
సేవ్ డెమోక్రసీ కాదు.. సేవ్ ఫ్యామిలి ర్యాలీ: బీజేపీ
ప్రతిపక్షాలు రాంలీలా మైదానంలో నిర్వహించేది సేవ్ డెమోక్రసీ ర్యాలీ కాదని, సేవ్ ఫ్యామిలి ర్యాలీ అని బీజేపీ విమర్శలు గుప్పించింది. అవినీతి ఆరోపణలు ఉన్న వారంతా..
ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ప్రతిపక్షాలు నిర్వహించే ‘సేవ్ డెమోక్రసీ’ ర్యాలీనీ బీజేపీ తూర్పారపట్టింది. ఇదే సేవ్ ఫ్యామిలీ ర్యాలీ అంటూ చురకలంటించింది. దేశంలోని అవినీతి మరకలు ఉన్న అన్ని కుటుంబాలు కలిసి ఢిల్లీలోని ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శలు గుప్పించారు.
ప్రజలు తిరస్కరించిన పార్టీలన్నీ కలిసి జట్టుకట్టాయన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ, డీఎంకే ఇలా ప్రతిపక్షంలో ఉన్న అన్ని పార్టీల గత చరిత్ర చూడండి. ఎన్ని అవినీతి కేసులు వారిపై ఎన్ని ఉన్నాయో మీకే తెలుస్తుందని అన్నారు. 2014 కంటే ముందు దేశాన్ని లూటీ చేశారని, మరోసారి లూటీ చేసుకునేందుకు ఏకమయ్యారని దుయ్యబట్టారు.
ఒకప్పుడు రాంలీలా మైదానంలో ఒకప్పుడు అన్నా హజారే నాయకత్వంలో "అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం" ఉద్యమానికి ఆతిథ్యం ఇచ్చింది, ఈ ఆదివారం మాత్రం "అవినీతిలో ప్రతి ఒక్కరూ " అంటూ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు త్రివేది చెప్పారు. ర్యాలీల్లో పాల్గొన్న లాలూ ప్రసాద్ యాదవ్ అనేక అవినీతి కేసుల్లో దోషిగా ఉన్నారని అన్నారు.