‘‘మోదీ, ట్రంప్ కి భయపడి చమురు కొనటం ఆపేస్తున్నారు’’
x
రాహుల్ గాంధీ

‘‘మోదీ, ట్రంప్ కి భయపడి చమురు కొనటం ఆపేస్తున్నారు’’

కేంద్రంపై రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు


భారత్ తన చిరకాల మిత్రుడు అయిన రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు నిలిపివేస్తుందనే హమీ తనకు ఇచ్చిందని ట్రంప్ చేసిన ప్రకటనపై రాహుల్ గాంధీ కేంద్రం పై విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వం అమెరికా భయపడుతోందని సామాజిక మాధ్యమం ఎక్స్ లో ట్వీట్ చేశారు.

‘‘ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ కు భయపడుతున్నారు’’ యూఎస్ ప్రెసిడెంట్ అనుమతి తీసుకుని రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేస్తామని ప్రకటించబోతున్నారు. ట్రంప్ పదేపదే మోదీని తిరస్కరించినప్పటికీ కూడా అభినందనలు సందేశాలు పంపతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.
ట్రంప్ వ్యాఖ్యలపై కలకలం..
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హమీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించిన తరువాత రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘భారత్, రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నాకు సంతోషంగా లేదు. మోదీ నాకు ఈ రోజు ఒక హమీ ఇచ్చారు. ఇక నుంచి రష్యా నుంచి చమురు కొనుగోలు చేయమని చెప్పారు’’ అని వైట్ హౌజ్ లోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
భారత ప్రధానితో తనకు అత్యంత దగ్గరి అనుబంధం ఉందని ట్రంప్ అన్నారు. భారత్ తరువాత చైనా కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని చెబుతానని పేర్కొన్నారు.
ట్రంప్ న్యూఢిల్లీ పై అదనంగా 25 శాతం సుంకాలు విధించిన తరువాత కూడా భారత్ రష్యా నుంచి నిరాటంకంగా చమురు కొనుగోలు చేస్తూనే ఉంది. అంతే కాకుండా అమెరికా, యూరప్ రష్యా తో చేస్తున్న వ్యాపారాలను గణాంకాలతో బయటపెట్టింది.
ట్రంప్ సుంకాలు 50 శాతం చేరిన వేళ భారత్ ప్రధాని స్పందించారు. భారత రైతుల జీవనోపాధిపై ప్రభావం చూపే అంశాలపై తాను రాజీపడబోనని పరోక్షంగా అమెరికాను ఉద్దేశించిన ఆయన వ్యాఖ్యానించారు. తాను దేశం కోసం ఎంతమూల్యమైన చెల్లిస్తానని ప్రకటించారు.
‘‘మేక్ ఇన్ ఇండియా’’ తో దేశం స్వయం సమృద్ధి సాధించాలని, నిరాశ నుంచి కాకుండా గర్వం నుంచి స్వావలంబన సాధించాలని దేశ ప్రజలకు ఎర్రకోట నుంచి పిలుపునిచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్వార్థం పెరుగుతోందని, కూర్చుని మన కష్టాల గురించి ఏడవకూడదని, ఇతరుల గుప్పిట్లో మనం ఉండకూడదని ఆయన సందేశమిచ్చారు.
ట్రంప్ మాటలు నమ్మొచ్చా..
వాచలత్వానికి పెట్టిన పేరు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత్- పాక్ మధ్య అణు యుద్ధం ఆపానని తనకు నోబెల్ బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. భారత్, పాక్ లపై యుద్ధం ఆపకపోతే సుంకాలు విధిస్తానని హెచ్చరించినట్లు గొప్పలు చెప్పుకున్నారు.
అయితే భారత్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించింది. అసలు అమెరికాతో తాము ఆపరేషన్ సిందూర్ గురించి చర్చలు జరపలేదని కేవలం పాక్ డీజీఎంఓ అభ్యర్థనతోనే తాము సైనిక దాడులకు పాజ్ ఇచ్చినట్లు ప్రకటించింది. అయినప్పటికి ట్రంప్ పదేపదే తాను యుద్ధాన్ని ఆపినట్లు క్రెడిట్ ఇచ్చుకుంటున్నారు.
అమెరికా, భారత్ లోని నరేంద్ర మోదీ ప్రభుత్వం భయపడుతుందనే వ్యాఖ్యలపై కూడా ఇంతకుముందు మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం మాట్లాడుతూ.. 2008 నాటి 26/11(ముంబై పై ఉగ్రవాదుల దాడి) దాడుల అనంతరం అమెరికా విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ ఒత్తిడితోనే పాక్ పై దాడి చేయలేదనే నిజాన్ని బయటపెట్టారు.
తాను ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేయాలనే అంశంపై కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడినట్లు కానీ అప్పటి యూపీఏ ప్రభుత్వంలోని అగ్ర నాయకత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గి దాడుల అంశాన్ని విడిచిపెట్టిందనే సంచలన నిజాలను బయటపెట్టారు.
Read More
Next Story