మధ్యప్రదేశ్: ఎన్నికల ముందు షాక్ ఇచ్చిన ‘పచౌరీ’
సార్వత్రిక ఎన్నికల ముందు నాయకులు పక్కపార్టీలోకి చూసే వేగం పెరిగింది. తాజాగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకీ సీనియర్ లీడర్ షాక్ ఇచ్చారు.
సార్వత్రిక ఎన్నికల ముందు మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. గాంధీల కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన సీనియర్ కాంగ్రెస్ లీడర్, మాజీ కేంద్ర మంత్రి సురేష్ పచౌరీ, మాజీ ఎంపీ గజేంద్ర సింగ్ రాజుఖేడీ ఇద్దరు కూడా అధికార బీజేపీలో చేరారు. శనివారం ఉదయం ఈ చేరిక కార్యక్రమం జరిగినట్లు జాతీయ మీడియా వార్తలు ప్రసారం చేసింది. దీనిని బీజేపీ నాయకత్వం కూడా ధృవీకరించింది.
కాంగ్రెస్ పార్టీ నుంచి నాలుగు సార్లు పచౌరీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ ఆయన కేంద్ర రక్షణ సహాయమంత్రి( రక్షణ ఉత్పత్తులు, సరఫరా)కు పని చేశారు. అలాగే రాజుఖేడీ గిరిజన నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.
మధ్యప్రదేశ్ లోని ధర్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందాడు. ఇదీ షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేయబడింది. ఇదే స్థానం నుంచి ఆయన కాంగ్రెస్ టికెట్ పై మూడు సార్లు పోటీ చేసి గెలుపొందారు. రాజుఖేడీ 1990 లో బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు.
Next Story