
ఎయిర్ మార్షల్ ఏకే భారతి
అణు స్థావరాలపై దాడులు చేయలేదు: ఇండియన్ ఎయిర్ ఫోర్స్
మేము దాడి చేసిన లిస్ట్ లో కిరానా హిల్స్ పేరు లేదన్న ఎయిర్ మార్షల్ ఏకే భారతి
కిరానా హిల్స్ లోని పాకిస్తాన్ అణు కేంద్రంపై సైనికదాడి చేయలేదని భారత్ తెలిపింది. ఆపరేషన్ సిందూర్ పై విలేకరుల సమావేశంలో మాట్లాడిన సైనిక అధికారులు ఈ మేరకు స్పష్టమైన సమాధానం చెప్పారు.
పాకిస్తాన్ అణు వార్ హెడ్ నిల్వ ఉంచిన బంకర్ పై భారత్ దాడి చేయడానికి ప్రయత్నించిందా? అనే ఓ విలేకరీ ప్రశ్నించగా దాని ఎయిర్ మార్షల్ ఎకే భారతి సమాధానమిస్తూ ‘‘ మేము కిరానా హిల్స్ పై దాడి చేయలేదు’’ అని స్పష్టం చేశారు.
విషయం చెప్పినందుకు ధన్యవాదాలు..
కిరానా హిల్స్ లో అణు స్థావరం ఉందనే విషయం మాకు తెలియదని, ఆ విషయం చెప్పినందుకు ధన్యవాదాలని ఎయిర్ మార్షల్ అన్నారు. మేము దాడి చేసిన లక్ష్యాలలో అయితే కిరానా హిల్స్ లేదని ఆయన చెప్పారు. ఆ స్థలంపై దాడి చేస్తున్నట్లు వస్తున్నట్లు వార్తలను ఎయిర్ మార్షల్ ఖండించారు.
పాకిస్తాన్ లోని వ్యూహాత్మక సర్గోధ వైమానిక స్థావరానికి సమీపంలో ఉన్న కిరానా హిల్స్ ప్రాంతాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుని ఉండవచ్చని నివేదికలు, ఊహాగానాలపై సైన్యం వివరణ ఇచ్చింది.
ఈ ప్రాంతం పాకిస్తాన్ అణ్వాయుధాలకు నిల్వ స్థలం అయి ఉండవచ్చని కూడా పలు నివేదికలు వచ్చాయి. పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల సంభవించిన భూకంపం సున్నితమైన సైనిక కార్యకలాపాల వల్ల జరిగిందా, లేదా అణు నిల్వలు పేలిపోవడం వల్ల జరిగిందా అనే అనుమానాలు ముసురుకుంటున్నా తరుణంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దానిపై వివరణ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.
అణు ప్రమాదం..
అమెరికా, ఈజిప్టుకు చెందిన సైనిక విమానాలు పాకిస్తాన్ గగనతలంలో కనిపించాయని, రాడార్ ను పర్యవేక్షించే కొంతమంది ఔత్సాహికులు, రక్షణ పరిశీలకులు చెప్పారు.
కిరానా హిల్స్ వస్తున్న కథనాలు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. అణు పదార్థాలు పేలిపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది నిజామా కాదా అనే దానిపై భారత్, పాకిస్తాన్ రెండు కూడా స్పందించలేదు. భూకంపం వచ్చిందనే పుకార్లపై కూడా ఇస్లామాబాద్ నుంచి ఎలాంటి అధికారిక వివరణ రాలేదు.
దాడి చేసిన తరువాత..
ఆపరేషన్ సిందూర్ కింద కొన్ని వైమానిక బేస్ లు, ఆర్మీ స్థావరాలపై భారత్ అధికారికంగా ధృవీకరించింది. వీటిలో పాక్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాలకు సంబంధించిన మొత్తం మౌలిక సదుపాయాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అయితే వీటిపై దామాషా ప్రకారం మాత్రమే దాడులు చేసినట్లు సైనిక అధికారులు వెల్లడించారు. కేవలం నిఘా ఆధారంగా వాటిని ఎంచుకున్నట్లు భారత ఆర్మీ ప్రకటించింది.
Next Story