యూట్యూబర్ ధ్రువ్ రాథీ కి నాన్ బెయిలబుల్ వారెంట్
x

యూట్యూబర్ ధ్రువ్ రాథీ కి నాన్ బెయిలబుల్ వారెంట్

పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టులో కేసు


Click the Play button to hear this message in audio format

2018 నాటి పరువు నష్టం కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాతీ పై ఢిల్లీ కోర్టు సోమవారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ధ్రువ్ య్యూటూబ్ ఛానెల్ లో అప్ లోడ్ చేసిన వీడియోకు సంబంధించి వికాస్ సంస్కృతియాన్ అలియాస్ వికాస్ పాండే దాఖలు చేసిన కేసులో జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆనం రైస్ ఖాన్ వారెంట్ జారీ చేశారు. ఈ విషయంపై తదుపరి విచారణకు డిసెంబర్ 3 వ తేదీకి వాయిదా వేశారు. వివరణాత్మక ఉత్తర్వూ వెలువడాల్సి ఉంది. అంతకుముందు అక్టోబర్ 31న కోర్టు రాథీ పై కొత్తగా బెయిలబుల్ వారెంట్లను జారీ చేసింది.

అక్టోబర్ 17న నోటీస్ అందించడానికి ప్రయత్నిస్తున్నప్పుడూ అతని ఇల్లు తాళం వేసి ఉందని ఒక ప్రాసెస్ సర్వర్ నివేదించడంతో అతనిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. హర్యానాలోని గురుగ్రామ్ లో ఉన్న అతని చిరునామాకు రాతీకి కోర్టు కొత్తగా సమన్లు జారీ చేసింది. ధ్రువ్ రాతీ సాధారణంగా ఆస్ట్రియాలో నివసిస్తారని, ఢిల్లీలో జరిగిన సీజేపీ నిరసనల కోసం భారత్ కు వచ్చారని ఆయన తరఫున న్యాయవాదీ సమర్పించారు. 2019 లో జూలై లో రథీకి తొలుత సమన్లు జారీ చేసినట్లు కోర్టు పేర్కొంది.
రాతీ తన యూట్యూబ్ ఛానెల్ లో పాండేకు వ్యతిరేకంగా ఒక వీడియో అప్ లోడ్ చేసిన తరువాత 2018 లో పాండే దాఖలు చేసిన పరువు నష్టం ఫిర్యాదుకు సంబంధించి ఈ కేసు నమోదు అయింది.
Read More
Next Story