బుల్లి రామాలయాలు భలే గిరాకి, విదేశాల నుంచి భారీగా  ఆర్డర్లు
x
అయోధ్యరామమందిర నిర్మాణం నమూనాలు

బుల్లి రామాలయాలు భలే గిరాకి, విదేశాల నుంచి భారీగా ఆర్డర్లు

అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ట కార్యక్రమానికి సమయం దగ్గరపడుతున్న కొద్ది దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిస్తోంది.


అయోధ్య శ్రీరామమందిర నిర్మాణం, రామ్ లల్లా( బాలరాముడి) దివ్యమూర్తికి ప్రాణప్రతిష్ట ముహూర్త సమయం దగ్గర పడే కొద్ది దేశ వ్యాప్తంగా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తోంది. శ్రీరాముడి పేరు ఉన్న ఏ వస్తువైన హట్ కేకుల్లా అమ్ముడు అవుతున్నాయని వ్యాపారులు చెబుతున్న మాట.

ముఖ్యంగా అయోధ్య లో నిర్మాణం జరుపుకుంటున్న శ్రీరామమందిర నమూనాలకు మనదేశంతో పాటు అమెరికా, న్యూజిలాండ్ నుంచి ఆర్డర్లు వస్తున్నాయని ఫైజాబాద్ పట్టణంలోని సహదత్ గంజ్ ప్రాంతంలో గల అవధ్ ఆదిత్య కంపెనీ యాజమానీ ఆదిత్య సింగ్ చెబుతున్న మాట.

"మేము గత రెండేళ్లుగా డిస్ ప్లే బోర్డులు, వాణిజ్య ప్రకటనల బోర్డులు ఇతర వస్తువులకు చెక్కతో తయారు చేసిన వస్తువులను విక్రయిస్తున్నాం. అయితే వీటికంటే శ్రీరామమందిర నిర్మాణా నమూనాలకు అత్యధికంగా ఆర్డర్లు వస్తున్నాయి" అని ఆదిత్య సింగ్ పీటీఐ వార్తా సంస్థ ప్రతినిధులకు చెప్పారు.

అయోధ్యలో శ్రీరాముడి దివ్యమూర్తికి ప్రాణ ప్రతిష్ట సమయం దగ్గర పడే కొద్ది ఈ డిమాండ్ మరింత పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. "అయోధ్య, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో పాకెట్ రామమందిరాల నిర్మాణం కోసం విపరీతంగా ఆర్డర్లు వస్తున్నాయి.

కేవలం ఉత్తర ప్రదేశ్ నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ ఉంది. మా శక్తి కొద్ది దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాం" అని ఆదిత్యసింగ్ చెప్పారు. పాకెట్ మోడల్ శ్రీరామమమందిరానికి రూ. 100 ఖరీదుగా నిర్ణయించామని సింగ్ చెబుతున్నమాట. ఈ మోడల్ ‘శ్రీరామమందిరం అయోధ్య’ లేదా ‘శ్రీరామజన్మభూమి అయోధ్య మందిర్’అని హిందీలో రాసి ఉన్న పీఠంపై 4 అంగుళాల పొడవు, 2.5 అంగుళాల వెడల్పు, 5 అంగుళాల ఎత్తు ఉంటుందని వివరించారు.

విదేశాల నుంచి ఆర్డర్లు

అమెరికా, న్యూజిలాండ్ నుంచి కొంతమంది రామభక్తులు ప్రత్యేకంగా తనకు శ్రీరామజన్మభూమి అయోధ్యమందిర్ నిర్మాణం కావాలని ఆర్డర్ చేసినట్లు ఆదిత్యసింగ్ చెప్పారు. అమెరికా చెందిన భక్తుడు 18 అంగుళాల పొడవు, 10 అంగుళాల వెడల్పు, 12 అంగుళాల ఎత్తు ఉన్న మందిరి నిర్మాణం కోసం ఆర్డర్ ఇచ్చారని వివరించారు.

న్యూజిలాండ్ కు చెందిన భక్తుడు 10 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 8 అంగుళాల ఎత్తుతో ఉన్న నిర్మాణం కావాలని కోరినట్లు పేర్కొన్నారు. ఇవే కాకుండా మరికొన్ని రకాల మోడల్ రామమందిరాలు సైతం తయారు చేస్తున్నట్లు చెప్పారు.

