ఆర్జేడీ అధినేతగా తప్పుకున్న లాలూ ప్రసాద్ యాదవ్
x

ఆర్జేడీ అధినేతగా తప్పుకున్న లాలూ ప్రసాద్ యాదవ్

బాధ్యతలు చేపట్టిన కుమారుడు తేజస్వీ యాదవ్


మాజీ డిప్యూటీ సీఎం, ప్రస్తుత బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత తేజస్వీ శర్మ ను రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఇన్నాళ్లు పార్టీ చీఫ్ గా మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నారు. పాట్నాలో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇక నుంచి పార్టీని తేజశ్వీ యాదవ్ నడిపించనున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రిగా పని చేసిన యాదవ్ కు పార్టీలో ప్రాధాన్యం పెరగడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమావేశంలో తీర్మానం చేశారు. లాలూతో సంప్రదింపులు జరిపి పార్టీ రాజ్యాంగం, పార్టీ టికెట్, ఎన్నికల గుర్తులో సవరణలు ఇలా అనేక అంశాల్లో నిర్ణయం తీసుకునే అధికారాన్ని తేజస్వీకి కట్టబెట్టారు. ఇండి కూటమిలో ఆర్జేడీ కీలకమైన భాగస్వామిగా ఉంది. గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆర్జేడీ తరుఫున యాదవ్ ప్రధాన ప్రచార కర్తగా ఉన్నారు.

ఇది చాలా పెద్ద బాధ్యత
పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడాడు. ‘‘ ఇది పెద్ద బాధ్యత, బీహార్ ను దేశంలోని అగ్రరాష్ట్రాల్లోకి తీసుకెళ్లాలి. అందరితో కలిసి నడవడానికి సిద్దంగా ఉన్నాను. రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి విజన్, బ్లూ ప్రింట్ మాకు ఉన్నాయి’’ అని వెల్లడించారు. లోక్ సభలో విపక్షాల రాహుల్ గాంధీ తన పాట్నా నివాసానికి వెళ్లి సమావేశం కానున్నారు.
ఈ ఏడాది ఎన్నికలు..
బీహార్ అసెంబ్లీకి ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఇక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలో ఉంది. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆర్జేడీ ఒంటరిగా పోటీ చేయడానికి సిద్దమవుతోందని రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు విషయంలో పొసగడం లేదని స్థానిక విషయాలు బట్టి చూస్తే తెలుస్తొంది.
Read More
Next Story