ఎన్నికల వ్యూహం తెలుసుకోవడానికి ‘ఫోన్’ : అతిషీ మార్లేనా
x

ఎన్నికల వ్యూహం తెలుసుకోవడానికి ‘ఫోన్’ : అతిషీ మార్లేనా

కేజ్రీవాల్ ఫోన్ కావాలని కోరుతోంది ఈడీ కాదని, కేంద్రప్రభుత్వమని ఆప్ మంత్రి ఆతిషి మార్లేనా ఆరోపించారు.


ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికల ప్రణాళికల వివరాలను తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొబైల్ ఫోన్‌ వివరాలను దర్యాప్తు సంస్థ అడుగుతోందని ఆప్ మంత్రి ఆతిషీ మార్లేనా ఆరోపించారు. కేంద్రంలోని బిజేపీ సూచనల ప్రకారమే దర్యాప్తు సంస్థ ఈడీ ఈ పని చేస్తోందని ఆమె విమర్శించారు. "వాస్తవానికి, కేజ్రీవాల్ ఫోన్‌లో ఏముందో తెలుసుకోవాలనుకునేది ఈడీ కాదు.. బిజెపి" అని వ్యాఖ్యానించారు.

కేజ్రీవాల్ ఫోన్ పాస్ వర్డ్ కావాలి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మార్చి 21న ED అరెస్టు చేసింది. ఆయనకు కోర్టు ఏప్రిల్ 1 వరకు రిమాండ్ కు ఆదేశించింది. అయితే అరెస్ట్ సమయంలో కేజ్రీవాల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న దర్యాప్తు సంస్థ, దాని పాస్ వర్డ్ ల గురించి కేజ్రీవాల్ ను అడిగింది. అందుకు ఆయన సమయం కావాలని కోరాడు. ఇదే విషయాన్ని కోర్టుకు ఈడీ తెలిపింది.
ఈ ఫోన్ వ్యవహరంపై ఆప్ మంత్రి ఆతిషి మార్లేనా మాట్లాడుతూ.. కేజ్రీవాల్‌ మొబైల్‌ ఫోన్‌ను కావాలని పట్టుబట్టడం అనుమానాస్పదంగా ఉందని, ఆ ఫోన్ కొనుగోలు చేసి కొన్ని నెలల మాత్రమేనని అయ్యాయన్నారు. మద్యం పాలసీని రూపొందించి అమలు చేసినప్పుడు అది లేదని అతిషి పేర్కొన్నారు. బీజేపీకి రాజకీయ ఆయుధంగా ఈడీ పని చేస్తోందని ఆమె ఆరోపించారు.
ఎన్నికల వ్యూహం
"ఆప్ లోక్‌సభ ఎన్నికల వ్యూహం, ప్రచార ప్రణాళికలు, ఇండి కూటమి నాయకులతో చర్చలు మీడియా, సోషల్ మీడియా వ్యూహాలకు సంబంధించిన సమాచారం ఇందులో వారు కనుగొంటారు కాబట్టి వారికి ఫోన్ కావాలి" అని అతిషి చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని 2021-22లో అమలు చేశారు. దీనిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తడంతో అదే ఏడాది రద్దు చేశారు.

Read More
Next Story