మేకేదాతు ప్రాజెక్ట్: తమిళనాడు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
x

మేకేదాతు ప్రాజెక్ట్: తమిళనాడు పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

ఈ సమయంలో పిటిషన్ అనవసరమని భావించిన అత్యున్నత న్యాయస్థానం


కావేరి నది పై కర్ణాటక నిర్మించబోయే మేకేదాతు ప్రాజెక్ట్ పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కర్ణాటక- తమిళనాడు సరిహద్దులోని బెంగళూర్ దక్షిణ జిల్లాలోని కనపుర తాలూకాలోని మేకెదాతు వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం గురించి కర్ణాటక ప్రభుత్వం చాలా సంవత్సరాలుగా చర్చిస్తోంది. అయితే దీనివల్ల కావేరి నదీ వాటా జలాలు తమకు అందవని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది..
రాష్ట్ర అభ్యంతరాలతో పాటు నిఫుణుల సంస్థలు, కావేరి జల నియంత్రణ కమిటీ, కావేరి జల నిర్వహణ అథారిటీ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత మేకెదాతు ప్రణాళికను ఆమోదిస్తామని భారత ప్రధాని న్యాయమూర్తి బీఆర్ గవాయ్, న్యాయమూర్తులు కే. వినోద్ చంద్రన్, న్యాయమూర్తి ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
‘‘ఈ దశలో సీడబ్ల్యూసీ జారీ చేసిన ఉత్తర్వూ ద్వారా జరుగుతున్నది డీపీఆర్ తయారీ మాత్రమే. అది కూడా తమిళనాడు రాష్ట్రం, సీడబ్యూఎంఏ, సీడబ్యూఆర్సీ నిఫుణుల అభ్యంతరాలను పరిగణలోని తీసుకున్న తరువాత డీపీఆర్ పరిశీలనకు సీడబ్ల్యూఎంఏ, సీడబ్యూఆర్సీ ముందస్తు ఆమోదం తప్పనిసరి అని సీడబ్యూసీ ఆదేశించిందని గమనించాలి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రస్తుత దరఖాస్తు అనవసరమని మేము భావిస్తున్నాము’’ అని బెంచ్ పేర్కొంది.
డీపీఆర్ తయారీ, సీడబ్ల్యూఎంఏ, సీడబ్యూఆర్సీ అభిప్రాయం తరువాత సీడబ్యూసీ తుది నిర్ణయం తీసుకుంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. 2023 ఆగష్టు ప్రారంభంలో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం 2023 రుతుపవనాలకు సంబంధించిన తలెత్తిన సమస్యను పరిశీలించడానికి నిరాకరించిదని, కోర్టుకు ఆ నైపుణ్యం లేదని పేర్కొంటూ పరిస్థితిని అంచనా వేయమని సీడబ్యూఎంఏ కోరిందని సుప్రీంకోర్టు పేర్కొంది.
కర్ణాటక కు సుప్రీంకోర్టు హెచ్చరిక..
‘‘మాకు నైపుణ్యం లేదని 25.08.2023 నాటి మా ఉత్తర్వూలో గమనించిన విషయాన్ని మేము పునరుద్ఘాటిస్తున్నాము. నిపుణులకు కేటాయించబడిన ప్రాంతాల నుంచి ఈ కోర్టు దూరంగా ఉండాలని ఈ కోర్టు పదే పదే పునరుద్ఘాటించింది’’ అని బెంచ్ పేర్కొంది.
ప్రస్తుతం ఇది అప్రమస్తుతమని అనుకుంటున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను అనుగుణంగా కర్ణాటక నీటిని విడుదల చేయడానికి కట్టుబడి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. కర్ణాటక కోర్టు ఆదేశాలను పాటించడంలో విఫలమైతే అది కోర్టు ధిక్కారానికి పాల్పడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందని హెచ్చరించింది.
Read More
Next Story