
ఒడిశా బీచ్ కు తరలివచ్చిన లక్షలాది ఆలివ్ రిడ్లే తాబేళ్లు
45 రోజుల పాటు గుడ్లను రక్షించనున్న ప్రభుత్వం
ఒడిశాలోని గంజాం జిల్లాలో గల రుషికుల్యా నదీ ముఖద్వారం లక్షలాది ఆలివ్ రిడ్లే తాబేల్లకు కేంద్రంగా మారింది. ఇవి అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నాయి. ఇక్కడకు దాదాపు 6. 82 లక్షలకు పైగా సముద్ర తాబేల్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఒడిశాలోని రుషికుల్య నదీ ముఖ ద్వారం దగ్గరికి ఫిబ్రవరి 16న తాబేల్లు రావడం ప్రారంభం అయ్యాయని సంబంధిత అధికారులు తెలిపారు.
‘‘ఇప్పటి వరకూ 6.82 లక్షలకు పైగా ఆలివ్ రిడ్లీ తాబేళ్లు బీచ్ లో గుడ్లు పెట్టాయి. 2023 లో 6.37 లక్షల సముద్ర జాతులు ఒకే దగ్గర గుడ్లు పెట్టిన రికార్డును ఇది అధిగమించినట్లు అయింది.’’ బెర్హంపూర్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్(డీఎఫ్ఒ) సన్నీ ఖోక్కర్ అన్నారు.
2023 లో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 2 వరకూ ఎనిమిది రోజుల కాలంలో సామూహికంగా 6,37,008 తాబేళ్లు గుడ్లు పెట్టగా, 2022 లో 5.50 లక్షల తాబేళ్లు గుడ్లు పెట్టాయని వర్గాలు తెలిపాయి. ఆలీవ్ రిడ్లీ చేపల సామూహిక గూడు ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని డీఎఫ్ఓ తెలిపారు.
ఆలివ్ రిడ్లే తాబేళ్లు రికార్డు స్థాయిలో సామూహిక గూడు కట్టుకోవడానికి బీచ్ ను సందర్శించడానికి అనుకూలమైన వాతావరణ పరిస్థితులు ఒక కారణమని నిపుణులు తెలిపారు.
‘‘ఈ సంవత్సరం వాతావరణం మెరుగ్గా ఉండటం వల్ల రుషికుల్య నదీతీరంలో ఎక్కువ తాబేళ్లు రావడం, గుడ్లు పెట్టడానికి కారణమైంది. ఇది తాబేళ్లకు ప్రధాన ఆవాసంగా మారుతోంది’’ అని డెహ్రడూన్ లోని వైల్డ్ లైఫ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త బివాస్ పాండవ్ అన్నారు.
జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సీనియర్ శాస్త్రవేత్త బసుదేవ్ త్రిపాఠి మాట్లాడుతూ.. సకాలంలో గూడు పెట్టడం వలన మంచి సంఖ్యలో తాబేలు పిల్లలు బయటకు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
జీవశాస్త్ర వేత్తలు ఇప్పటి వరకూ 330 కి పైగా అలీవ్ రిడ్లే తాబేలు తిరిగి స్వాధీనం చేసుకున్నారని, ఈ తాబేళ్లకు 2021-23 కాలంలో జీపీఎస్ ట్యాగ్ లు ఉన్నాయని సర్వేయర్ లో మరో సీనియర్ శాస్త్రవేత్త అనిల్ మోహపాత్ర తెలిపారు.
రుషికుల్య నదీతీరంలోని తాబేళ్లు గుడ్లు పెట్టిన 9 కిలోమీటర్ల దూరంలో కంచే ఏర్పాటుచేసినట్లు ఖల్లికోట్ రేంజ్ ఆఫీసర్ దిబ్యా శంకర్ బెహెరా తెలిపారు. గుడ్లను వేటాడే జంతువుల నుంచి రక్షించడానికి కంచెను తయారు చేస్తారు.
‘‘45 రోజుల పాటు ఈ గుడ్లు పొదిగే అవకాశం ఉంది. కావునా వీటిని రక్షించడానికి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం’’ అని ఆయన అన్నారు.
Next Story