నదిలో మునిగిన టీ 72, ఐదుగురు జవాన్లు..
x

నదిలో మునిగిన టీ 72, ఐదుగురు జవాన్లు..

లద్దాక్ లో ఆకస్మాత్తుగా సంభవించిన వరదల వల్ల ఐదుగురు భారత సైనికులు గల్లంతు అయ్యారు. టీ 72 యుద్ద ట్యాంకుతో చుశుల్ ప్రాంతంలో..


భారత సైన్యానికి చెందిన ఐదుగురు జవాన్లు నదీలో గల్లంతు అయ్యారని అధికారులు ప్రకటించారు. శనివారం ఉదయం న్యోమా చుషుల్ ప్రాంతంలో సైన్యం రోజువారీగా డ్రిల్స్ చేస్తున్నాయి. ఈ క్రమంలో టీ 72 ట్యాంకులో ప్రయాణిస్తున్న సైనికులు నదీని దాటుతున్న సమయంలో ఆకస్మాత్తుగా పెరిగిన వరదతో సైనికులు గల్లంతు అయ్యారు.

లేహ్‌కు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్న మందిర్ మోర్ అనే ప్రాంతంలో ఉదయం సైనిక డ్రిల్స్ చేస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. నదిలో ట్యాంకు మునిగిపోవడం, చలి తీవ్రత అధికంగా ఉండటంతో సైనికులు మృత్యువాత పడ్డారు. లడఖ్‌లో నదికి అడ్డంగా ట్యాంక్‌ను తీసుకెళ్తుండగా జరిగిన దురదృష్టవశాత్తు ప్రమాదంలో ఐదుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విచారం వ్యక్తం చేశారు. దీనిపై సైన్యం వెంటనే స్పందించి రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించింది. మిగిలిన వివరాలు తెలియాల్సి ఉంటుంది.


Read More
Next Story