ఆప్ ఓటమిపై ‘‘ద్రౌపది వస్త్రాపహారణం’’తో స్పందించిన  మాలివాల్
x

ఆప్ ఓటమిపై ‘‘ద్రౌపది వస్త్రాపహారణం’’తో స్పందించిన మాలివాల్

స్త్రీలను అవమానిస్తే దేవుడు శిక్షిస్తాడని వ్యాఖ్యలు


ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్, ఆ పార్టీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిపై ఆ పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలివాల్ స్పందించారు.

కేజ్రీవాల్ తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ చేతిలో ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో స్వాతి మాలివాల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ క్యాప్షన్ లేని పోస్టులో మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణం చేసిన పెయిటింగ్ ను తన అకౌంట్ లో ఉంచారు.

2024 మే నెలలో ముఖ్యమంత్రి నివాసంలోని డ్రాయింగ్ రూమ్ లో, ఆయన సమక్షంలో ఆప్ అధినేత పీఏ, సన్నిహితుడు బిభవ్ కుమార్ తనను కొట్టారని ఆమె ఆరోపించారు. తరువాత దీనిపై కేసు పెట్టగా చాలా రోజులు కేసు కోర్టులో నడిచింది. చివరకు సుప్రీంకోర్టు బిభవ్ కు బెయిల్ ఇచ్చింది.
తరువాత స్వాతి మాలివాల్ పార్టీ నుంచి బయటకు వచ్చింది. ఈ ఎన్నికలలో కేజ్రీవాల్ ఓటమి తో తన ఆరోపణలకు బలం రుజువు అయిందని మాలివాల్ జాతీయ మీడియాతో అన్నారు.
రావణ రూపకం..
మరో పోస్ట్ లో మాలివాల్.. ‘‘ అహంకర్ రావణ్ కా భీ నహీ బచా థా( రావణుడి అహం కూడా నాశనం చేయబడింది)’’ అని రాసుకొచ్చారు. కుమార్ తో జరిగిన గొడవ తరువాత రాజ్యసభ కేంద్రంగా ఆప్ లక్ష్యంగా చేసుకుని అనేక ఆరోపణలు గుప్పించారు.
2024 అక్టోబర్ లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ను ఓడించడానికి కేజ్రీవాల్ అక్కడ ప్రచారం చేయడం ద్వారా ఇండి బ్లాక్ కు ద్రోహం చేశారని, తద్వారా ప్రతిపక్షాల ఓట్లను చీల్చారని పరోక్షంగా బీజేపీని గెలిపించారని ఆరోపించారు.
‘‘ మనం ఓసారి చరిత్రను పరిశీలిస్తే ఏ స్త్రీ కైనా ఏదైనా తప్పు జరిగితే దేవుడు అలా చేసిన వారిని శిక్షించాడు. నీటి కాలుష్యం , వాయు కాలుష్యం, వీధుల పరిస్థితి వంటి సమస్యల కారణంగా అర్వింద్ కేజ్రీవాల్ స్వయంగా తన సీటును కోల్పోయాడు.
తాము( ఆప్) అబద్దం చెబితే ప్రజలు నమ్ముతారని అనుకుంటారు. ప్రజలకు తాము చెప్పింది చేయాలి కానీ నాయకత్వం దానిని మర్చిపోయి ఇచ్చిన మాట నుంచి తప్పుకుంది. నేను బీజేపీని అభినందిస్తున్నాను. ప్రజలు ఆశతో వారికి ఓటు వేశారు. ఇచ్చిన వాగ్థానాలను అమలు చేయాలి’’ అని మాలివాల్ అన్నారు.
కేజ్రీవాల్ ఇంటిముందు చెత్త వేసి..
వికాస్ పురి లోని చెత్తతో నిండిన రోడ్లను శుభ్రం చేయడంలో కేజ్రీవాల్ ప్రభుత్వం విఫలమయిందని ఆరోపిస్తూ.. మాలివాల్ ఆయన అధికారిక నివాసం ముందు చెత్తపోసి నిరసన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
మాలివాల్, ఆమె సహాయకులు వికాస్ పురిలోని రోడ్ల నుంచి చెత్తను సేకరించి మూడు మినీ ట్రక్కులలో సేకరించిన ఫిరోజ్ షా రోడ్డులోని కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. మహిళా పోలీసు సిబ్బంది ఆమెను అడ్డుకుని అక్కడ నుంచి తొలగించే సమాయానికి చెత్తను అక్కడ పారబోశారు. ఢిల్లీ ప్రజలు కాలుష్యపు యమునా నది నీటిలో ఇబ్బంది పడుతుంటే కేజ్రీవాల్ తన నివాసంలో ఎటువంటి విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడో ప్రజలకు వివరించారు.
Read More
Next Story