‘ మీరు ఓటుతో సాధికారిత సాధించారు’ : మోదీ
x

‘ మీరు ఓటుతో సాధికారిత సాధించారు’ : మోదీ

దశాబ్దాల పాటు ఇక్కడ మూడు కుటుంబాలు మాత్రమే అధికారంలో ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని, కాశ్మీరీ యువత హక్కులను తుంగలో తొక్కారు. ఇప్పుడు మోదీ హాయాంలో పరిస్థితి పూరిగా..


జమ్మూ కాశ్మీర్‌లోని యువత తమ ప్రజాస్వామ్య ఓటుతో మార్పును తీసుకురాగలదనే నమ్మకంతో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీలో అన్నారు. శ్రీనగర్‌లో బిజెపి అభ్యర్థులకు మద్దతుగా జరిగిన బహిరంగ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ, కాశ్మీర్ యువత సాధికారతకు మొదటి అడుగు అని అన్నారు.

రాష్ట్ర ఏర్పాటుకు హమీ..
భారీ భద్రత ఉన్న షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో ప్రధాని మాట్లాడుతూ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామన్న తన వాగ్దానాన్ని భారతీయ జనతా పార్టీ నెరవేరుస్తుందని అన్నారు.
"నా జమ్మూ కాశ్మీర్ యువత నిస్సహాయంగా లేరు. మోదీ ప్రభుత్వంలో వారంతా సాధికారత పొందుతున్నారు" అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలపై మోదీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మూడు పార్టీలు ప్రజాస్వామ్యాన్ని, 'కాశ్మీర్‌ని' తుంగలో తొక్కాయని ఆరోపించారు.
ప్రత్యర్థులపై మోదీ ఎదురుదాడి..
1980ల్లో ఏం చేశారో గుర్తుందా.. జమ్మూకశ్మీర్‌ రాజకీయాలను తమ సొంత కుంటుంబంగా చూసుకున్నారు.. తమ కుటుంబాలు తప్ప మరెవరూ ముందుకు రాకూడదనుకున్నారు.. లేకుంటే పంచాయతీ, డీడీసీ, బీడీసీ ఎన్నికలను ఎందుకు ఆపారు? అని ప్రశ్నించారు.
తమ కుటుంబ పాలనకు సవాల్‌ విసిరే కొత్త ముఖాలు వస్తాయని వారికి తెలుసు.. వారి స్వార్థం వల్ల కలిగే నష్టమేంటి?.. యువతకు ప్రజాస్వామ్యంపై నమ్మకం పోయింది.. ఓటు వేసినా వేయకపోయినా.. ఈ మూడు కుటుంబాలే అధికారంలోకి వస్తాయని భావించారు. ," అన్నాడు.
ప్రజాస్వామ్యం పునరుద్ధరణ అయింది..
గత ఐదేళ్లలో జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి చాలా మారిపోయిందని, ఇది ప్రజాస్వామ్య ప్రక్రియపై యువత విశ్వాసాన్ని పునరుద్ధరించిందని ప్రధాని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయని ఇదే ప్రజాస్వామ్య పునరుద్ధరణకు నిదర్శనం అని వ్యాఖ్యానించారు.
"ఇంతకుముందు ఎన్నికలు జరిగిన పరిస్థితులను గుర్తుంచుకోండి. సాయంత్రం 6 గంటలకు ప్రచారాలు ఆగిపోతాయి. ఇంటింటికీ ప్రచారం అసాధ్యం. కానీ కాంగ్రెస్, ఎన్‌సి, పిడిపి మాత్రమే సంతోషంగా ఉండేవి" అని ఆయన విమర్శించారు.

"ఈరోజు, ప్రచారం అర్థరాత్రి జరుగుతుంది. ఇప్పుడు, ప్రజలు ప్రజాస్వామ్యాన్ని జరుపుకుంటున్నారు. యువత మళ్లీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం పొందారు, వారు తమ ఓటు, వారి ప్రజాస్వామ్య హక్కు, మార్పును తీసుకురాగలరని భావిస్తారు. ఈ ఆశ సాధికారతకు మొదటి అడుగు" అని ఆయన అన్నారు.


Read More
Next Story