లోక్ సభ స్పీకర్ గా ‘ఓం బిర్లా’, వరుసగా రెండో సారి ఎన్నిక
కొత్తగా కొలువుదీరిన 18 వ లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఇంతకుముందు ఉన్న 17 లోక్ సభ కు కూడా ఆయనే స్పీకర్ గా పని చేశారు. ప్రధాని మోదీ లోక్ సభలో..
స్పీకర్ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా వరుసగా రెండో సారి గెలిచారు. స్పీకర్ గా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన తీర్మానాన్ని వాయిస్ ఓట్ల ద్వారా సభ ఆమోదించింది. కాంగ్రెస్ ఎంపీ కోడికున్నిల్ సురేష్ ను అభ్యర్థిగా ప్రతిపాదించిన ప్రతిపక్షాలు, ఓటింగ్ పై పట్టుబట్టకపోవడంతో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ స్పీకర్ ఎన్నిక పూర్తయినట్లు ప్రకటన చేశారు. "ఓం బిర్లా స్పీకర్‌గా ఎన్నికైనట్లు నేను ప్రకటిస్తున్నాను" అని మహతాబ్ అన్నారు.
కొద్దిసేపటికే, మోదీ, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు బిర్లాను కుర్చీపైకి తీసుకెళ్లడానికి ట్రెజరీ బెంచీల ముందు వరుసలో ఉన్న బిర్లా సీటు వద్దకు వెళ్లారు. తరువాత లోక్ సభ లో ప్రతిపక్ష నాయకుడు రాహూల్ గాంధీ స్పీకర్ గా ఎన్నిక అయినా ఓం బిర్లాకు అభివాదం చేసి ప్రధాని మోదీతో కరచాలనం చేశారు.
ఆ తర్వాత ప్రధాని, రాహుల్ గాంధీ, రిజిజు ముగ్గురు బిర్లాను స్పీకర్ స్థానం దగ్గరకు తీసుకెళ్లారు, అక్కడ మహతాబ్ "ఇది మీ కుర్చీ స్వీకరించండి" అని ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. "మీరు రెండవసారి ఈ పదవికి ఎన్నిక కావడం గౌరవప్రదమైన విషయం" అని అన్నారు. "నేను మొత్తం సభ తరపున మిమ్మల్ని అభినందిస్తున్నాను. రాబోయే ఐదేళ్ల పాటు మీ మార్గదర్శకత్వం కోసం ఎదురు చూస్తున్నాను" అని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంటేరియన్‌గా బిర్లా చేసిన కృషి కొత్త లోక్‌సభ సభ్యులకు స్ఫూర్తిగా నిలవాలని మోదీ తన ప్రసంగంలో వివరించారు. "మీ మధురమైన చిరునవ్వు మొత్తం సభను సంతోషంగా ఉంచుతుంది" అని ప్రధాని అన్నారు.
బిర్లా గతంలో స్పీకర్‌గా పని చేయడం "పార్లమెంటరీ చరిత్రలో స్వర్ణ కాలం" అని పేర్కొన్న మోదీ, 70 ఏళ్లలో లోక్‌సభ ఆమోదించలేని చట్టాలను స్పీకర్‌గా బిర్లా ఆధ్వర్యంలో ఆమోదించారని అన్నారు.
స్పీకర్, ప్రజల గొంతుకలకు సంరక్షకుడు: రాహుల్
ఇండి కూటమి తరపున బిర్లాకు అభినందనలు తెలిపిన రాహుల్, సభ ప్రజల గొంతుకకు ప్రాతినిధ్యం వహిస్తుందని, స్పీకర్ దానికి సంరక్షకుడని అన్నారు. సభ ఎంత సమర్ధవంతంగా నడుస్తుందనేది ప్రశ్న కాదని, సభలో ప్రజల వాణి ఎంతవరకు వినిపిస్తుంది, ప్రాతినిధ్యం వహిస్తోందనేది అసలు విషయం అన్నారు.
ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుంటే అది అప్రజాస్వామికం, రాజ్యాంగ విరుద్ధం అవుతుంది’’ అని సభలో ప్రతిపక్షాలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసేందుకు స్పీకర్ అనుమతిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Next Story