల్లుపై పార్లమెంట్ ఏర్పాటు చేసిన జేపీసీ నేడు లోక్ సభలో తన నివేదికను ప్రవేశపెట్టబోతోంది. బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నివేదిక సభకు ఇవ్వడానికి సమయం ఇచ్చినట్లు లోక్ సభ నివేదిక తెలిపింది.

బిల్లును పరిశీలించిన కమిటీ గత గురువారమే నివేదిను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేసింది. దేశంలో వక్ప్ బోర్డు ఏకపక్షంగా చేస్తున్న అరాచకాలకు ఈ బిల్లులో తగినవిధంగా ఉపశమనాలు ప్రజలకు లభించబోతున్నాయి. ఇంతకుముందులా ఏకపక్షంగా వక్ఫ్ బోర్డు ఏదైన ఆస్థిపై క్లెయిమ్ చేస్తే తను నాదే అని నిరూపించుకోవాలి అంటే ఆధారాలు సమర్పించాల్సిందే.

అయితే వక్ఫ్ సవరణ బిల్లు సందర్భంగా జేపీసీ వ్యవహరించిన తీరుపై ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ అయితే దీన్ని ఓ ప్రహసనంగా మార్చేశారని ఆరోపించారు.
అలాగే ఇవ్వాళ లోక్ సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ‘త్రిభువన్ సహకరి యూనివర్శిటీ బిల్లును’ ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వం వక్ప్ సవరణ బిల్లుతో పాటు మరో మూడు కొత్త ముసాయిదా చట్టాలను పార్లమెంట్ బడ్జెట్ సెషన్ లో పరిశీలన కోసం జాబితా చేసింది.
ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగంతో శుక్రవారం సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 బడ్జెట్ ను శనివారం ప్రవేశపెట్టారు. బడ్జెట్ సెషన్ మొదటి దశ ఫిబ్రవరి 13న ముగుస్తుంది. రెండో దశ సమావేశాలు మార్చి 10 నుంచి ప్రారంభం అయి, ఏప్రిల్ 4న ముగుస్తాయి.
Read More
Next Story