
ప్రధాని నరేంద్ర మోదీ
నేపాల్ కు శాంతి, స్థిరత్వం ‘కర్కి’ తీసుకొస్తారు: మోదీ
భారత్ మద్దతుగా నిలుస్తుందని హమీ
నేపాల్ కొత్త ప్రధానిగా సుశీలా కర్కి నియమాకాన్ని ప్రధాన నరేంద్ర మోదీ సమర్థించారు. దీనిని మహిళా సాధికారితకు ఒక ఉదాహారణగా అభివర్ణించారు. కొత్త నేపాల్ ప్రధాని హిమాలయ దేశంలో స్థిరత్వానికి నాంది పలుకుతారని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో జరిగిన ర్యాలీలో మోదీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. భారత్, నేపాల్ కు దగ్గర సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఉమ్మడి చరిత్ర, విశ్వాసం, సాంస్కృతిక అంశాలు, సంబంధాలు ముడిపడి ఉన్న స్నేహితులమన్నారు. పరివర్తన దశలో పొరుగు దేశ ప్రజలతో భారతదేశం దృఢంగా అండగా నిలుస్తుందని ప్రధాని మోదీ హమీ ఇచ్చారు.
‘‘భారత్ లోని 140 కోట్ల మంది భారతీయుల తరఫున నేను కర్కిని అభినందిస్తున్నాను. నేపాల్ లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు ఆమె మార్గం సుగమం చేస్తారని నాకు నమ్మకం ఉంది’’ అని ప్రధాని అన్నారు.
రాజకీయ అల్లకల్లోలాల మధ్య గత కొన్ని రోజులుగా పౌరులు, ముఖ్యంగా యువకులు, మహిళలు, భవనాలను శుభ్రపరచడం, రంగులు వేయడంలో ఎలా పాల్గొన్నారో ఆయన గుర్తు చేశారు. నేపాలీ ప్రజల స్థితిస్థాపకతను కూడా ప్రధానమంత్రి ప్రశంసించారు.
‘‘ఇంతటి అల్లకల్లోల సమయాలలో కూడా ప్రజాస్వామ్య విలువలను అత్యున్నతంగా నిలిపిన నేపాల్ ప్రజలను కూడా నేను అభినందిస్తున్నాను’’ అని మోదీ అన్నారు. వారిది సానుకూల మనస్తత్వం అని, నిర్మాణాత్మక చర్యలు నేపాల్ పునర్జీవనానికి స్ఫూర్తిదాయకంగా మాత్రమే కాకుండా స్పష్టమైన సూచనగా కూడా ప్రధానమంత్రి అభివర్ణించారు.
రెండు దేశాలు కలిసి ముందుకు..
రెండు దేశాలు కలిసి ముందుకు సాగుతాయని ప్రధాని చెప్పారు. నేపాల్ ప్రజాస్వామ్య ప్రయాణానికి, స్థిరత్వం కోసం దాని ఆకాంక్షకు మద్దతు ఇవ్వడానికి న్యూఢిల్లీ నిబద్దతను ఆయన పునరుద్ఘాటించారు.
అంతకుముందు రోజు నేపాల్ లో శాంతి, శ్రేయస్సునను పెంపొందించడానికి భారత్ చిత్తశుద్దితో ఉందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన కర్కికి అభినందనలు తెలిపారు.
‘‘నేపాల్ తాత్కాలిక ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన రైట్ హానరేట్డ్ శ్రీమతి సుశీలా కర్కికి నా శుభాకాంక్షలు. నేపాల్ ప్రజల శాంతి, పురోగతి, శ్రేయస్సులు భారత్ ధృడంగా మద్దతునిస్తుంది’’ అని ప్రధాని తన పోస్ట్ లో చెప్పారు.
నేపాల్ లో ఏం జరిగింది..
నేపాల్ లో జెన్ జెడ్ ఆందోళనల తరువాత కేపీ శర్మ ఓలి, ఆయన ప్రభుత్వ రాజీనామా చేసిన తరువాత రోజుల అనిశ్చితికి ముగింపు పలుకుతూ కర్కీని ప్రధానిగా నియమించారు.
అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్, సీనియర్ సైనిక అధికారులు, నిరసనలను నిర్వహించిన యువ ప్రతినిధులతో జరిగిన చర్చల అనంతరం ఈ పరిణామం జరిగింది.
Next Story