కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీ
x
అఖిలేష్ యాదవ్

కాంగ్రెస్ కు షాక్ ఇచ్చిన సమాజ్ వాదీ పార్టీ

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితా విడుదల


Click the Play button to hear this message in audio format

యూపీ అసెంబ్లీ ఎన్నికల ముందు పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని భావిస్తున్న ఎస్పీ- కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల పంపిణీ తేలకముందే అభ్యర్థుల ప్రకటన మొదలయింది. యూపీలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న సమాజ్ వాదీ పార్టీ మంగళవారం రాత్రి ఐదుగురు అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. కాంగ్రెస్ తో రెండో విడత చర్చలు ముగిసిన కొన్ని గంటల తరువాత ఈ ప్రకటన వచ్చింది.

జాబితా విడుదల కావడానికి కొద్దిసేపటి ముందు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. బీజేపీ ఓడించి, దేశం తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడటానికి రెండు లౌకిక పార్టీలకు చారిత్రాత్మక అవకాశం కోసం ఎదురు చూస్తోందని అన్నారు. ఇదే పోస్ట్ లో కాంగ్రెస్ కు తాము ఆఫర్ చేసిన 26 సీట్లతో పాటు మరికొన్ని సీట్లపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరారు.
ఎస్పీ విడుదల చేసిన జాబితా ప్రకారం.. సహరన్ పూర్ జిల్లాలోని బెహత్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉమర్ అలీఖాన్ ను అభ్యర్థిగా ప్రకటించారు. షామ్లీ జిల్లాలోని కైరానా అసెంబ్లీ నియోజకవర్గానికి మహబూబ్ అలీ, లలిత్ పూర్ నుంచి జ్యోతి లోధి అభ్యర్థులుగా ఉన్నారు. తేజ్ నారాయణ్ పాండే అలియాస్ పవన్ పాండే ను ఆగష్టులోనే అయోధ్య నుంచి పార్టీ అభ్యర్థిగా ప్రకటించారు. ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు 2027 ప్రారంభంలో జరుగుతాయి.
మంగళవారం సమాజ్ వాదీ పార్టీలు సీట్ల వారీగా కూలంకషంగా చర్చలు జరిపాయి. ఇలాంటి మరో రెండు సమావేశాల్లో ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సీట్ల పంపకం ఒప్పందాన్ని ఖరారు చేస్తామని ఇరు పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఎస్పీ 26 సీట్లను ఆఫర్ చేయగా, కాంగ్రెస్ సుమారు 130 సీట్ల జాబితాను అందజేసింది. అయితే మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఇరు పార్టీల నాయకులు సీట్ల వారీగా చర్చలు జరిపారు. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయని త్వరలోనే మరో రెండు దఫాలుగా చర్చలు జరిగే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు.
Read More
Next Story