
కునాల్ కామ్రా
షిండేను ‘ద్రోహి’ అన్న వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మహా ప్రభుత్వం
తక్షణమే క్షమాపణ చెప్పాలన్నా కార్యకర్తలు, లేకపోతే దేశం విడిచి పారిపోవాల్సి వస్తుందని స్టాండ్ అప్ కమెడియన్ హెచ్చరికలు జారీ
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేను స్టాండ్ ఆప్ కమెడియన్ కునాల్ కామ్రా చేసిన ‘దేశ ద్రోహి’ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని రేపాయి.
శివసేన నాయకుడికి తక్షణమే క్షమాపణ చెప్పాలని, తను కామెడికి వ్యతిరేకం కాదని, కానీ దాన్ని అడ్డుపెట్టుకుని ఒక వ్యక్తిని అగౌరవపరచడం సరైంది కాదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. తన కూటమికి భాగస్వామికి గట్టిగా మద్దతు ఇచ్చారు.
‘‘ఇలాంటి లో క్లాస్ హాస్యంతో ముఖ్యమంత్రిని అగౌరపరడం సరైనది కాదు’’ అని ఫడ్నవీస్ అన్నారు. ఈ విషయంపై మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మాట్లాడుతూ.. విభేదాలు ఉన్నప్పటికి ప్రతి ఒక్కరూ తమ హక్కుల పరిధిలో మాట్లాడాలని అన్నారు.
‘‘ఎవరూ చట్టం, రాజ్యాంగం, నియమాలను దాటి వెళ్లకూడదు. వారు తమ హక్కుల పరిధిలోనే మాట్లాడాలి. విభేదాలు ఉండవచ్చు. కానీ పోలీసుల ప్రమేయం వచ్చేలా మాట్లాడకూడదు’’ అని ఆయన సోమవారం విలేకరులతో అన్నారు.
అయితే కామ్రా చేసిన వ్యాఖ్యలతో ఆగ్రహించిన శివసేన కార్యకర్తలు ఆదివారం ముంబైలో స్టాండ్ అప్ ప్రొగ్రాం జరిగిన హోటల్ ను ధ్వంసం చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు..
హోటల్ ను ధ్వంసం చేసిన సేన నాయకులు నారాయణ్ కనాల్, శ్రీకాంత్ సర్మల్కర్ లతో పాటు ఇతరులను అదుపులోకి తీసుకున్నారు. స్డూడియోను ధ్వంసం చేసినందుకు సేన కార్యకర్తలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పలు నివేదికలు తెలిపాయి.
షిండే పై కామ్రా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పార్టీ కార్యకర్తలు షో చిత్రీకరించిన ఖార్ ప్రాంతంలోని హోటల్ యూనికాంటినెంటల్ ఆడిటోరియం వద్దకు చేరుకున్నారని, కామ్రాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కూడా డిమాండ్ చేశారని పోలీసులు అధికారి జాతీయ మీడియాకు చెప్పారు.
కామ్రా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు..
ఇటీవల జరిగిన ఒక స్టాండ్ అప్ ప్రొగ్రాంలో కామ్రా కామెడిని చేశాడు. దిల్ తో పాగల్ హై చిత్రంలోని ఓ పాటను సవరించిన వెర్షన్ ను ఉపయోగించి షిండేను ఎగతాళి చేశాడు.
Maharashtra ❤️❤️❤️ pic.twitter.com/FYaL8tnT1R
— Kunal Kamra (@kunalkamra88) March 23, 2025
ఇది ప్రేక్షకులను నవ్వించింది. శివసేనను విభజించి బీజేపీతో చేతులు కలిపిన చర్యను ప్రస్తావిస్తూ షిండేను గద్దర్(దేశ ద్రోహి) అని పిలిచాడు.
‘‘థానే కి రిక్షా, చెహ్రే పే దాధీ, ఆఖోన్ మే చస్మా హే? ఏక్ ఝలక్ దిఖ్లే కభీ గువతీ మే చుప్ జే. మేరీ నజర్ సే తుమ్ దేఖో గద్దర్ నాజర్ ఓ ఆయే( థానే రిక్షా మన కళ్లలో గడ్డం చూపించాడు. గౌహతి నా కళ్లలోంచి చూస్తే ద్రోహిలా కనిపిస్తున్నాడు) అంటూ సినిమాలోని భోలీ సీ లడ్కీ పాటను పేరడి చేస్తూ పాడాడు.
ఈ తవ్వకం శివసేన కార్యకర్తలతో తీవ్ర ఆగహాన్ని రేకేత్తించింది. షిండేను అపఖ్యాతి పాలయ్యే కుట్ర అని అభివర్ణించింది. కామ్రాతో పాటు శివసేన(యూబీటీ) నాయకులు సంజయ్ రౌత్, ఆదిత్య ఠాక్రే, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై కేసులు నమోదు చేసింది.
దేశం విడిచి పారిపోవాల్సి ఉంటుంది...
దేశ వ్యాప్తంగా సేన కార్యకర్తలు కామ్రాను వెంబడిస్తారని సేన ఎంపీ నరేష్ మష్కే హెచ్చరించారు. ‘‘మీరు దేశం నుంచి పారిపోవాల్సి వస్తుంది’’ అని ఆయన వీడియో సందేశంలో పేర్కొన్నారు.
ఆయనా కామ్రాను ‘‘కాంట్రాక్ట్ కమెడియన్’’ అని అభివర్ణించారు. పాము తోకను తొక్కకూడదని అన్నారు. ఒకసారి కోరలు బయటకు వస్తే భయంకరమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. కామ్రా ప్రత్యర్థుల నుంచి డబ్బు తీసుకున్నాడని హెచ్చరించాడు.
శివసేన ముర్జి పటేల్ మాట్లాడుతూ.. ‘‘కామ్రా కు అతని స్థాయి’’ చూపిస్తామని, అతను వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశాడు.
హోటల్ దాడిపై స్పందించిన యూబీటీ..
శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే హోటల్ లో జరిగిన విధ్వంసాన్ని పిరికి చర్యగా అభివర్ణించారు. ఒక ఎక్స్ పోస్ట్ లో థాకరే ‘‘ షిందే పిరికివాళ్ల ముఠా హస్య ప్రదర్శన వేదికను విచ్ఛిన్నం చేసింది.
అక్కడ హస్య నటుడు కునాల్ కమ్రా ఏక్ నాథ్ షిండే పై పాటను పాటను పాడాడు. ఇది వంద శాతం నిజం. పిరికివాళ్లు మాత్రమే ఎవరైన పాడిన పాటకు ప్రతిస్పందిస్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? లేక ముఖ్యమంత్రి, హోంమంత్రిని అణగదొక్కడానికి మరొక ప్రయత్నమా’’ అని ఆయన అన్నారు.
Next Story