సిక్కుల హత్య కేసులో సజ్జన్ కుమార్ దోషే
x

సిక్కుల హత్య కేసులో సజ్జన్ కుమార్ దోషే

నిర్థారించిన ప్రత్యేక న్యాయస్థానం, చిక్కుల్లో మాజీ కాంగ్రెస్ ఎంపీ


మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య తరువాత దేశ రాజధాని లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లు హత్యలో కాంగ్రెస్ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్ ను ఢిల్లీ కోర్టు దోషిగా నిర్ధారించింది.

దేశ రాజధానిలోని సరస్వతి విహార్ లో ఇద్దరు సిక్కు వ్యక్తులకు సంబంధించిన హత్యలో ఆయన ప్రమేయం ఉందని కోర్టు భావించింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా దోషిగా నిర్ధారణ ఉత్తర్వును జారీ చేసి, ఫిబ్రవరి 18న శిక్షపై వాదనలు వింటామని వెల్లడించారు.

తీర్పు కోసం మాజీ ఎంపీని తీహార్ జైలు నుంచి కోర్టు ముందు హజరుపరిచారు. ఈ కేసు 1984 నవంబర్ 1న జస్వంత్ సింగ్, అతని కుమారుడు తరుణ్ దీప్ సింగ్ హత్యలకు సంబంధించింది.
ప్రిమా ఫేసీ కేసు..
మొదటి పంజాబీ బాగ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసినప్పటికీ తరువాత ప్రత్యేక దర్యాప్తు బృందం కేసు టేకప్ చేసింది. డిసెంబర్ 16, 2021 న కోర్టు సజ్జన్ కుమార్ పై ప్రాథమిక సాక్ష్యం కేసును నిర్ధారించి ఆయనపై అభియోగాలు మోపింది.
ప్రాసిక్యూషన్ ప్రకారం.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఒక పెద్ద గుంపు మారణాయుధాలతో పెద్ద ఎత్తున దోపిడి, దహనం, సిక్కులే లక్ష్యంగా దాడులకు పాల్పడింది.
ఆ గుంపు ఫిర్యాదుదారు జస్వంత్ భార్య ఇంటిపై దాడి చేసి ఆమె భర్త, కొడుకును చంపి, వస్తువులను దోచుకుని వారి ఇంటికి నిప్పు పెట్టిందని ఆరోపించింది.
మూకను నడిపించాడు..
సజ్జన్ కుమార్ ను విచారణ కు పంపుతూ కోర్టు ఉత్తర్వులలో దాడులు హత్యల్లో పాల్గోనేవాడు మాత్రమే కాదు.. ఆ గుంపుకు నాయకత్వం వహించాడనే ప్రాథమిక అభిప్రాయాన్ని ఏర్పరచడానికి తగినన్నీ ఆధారాలు ఉన్నాయని లభించాయి.
కొంతమంది రాసిన పుస్తకాల ప్రకారం.. సిక్కుల మెడలో పాత టైర్లు వేసి నిప్పు పెట్టారు. దీనిపై రాజీవ్ గాంధీ సైతం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పెద్ద చెట్టు అదినప్పుడు చిన్న మొక్కలకు ప్రమాదం జరగుతుందని అనడంతో దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగింది.
సిక్కుల నాయకుడైన బింద్రన్ వాలే, అతని అనుచరులు ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం అమృత్ సర్ లోని స్వర్ణదేవాలయాన్ని ఆక్రమించుకోవడంతో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సైనిక చర్యకు ఆదేశించారు. సైన్యం ‘‘ఆపరేషన్ బ్లూ స్టార్’’ పేరిట మిలిటరీ చర్యకు దిగింది.
అందులోనే ఖలిస్తాన్ తీవ్రవాదులు మరణించడంతో సిక్కులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. తరువాత ప్రధాని అంగరక్షకులే స్వయంగా ఆమెని కాల్చి చంపారు.
Read More
Next Story