
ఉప రాష్ట్రపతిగా ప్రమాణస్వీకారం చేసిన రాధాకృష్ణన్
వేడకకు హజరైన జగదీప్ ధన్ ఖడ్ సహ మాజీ ఉపరాష్ట్రపతులు
భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ లో జరిగిన చిన్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 67 ఏళ్ల రాధాకృష్ణన్ తో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఎర్రటి కుర్తా ధరించి, రాధాకృష్ణన్ దేవుడి పేరు మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు. మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రాధాకృష్ణన్ ప్రతిపక్షాల అభ్యర్థి బీ. సుదర్శన్ రెడ్డిని 152 ఓట్ల తేడాతో ఓడించి విజయం సాధించారు.
జూలై 21న ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్ ఖడ్ అనారోగ్య కారణాలతో అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీనితో ఎన్నిక అనావార్యమైంది. ప్రతిపక్షాలకు బలం లేకపోయినప్పటికి తమ అభ్యర్థిని రంగంలోకి దింపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడిగా రాజీనామా ధన్ ఖడ్ బహిరంగంగా కనిపించారు. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యారు. అలాగే మాజీ ఉపరాష్ట్రపతులు అయిన హమీద్ అన్సారీ, వెంకయ్య నాయుడు కూడా పాల్గొన్నారు.

