శశి థరూర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడు: కాంగ్రెస్ నాయకుడు
x

శశి థరూర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నాడు: కాంగ్రెస్ నాయకుడు

పహల్గామ్ దాడి తరువాత ప్రభుత్వానికి మద్దతు తెలపడంపై ఆ పార్టీ నాయకుడు ఉదిత్ రాజ్ అసంతృప్తి


పహల్గాం ఉగ్రవాద దాడి కాంగ్రెస్ లోని నాయకులు మధ్య విభేదాలకు కారణమైంది. ఈ అంశంపై ప్రభుత్వ చర్యలకు మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ పై ఆ పార్టీకే చెందిన మరో నేత విమర్శలు గుప్పించారు. ఇంటలిజెన్స్ లోపాలు ఉన్నప్పటికీ మనం వాటిని పట్టించుకోవద్దని, ఇజ్రాయెల్ పై జరిగిన అక్టోబర్ 7 నాటి దాడులతో థరూర్ వీటిని పోల్చారు.

పహల్గామ్ దాడి తరువాత జాతీయ మీడియాతో మాట్లాడిన థరూర్.. ఇంటలిజెన్స్ లోపాలు సాధారణంగా జరుగుతుంటాయని, ప్రజలు, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టి పెట్టకూడదని అన్నారు.
యుద్దం ముగిసే వరకూ జవాబుదారీతనం అడగకూడదని, కేంద్రానికి పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించారు. ఏ దేశం కూడా వందశాతం ఇంటలిజెన్స్ ను సేకరించలేదని కూడా ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. ఈ మాటలే పార్టీలోని కొంతమంది నాయకులకు నచ్చలేదు.

ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకుడు ఉదిత్ రాజ్ మాట్లాడుతూ.. శశి థరూర్ ను విమర్శిస్తూ పార్టీ పట్ల ఆయనకున్న విధేయతను ప్రశ్నించారు. శశిథరూర్ తన పార్టీ కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారా? అదే అధికార బీజేపీతో అంటకాగారా? అని రాజ్ ఆశ్చర్యపోయారు.
కాంగ్రెస్ నాయకుడికి విమర్శలు..
కాంగ్రెస్ నాయకుడు ఏ పార్టీకి విధేయత ప్రదర్శిస్తున్నారని ఉదిత్ నారాయణ్ అన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? లేక భారతీయ జనతా పార్టీతో ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. థరూర్ ‘‘సూపర్ బీజేపీ మనిషి’’గా మారడానికి ప్రయత్నిస్తున్నారా? అని విమర్శించారు. పార్టీ ఆయనను బీజేపీ ప్రతినిధిగా నియమించిందా? అని రాజ్ అసహనం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో జరిగిన 26/11 ముంబై దాడులను భద్రతా లోపాలుగా బీజేపీ నాయకులు అప్పట్లో తీవ్రంగా విమర్శించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే నిఘా వైఫల్యాలను థరూర్ సమర్థించడాన్ని ఉదిత్ రాజ్ ప్రశ్నించారు. నిఘా లోపాలను కప్పి పుచ్చడానికి బదులుగా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించమన్నారు.

‘‘కాంగ్రెస్ అధికారంలో లేదు. అయినప్పటికీ బీజేపీ అప్పుడప్పుడూ విమర్శిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ పాలనలో ఉగ్రవాదులు చంపి పారిపోయేవారని చెబుతారు. వీరి పాలనలో కూడా ఉరి, పఠాన్ కోట్, పుల్వామ, పహల్గామ్ లో ఉగ్రవాదులు సాధారణ ప్రజలను ఎలా చంపిపారిపోయారో ప్రశ్నించకూడదా?’’ అని ఆయన అడిగారు.
పహల్గామ్ ఉగ్రవాద దాడి..
ఏప్రిల్ 22న పహల్గామ్ లోని బైసారన్ పర్యటనలో ఉన్న హిందూ పర్యాటకులను ఇస్లామిక్ ఉగ్రవాదులు టార్గెట్ చేసి చంపారు. ఇస్లామిక్ కల్మా చదవలేని చాలామంది తలపై తుపాకీ పెట్టి కాల్చి పారేశారు.
ఇందులో ఒక నేపాలీ పర్యాటకుడు సహ 26 మంది మరణించారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు ఆర్మీ, సీఆర్పీఎఫ్ భారీ వేటను ప్రారంభించింది. జమ్మూకాశ్మీర్ పోలీసులు సైతం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
ఉగ్రవాద దాడి జరిగిన తరువాత భారత్, పాకిస్తాన్ ఉన్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని పక్కనపెట్టింది. దీనికి ప్రతిగా ఇస్లామాబాద్ , సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేసింది.
అలాగే ఇరుదేశాలు తమ సరిహద్దులు మూసివేశాయి. తన దేశంలో ఉన్న పాకిస్తాన్ పౌరులను రేపటితో దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. అలాగే దాయాదీ దేశంతో వాణిజ్యాన్ని సైతం నిలిపివేసింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ దాడి వెనక ఉన్న ప్రతి ఉగ్రవాదిని, వారి మద్దతుదారులను గుర్తించి, ట్రాక్ చేసి శిక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు. రెండు దేశాల మధ్య సైనిక ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఐరాస సైతం స్పందించింది. ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది.
Read More
Next Story