‘అయోధ్యకి కేఎఫ్ సి, వస్తానంటే వద్దంటామా
x

‘అయోధ్యకి కేఎఫ్ సి, వస్తానంటే వద్దంటామా

అయోధ్యలో దుకాణం తెరిచేందుకు అంతర్జాతీయ ఫుడ్ చైన్స్ ఆసక్తి చూపుతున్నాయి. రావచు, అయితే... షరతులు వర్తిస్తాయి అంటున్న అధికారులు,


హిందూవులు పవిత్రంగా భావించే అయోధ్య నగరంలో భక్తుల రద్దీ రోజు రోజుకి విపరీతంగా పెరిగిపోతోంది. ఆలయం ప్రారంభించిన జనవరి 22 నుంచి జనవరి 29 వరకే దాదాపు 19 లక్షల మంది భక్తులు బాలరాముడిని దర్శించుకున్నారు. దీనితో భక్తులకు అవసరమైన ఫుడ్ కోర్టుల దుకాణాలు ఏర్పాటు చేయడంపై జిల్లా అధికార యంత్రాంగం దృష్టి పెట్టింది.

"అయోధ్యలో తమ దుకాణాలను ఏర్పాటు చేయడానికి పెద్ద ఫుడ్ చైన్ అవుట్ లెట్ ల నుంచి మాకు అప్లికేషన్ లు వస్తున్నాయి. మేము వారందరిని ముక్తకంఠంతో స్వాగతిస్తున్నాం. అయితే ‘పంచ్ కోసి’ లోపల మద్యం, మాంసాహార పదార్థాలను అందించకూడదు. ఈ నిబంధనలు పాటించాలి " అని ప్రభుత్వ అధికారి విశాల్ సింగ్ మీడియాకు చెప్పారు.

ప్రసిద్ద అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ కెంటకీ ప్రైడ్ చికెన్ సెంటర్ కూడా అయోధ్యకి రావచ్చని ఆయన ఆహ్వానించారు. ప్రస్తుతం అయోధ్యలో కొన్ని పరిమితులు ఉన్నందున అయోధ్య- లక్నో హైవే పై కేఎఫ్ సీ రెస్టారెంట్ ఉంది. " అయోధ్యలో మేము మాంసాహర పదార్థాలను అనుమతించడం లేదు. అందుకే కేఎఫ్సీ హైవే పై ఉంది. అయితే శాకాహార పదార్థాలను అందించాలని నిర్ణయం తీసుకుంటే మేము సంతోషించి, స్థలం కూడా చూపిస్తాం" అని ఆయన ప్రకటించారు. అయితే కేఎఫ్సీ లో ఈ విధానానికి ఆస్కారం ఉందా అని సందేహం వ్యక్తం చేశారు. అనేక వెరైటీల్లో మాంసాహారన్ని ఈ సంస్థ అందిస్తుందని, ఇది కొంచెం కష్టమన పనే కావచ్చని అన్నారు.

త్వరలో అయోధ్య మొత్తంలో శాకాహార ఫుడ్ కోర్టులు అందుబాటులోకి వస్తాయని, జనవరి 22 నుంచి అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట తరువాత మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించినట్లు జిల్లా యంత్రాంగం వెల్లడించింది. భారీ సంఖ్యలో అయోధ్యకి తరలివస్తున్న ప్రజలను నియంత్రించడానికి, అవసరమైన షాపింగ్ కాంప్లెక్స్ లు, అతిపెద్ద ఆహార గొలుసులు గల సంస్థలను ఏర్పాటు చేయడానికి కావాల్సిన ప్రణాళికలు వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుపుకున్న బాలరాముడిని చూడడానికి రోజుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు వస్తారని, ఆలయం పై ఒత్తిడి పడకుండా చూడడంతో పాటు, అవసరమైన సౌకర్యాలు కూడా అందేలా చూడాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయని జిల్లా అధికారులు అంటున్నారు.

పిజ్జా రూ. 5000 కి అమ్మకం

ఆలయం ప్రారంభం రోజున విపరీతమైన రద్దీ ఉందని, ఒక్కో పిజ్జాను రూ. 5000 కు విక్రయించినట్లు దినేష్ యాదవ్ అనే నిర్వాహకుడు చెప్పాడు. ఆలయ పరిసరాల్లో ఇదొక్కటే పిజ్జా షాప్ ఉండడంతో డిమాండ్ విపరీతంగా ఉందని, దానిని తట్టుకోవడానికి రేట్లు పెంచాల్సి వచ్చిందని చెప్పాడు. నగరంలో పని చేయడానికి మెనూ మొత్తాన్ని వెజ్ గా మార్చామని వెల్లడించారు.

ఇక మాల్ ఆఫ్ అవధ్ ప్రాంతంలో ఉన్న మరొక పిజ్జా షాప్ మాత్రం ఆలయ ప్రారంభం రోజు సాధారణంగానే తమ కార్యకలాపాలను నిర్వహించినట్లు దాని నిర్వాహాకులు అవధ్ కుమార్ వర్మ చెప్పారు. రామ్ మార్గ్ లో షాప్ తెరవడానికి అవసరమైన స్థలం కోసం చూస్తున్నాం. అలా అయితేనే మాకు సంతోషం గా ఉంటుందని అన్నారు.

అయోధ్య మాత్రమే కాదు.. హరిద్వార్, వారణాసి, రిషికేష్, బృందావన్ వంటి హిందూ పుణ్య క్షేత్రాలతో పాటు ప్రసిద్ది చెందిన అనేక భారతీయ పురాతన నగరాల్లో కూడా నాన్ వెజ్ విధానాన్ని అమలు చేస్తున్నాయి.

Read More
Next Story