IAS కావాలని 28 లక్షల జీతం కొలువు మానేశాడీయన
x
ఆయుష్ గోయెల్, ఐఏఎస్

IAS కావాలని 28 లక్షల జీతం కొలువు మానేశాడీయన

అదీ సివిల్ సర్వీస్ లకున్న వశీకరణ శక్తి.. సివిల్స్ కొట్టాలని సినిమా చాన్స్ లు వదులుకుంటున్నారు. లక్షల జీతం వచ్చి ప్రైవేటు ఉద్యోగాలు వదులుుంటున్నారు. కారణం...


కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారికి జీవితంలో డబ్బు సంపాదనతో బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడం కన్నా.. నచ్చిన రంగంలోకి వెళ్లి అనుకున్నది సాధించాలనుకుంటారు. అలాంటి వారికి దేశ సేవ చేయాలన ఆలోచన ఒక్కసారి మొదలయిందా అది ఇక ఆగదు. దానికోసం ఎన్నిలక్షల రూపాయల జీతం తీసుకుంటున్నా సరే వదిలి వస్తుంటారు కొంతమంది యువకులు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఆయుష్ గోయెల్, ఐఏఎస్.

ఆయుష్ గోయెల్ సివిల్స్ రాయడాకంటే ముందు జేపీ మోర్గాన్ కంపెనీలో ఆర్థిక విశ్లేషకుడిగా పని చేశారు. సంవత్సరానికి రూ. 28 లక్షల వేతనం. దాంతో కుటుంబం మొత్తం ఫుల్ హ్యపీ. అయితే ఉన్నట్లుండి ఆయుష్ ఉద్యోగాన్ని వదిలి సివిల్స్ రాయడానికి సిద్దమైయ్యాడు. ఈ నిర్ణయాన్ని ఇంట్లోను, బయట స్నేహితులు వ్యతిరేకించారు. అయిన సరే తను పట్టు వదల్లేదు. అందరిని ఒప్పించి పరీక్షలకు సిద్ధం అయ్యాడు.

తండ్రి సుభాస్ చంద్ర గోయెల్ ఓ కిరాణం దుకాణం నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. వచ్చేది అంతంత ఆదాయం. అయినా సరే పిల్లలను బాగా చదివించాలని అనుకున్నాడు. పిల్లల స్కూల్ విద్య వరకూ ఎలాగూ నెట్టుకొచ్చిన తరువాత అప్పులు చేస్తూ వారికి అవసరమైన చదువు చెప్పించాడు.

తండ్రి కష్టానికి ప్రతిఫలంగా అన్నట్లుగా ఆయుష్ పదవ తరగతిలో 91.2 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. 12 వ తరగతిలో 96.2 శాతం మార్కులు వచ్చాయి. తరువాత ఢిల్లీలోని హన్స్ రాజ్ కాలేజ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. తరువాత CAT కోసం తన ప్రిపరేషన్ ప్రారంభించాడు. అందులో మంచిర్యాంక్ రావడంతో కేరళలోని ఐఐఎం కోజికోడ్ లో చదువు పూర్తి చేశాడు. ఈ చదువు కోసం తండ్రి దాదాపు రూ. 20 లక్షల వరకూ అప్పు చేశాడు. అయితే ప్రముఖ ఎంఎన్సీ జేపీ మోర్గాన్ లో ఆర్థిక విశ్లేషకుడిగా ఉద్యోగం రావడంతో అప్పులన్నీ తీర్చేశాడు. దాంతో కుటుంబం మొత్తం సంతోషపడింది.

ఆనందం మాయం

అయితే ఉద్యోగ జీవితం అంతగా నచ్చకపోవడం, దేశ సేవ చేయాలనే తపన ఎక్కువ కావడంతో ఉన్న ఉద్యోగాన్ని వదిలి వేయాలని ఆయుష్ ఇంట్లో చెప్పాడు. ఈ నిర్ణయాన్ని కుటుంబం మొత్తం వ్యతిరేకించింది. మళ్లీ అప్పులు పాలు అవుతామని ఆందోళన చెందింది. స్నేహితుల సైతం వద్దని సలహ ఇచ్చారు. అయితే ఆయుష్ తన నిర్ణయానికే కట్టుబడ్డాడు. ఉద్యోగం మానేసి ఇంట్లోనే తన చదువు ప్రారంభించాడు.

ఎటువంటి కోచింగ్ లేదు

ఆయుష్ సివిల్స్ కోసం ఎటువంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటిలోనే ట్యూటోరియల్ వీడియోలు, స్వంత నోట్స్ రాసుకుంటూ పరీక్షలకు సిద్దం అయ్యారు. రోజుకు ఎనిమిది నుంచి పది గంటలు కనీసం చదివేవారు. ఎక్కడా విరామం రాకుండా జాగ్రత్తలు మాత్రం తీసుకున్నాడు. అలా తన సాధనతో మొదటి ప్రయత్నంలోనే అల్ ఇండియా 171 ర్యాంక్ సాధించి ఐఏఎస్ కి ఎంపిక అయ్యారు.

ఉద్యోగం మానేసిన తరువాత ఎంతో మదనపడ్డ తల్లిదండ్రులు తరువాత తమ కుమారుడు ఐఏఎస్ అధికారి కావడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story