భారత్ జోడో న్యాయ్ యాత్ర కు విరామం
x

భారత్ జోడో న్యాయ్ యాత్ర కు విరామం

భారత్ జోడ్ న్యాయ్ యాత్రకు స్పల్ప విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ప్రకటించారు. యాత్ర తిరిగి మార్చి 2 ప్రారంభం అవుతుందని వెల్లడించారు.


కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి ఆ పార్టీ అగ్రనేత రాహూల్ గాంధీ ప్రారంభించిన రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్రకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ కమ్యూనికేషన్స్ ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ తెలిపారు.

లండన్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి, అలాగే న్యూఢిల్లీలో జరిగే ముఖ్యమైన సమావేశాలకు హాజరయ్యేందుకు వీలుగా ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ భారత్ జోడో న్యాయ్ యాత్ర విరామం ఇవ్వనట్లు వెల్లడించారు. కాన్పూర్ పాదయాత్ర విరామం తరువాత ఫిబ్రవరి 22, 23 తేదీల్లో సైతం విశ్రాంతి తీసుకుంటారని జైరాం రమేష్ వెల్లడించారు.

భారత్ జోడో న్యాయ్ యాత్ర ఫిబ్రవరి 24న ఉదయం యూపీలోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమవుతుంది. తరువాత రాజస్తాన్ లోని ధోల్ పూర్ చేరుకోవడానికి ముందు సంభాల్, అలీఘర్, హాత్రాస్, ఆగ్రా జిల్లాలను కవర్ చేస్తుందని జైరాం రమేష్ చెప్పారు.

ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1 వరకూ రాహూల్ గాంధీ కేంబ్రిడ్జ్ యూనివర్శిటికీ వెళ్లి రెండు ఉపన్యాసాలు ఇస్తారని, ఇది అతని దీర్ఘకాల నిబద్ధతను సూచిస్తుందని ఎక్స్ వేదికగా ప్రకటించారు. తిరిగి మార్చి 2న మధ్యాహ్నం 2 గంటలకు ధోల్ పూర్ నుంచి న్యాయ్ యాత్ర మరోసారి ప్రారంభం అవుతుంది. ఇది మధ్యప్రదేశ్ లోని ఇతర జిల్లాలైనా మొరెనా గ్వాలియర్, శివపురీ, గుణ, షాజాపూర్, ఉజ్జయిని లను కవర్ చేస్తుంది. మార్చి 5న తేదీన మధ్యాహ్నం 2 గంటలకు ఉజ్జయిని మహాకాళేశ్వర్ ను రాహూల్ గాంధీ దర్శనం చేసుకుంటారని తెలిపారు. ఇంతకుముందు కూడా భారత్ జోడో మొదటి యాత్రలో కూడా నవంబర్ 29న ఆయన ఈ ఆలయాన్ని సందర్శించారు.

గత శుక్రవారం యూపీలోకి ప్రవేశించిన తూర్పు- పశ్చిమ మణిపూర్ టూ ముంబై యాత్ర 15 రాష్ట్రాల గుండా 6,700 కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉంది. దారిలో సామాన్య ప్రజలను కలిసి న్యాయ సందేశాన్ని హైలైట్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం.

Read More
Next Story