వాటిలో కొన్ని 5 అంగుళాల పొడవు, 3 అంగుళాల వెడల్పు, 6 అంగుళాల ఎత్తు అని, వీటిలో అతి పెద్దదైన మోడల్ 25 అంగుళాల పొడవు, 14 అంగుళాల వెడల్పు, 20 అంగుళాల ఎత్తు ఉంటుందని దీని ఖరీదు రూ. 8000 అని ఆదిత్య సింగ్ చెప్పారు.

అయోధ్యలోని రామపథం వెంబడి ఉన్న అనేక దుకాణాల్లో శ్రీరాముడి పేరు ఉన్న కీ చైన్లు, బ్రాస్లేట్లు, ఇతర మతపరమైన విగ్రహాలు వేగంగా అమ్ముడవుతున్నాయి. అయోధ్యలోని హృతిక్ గుప్తా అనే వ్యాపారీ రామ్ పథంలో ‘అవధ్ ధార్మిక్ అండ్ ఫోటో ప్రేమింగ్’ దుకాణం నడుపుతున్నారు. అతడిని పలకరించగా పలు విషయాలు వెల్లడించారు.

"శ్రీరామ మందిర మోడల్ ఏ సైజులో ఉన్న సరే భక్తులు కొనుగోలు చేస్తున్నారు. చిన్నది, మధ్యస్థం, పెద్దది అనే తేడా చూడట్లేదు. అయితే ఎక్కువగా రూ.100 ఉన్న వాటికి డిమాండ్ ఉంది" అని వివరించారు. ప్రాణప్రతిష్ట వరకూ ఈ డిమాండ్ బాగా ఉంటుందని భావిస్తున్నాని, ఈ సంవత్సరం మొత్తం కూడా ఓ మోస్తారు డిమాండ్ ఉంటుందని అనుకుంటున్నానని చెప్పారు.

జనవరి 22న లక్షమంది భక్తులు అయోధ్య వస్తారని ఇప్పటికే అంచనాలున్నాయి. అందుకు అనుగుణంగా అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు తగ్గ ఆర్డర్లు సైతం అందుకుంటున్నామని స్థానిక వ్యాపారులు చెబుతున్న మాట.

ఆదిత్య సింగ్ మాటల ప్రకారం‘మహరాష్ట్ర, గోవా, ఢిల్లీ, హర్యానా పంజాబ్, గుజరాత్ ఇలా రాష్ర్టం, ప్రాంతాలు అనే తేడా లేకుండా ఆర్డర్ వస్తున్నాయి. కొంతమంది మాకు వంద వరకూ ఇవ్వండి’ అంటూ ఆర్డర్ పెడుతున్నారని చెబుతున్నారు. అయితే ఇవన్నీ జనవరి 22 వరకు కావాలంటున్నారని వివరించారు. " మా దగ్గర పరమితమైన మానవ వనరులు ఉన్నాయి, అందిన కాడికి పంపిస్తాం" అంటూ చెబుతున్నారు.

అవధ్ ఆదిత్య యూనిట్ సూపర్ వైజర్ ఉపేంద్ర సింగ్ మాట్లాడుతూ " మాదగ్గర ప్రస్తుతం 25 మంది కళాకారులు ఉన్నారు. ప్రస్తుతం ఉన్న మోడల్ల ప్రకారం వచ్చిన ఆర్డర్ లను సిద్దం చేయడానికి వీరు సరిపోరు, ఇంకా కొత్తవారిని తీసుకొచ్చే ప్రణాళికలు ఉన్నాయి" అని వివరించారు.

తయారీకి మీడియం సైజు పైన్ ఉడ్ ను ఉపయోగిస్తున్నట్లు ఆయన చెప్పారు. దీనిని న్యూజిలాండ్ నుంచి ఢిల్లీలోని ఓ సంస్థ కొనుగోలు చేస్తుందని, అక్కడి నుంచి తాము తీసుకొంటున్నామని పేర్కొన్నారు. లేజర్ ద్వారా కట్ చేసి, డిజైన్లు రూపొందిస్తున్నామని, ఒక్కోకార్మికుడు రోజుకు ఐదు వరకూ రామమందిర మోడల్ లను తయారు చేస్తున్నట్లు వివరించారు.

Read More
Next Story