తేజస్వీ యాదవ్ కు సడన్ సర్ ప్రైజ్ఇచ్చిన రాహుల్ గాంధీ
x

తేజస్వీ యాదవ్ కు సడన్ సర్ ప్రైజ్ఇచ్చిన రాహుల్ గాంధీ

బీహర్ అసెంబ్లీ ఎన్నికల ముందు కీలక పరిణామం


బీహార్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తన రాజకీయ మిత్రుడు ఆర్జేడీ అధినేత మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీ దేవీ, అలాగే తేజస్వీ యాదవ్ ను కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం రబ్రీదేవికి 10 సర్క్యూలర్ రోడ్ లో ప్రభుత్వ బంగ్లా ను కేటాయించడానికి ఒక రోజు ముందు ఈ పరిణామం చోటు చేసుకుంది.

గాంధీ, తేజస్వీ యాదవ్ రెండు బ్యాక్ టూ బ్యాక్ పబ్లిక్ ఈవెంట్లలో ప్రసగించడానికి ముందు కాంగ్రెస్ నాయకుడు నేరుగా తేజస్వీ యాదవ్ ను కలవడానికి వెళ్లారు. రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ఆయన కుటుంబంతో కలిసి సిటీ గ్రాండ్ హోటల్ లో ఉన్నారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల తరువాత ఈ భేటీ జరిగింది.

ఈ భేటీ పట్ల యాదవ్ విలేకరులతో మాట్లాడారు. మా కుటుంబంతో రాహుల్ గాంధీ కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. అతను మా ఇంటికి వస్తానని చెప్పినట్లు కూడా యాదవ్ పేర్కొన్నారు.
రాహుల్ పర్యటన..
రాజ్యాంగంపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తరువాత బీపీఎస్సీ పరీక్షలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపించిన విద్యార్థులతో కొంత సమయం గడపడంతో పాటు తరువాత 10 సర్క్యూలర్ రోడ్ కు చేరుకున్నారు.
సార్వత్రిక ఎన్నికల తరువాత మొదటి సారి గా రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చారు. తన తిరుగు ప్రయాణంలో ఆయన యాదవ్ కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్, ఆర్జేడీ నాయకులు కూడా కలుసుకునే అవకాశం కలిగింది.
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు..
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరలో నిర్వహించబోతున్నారు. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, జేడీ(యూ), ఆర్జేడీలు సహ ఇతర చిన్న పార్టీలు రెండు కూటములుగా విడిపోయి తలపడుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి కాస్త ఎడ్జ్ సాధించింది. ఇప్పుడు ఇదే ఫార్మూలాను అనుసరించాలని బీజేపీ- జేడీ(యూ) కూటమి భావిస్తుండగా, కాంగ్రెస్ మాత్రం భిన్నంగా స్పందించింది.
గత నెలలో కాంగ్రెస్ ఇన్ చార్జీగా ఉన్న ఏఐసీసీ కార్యదర్శి షానవాజ్ ఆలం మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల కోసం సీట్ల షేరింగ్ ఫార్మూలాకు లోక్ సభ ఎన్నికల సీట్ల కేటాయింపును పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీని ప్రకారం కాంగ్రెస్ కు ఎక్కువ టికెట్లు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇది ఆర్జేడీని రెచ్చగొట్టే చర్యగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొమ్మిది సీట్లలో పోటీ చేయగా కేవలం మూడు సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ పరిణామం తరువాత ఆర్జేడీ, కాంగ్రెస్ కు అన్ని స్ఠానాలు కేటాయించాల్సింది కాదని అభిప్రాయపడింది.
అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రం సిద్దమవుతున్న తరుణంలో షానవాజ్ ఆలం చేసిన వ్యాఖ్యలకు లాలూ కౌంటర్ ఇచ్చారు. ఇండి కూటమికి మమతా బెనర్జీ నాయకత్వం వహించాలని, తాను ఆ ప్రతిపాదనకు అంగీకరిస్తున్నా అని చెప్పారు. ఇలా కాంగ్రెస్ కు ఆయన పరోక్షంగా చెక్ పెట్టినట్లు అయింది. ఈ పరిణామం వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ విడివిడిగా పోటీ చేయడానికి దారి తీస్తుందని ఎన్డీఏ భావిస్తోంది.
Read More
Next Story