బిహార్: వంతెనలు కూలిపోవడంపై ’సుప్రీం‘ లో పిల్
బిహార్ లో వంతెనలు కూలిపోవడం పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. వెంటనే నిపుణుల కమిటీ నియమించడానకి ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు.
బిహార్ లో వంతెనలు కూలిపోవడం కొనసాగుతూనే ఉంది. గత పదిహేను రోజుల్లో ఇప్పటి వరకూ 12 వంతెనలు కూలిపోయాయి. తాజాగా సరన్ జిల్లాలో ఓ వంతెన కూలిపోయింది. సరన్ జిల్లాలో గత 48 గంటల్లో కూలిపోయిన మూడో వంతెన ఇదని జిల్లా మేజిస్ట్రేట్ అమన్ సమీర్ మీడియాకు తెలిపారు.
సరన్- సివాన్ జిల్లాల్లోని గ్రామాలను కలుపుతూ గండకి నదిపై 15 ఏళ్లక్రితం దీనిని నిర్మించారు. ఇది కూలిపోవడంతో ఈ ప్రాంతాల ప్రజలకు తీవ్ర ఇబ్బంది తప్పదు. అయితే వంతెన కూలిపోతున్నసమయంలో ప్రజలు లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. వంతెన కింది భాగంలో ఉన్న మట్టిని ఇటీవల తొలగించారు. దానివల్ల భారీ స్థాయిలో గోతులు ఏర్పడి వంతెన కూలిపోయినట్లు అనుమానాలున్నాయి.
‘‘చిన్న వంతెనను 15 ఏళ్ల క్రితం నిర్మించారు. నేను స్పాట్‌కి వెళ్తున్నాను. జిల్లా యంత్రాంగంలోని పలువురు అధికారులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. వంతెన కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు, అయితే డీసిల్టింగ్ పని ఇటీవలే చేపట్టబడింది, ”అని వార్తా సంస్థకు మేజిస్ట్రేట్ చెప్పారు.
ఆరు జిల్లాలు ప్రభావితం
సరన్‌లోని గండక్ నదిపై మరో రెండు వంతెనలు కొన్ని గంటల్లోనే కూలిపోయాయి. అవి కేవలం ఒక కిలోమీటరు దూరంలో ఉన్నాయి, ఒకటి 2004లో నిర్మించబడింది. మరొకటి బ్రిటిష్ కాలంనాటి నిర్మాణం. ఇవి కాకుండా సివాన్, మధుబని, అరారియా, తూర్పు చంపారన్, కిషన్‌గంజ్ జిల్లాల్లో రెండు వారాల్లో కనీసం తొమ్మిది వంతెనలు కూలిపోయాయి .భారీ వర్షాలు ఈ ఘటనలకు కారణమై ఉండొచ్చని పలువురు అనుమానిస్తున్నారు .
‘సుప్రీం’ లో PIL
బీహార్ ప్రభుత్వం వెంటనే స్ట్రక్చరల్ ఆడిట్ చేపట్టాలని, ఈ ఆడిట్ ద్వారా బలోపేతం చేయగల, కూల్చి వేయగల వంతెనలను గుర్తించడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది.
సుప్రీంకోర్టులో ప్రముఖ న్యాయవాదీ బ్రజేష్ సింగ్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ లో వరుసగా కూలిపోతున్న వంతెనలు, వాటి భద్రత, వాటి నిర్మాణం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రమాణాల ప్రకారం వంతెనలను పర్యవేక్షణను కూడా కోరింది .
సీఎం వ్యూహాత్మక మూవ్..
వంతెన కూలిన దృష్ట్యా, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలను సర్వే నిర్వహించి, తక్షణ మరమ్మతులు అవసరమయ్యే వాటిని గుర్తించాలని రహదారి నిర్మాణ, గ్రామీణ పనుల శాఖలను ఆదేశించారు.
ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి గురువారం విలేకరులతో మాట్లాడుతూ, “బుధవారం సమీక్షా సమావేశం తరువాత, రాష్ట్రంలోని అన్ని పాత వంతెనలను సర్వే నిర్వహించి, తక్షణ మరమ్మతులు అవసరమయ్యే వాటిని గుర్తించాలని సిఎం, సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారన్నారు. రాష్ట్రంలోని వంతెనలు లేదా కాజ్‌వేల కోసం సంబంధిత శాఖలను తక్షణమే తమ నిర్వహణ విధానాన్ని సిద్ధం చేయాలని సిఎం కోరారు.
బ్రిడ్జి కూలిన ఘటనలకు కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించిందని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చౌదరి తెలిపారు.
కూలిన వంతెనలు..
జూన్ 27 నుంచి జూన్ 30 మధ్య, కిషన్‌గంజ్‌లో రెండు వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోయాయి. తూర్పు చంపారన్‌లో ఘోడసహన్‌లో రూ.1.5 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నమరో వంతెన కూలిపోయింది.
జూలై 3న సివాన్ జిల్లాలోని మహారాజ్‌గంజ్ బ్లాక్‌లో మూడు వంతెనలు కూలిపోయాయి. జూలై 2న అదే జిల్లాలోని సివాన్‌లోని గండకిపై ఒకటి, తెఘ్రా బ్లాక్‌లో రెండు చిన్న వంతెనలు కూలిపోయాయి. జూన్ 18న అరారియాలోని బక్రా నదిపై నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలిపోయింది.
తేజస్వి ట్వీట్
𝟒 जुलाई यानि आज सुबह बिहार में एक पुल और गिरा।
— Tejashwi Yadav (@yadavtejashwi) July 4, 2024
कल 𝟑 जुलाई को ही अकेले 𝟓 पुल गिरे।
𝟏𝟖 जून से लेकर अभी तक 𝟏𝟐 पुल ध्वस्त हो चुके है।
प्रधानमंत्री नरेंद्र मोदी और मुख्यमंत्री नीतीश कुमार इन उपलब्धियों पर एकदम खा़मोश एवं निरुत्तर है। सोच रहे है कि इस मंगलकारी भ्रष्टाचार को…
RJD నాయకుడు తేజస్వి యాదవ్ గురువారం సామాజిక మాధ్యమం ఎక్స్ లో వ్యంగ్య ఓ పోస్ట్ చేశారు. “ఈ రోజు, అంటే జూలై 4, బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. నిన్న, జూలై 3, ఐదు వంతెనలు కూలిపోయాయి. జూన్ 18 నుంచి ఇప్పటి వరకు 12 వంతెనలు కూలిపోయాయి. ఈ విజయాలపై ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పూర్తిగా మౌనంగా ఉండి నోరు మెదపలేదు. ఈ పవిత్ర అవినీతిని జంగిల్ రాజ్‌గా ఎలా మార్చాలని వారు ఆలోచిస్తున్నారు.
Next Story