‘‘ట్రంప్ సీజ్ ఫైర్ ను ఇండియా తిరస్కరించడం వల్లే సుంకాలు’’
x
మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్

‘‘ట్రంప్ సీజ్ ఫైర్ ను ఇండియా తిరస్కరించడం వల్లే సుంకాలు’’

మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్


రష్యా చమురు కొనుగోల చేస్తున్నందుకు భారత్ పై 25 శాతం పెనాల్టీ సుంకాలను విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయానికి ప్రధాన కారణాలలో ఒకటి మే నెలలో జరిగిన భారత్ - పాక్ సంఘర్షణ అని మాజీ దౌత్యవేత్త వికాస్ స్వరూప్ అన్నారు. ఈ సైనిక ఘర్షణను తానే మధ్యవర్తిత్వం వహించి నిలిపివేశానని ఇప్పటికే ఆయన 30 సార్లు ప్రకటించుకోగా, భారత్ ఖండిస్తూ వస్తోంది. ఇదే ఆయన ఆగ్రహానికి కారణమని మాజీ దౌత్యవేత్త అభిప్రాయపడ్డారు.

కెనడా హై కమిషనర్ గా పనిచేసిన స్వరూర్ జాతీయ మీడియాతో మాట్లాడారు. అమెరికా- పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న బంధాన్ని ఆయన తక్కువగా చేసి చూపించారు. ఈ చర్యలు కేవలం స్వల్పకాలిక వ్యూహాత్మక ఏర్పాటుగా అభివర్ణించారు. భారత్- అమెరికా సంబంధాలను ‘‘వ్యూహాత్మకం’’ అని పేర్కొన్నారు.
కాల్పుల విరమణ.. బ్రిక్స్ దెబ్బలు..
బ్రిక్స్ గ్రూపును అమెరికా వ్యతిరేక సంస్థగా ట్రంప్ భావించడం కూడా ఈ వేదికలో కీలక దేశమైన భారత్ పై పెనాల్టీ సుంకాలను విధించడంలో కీలక పాత్ర వహించి ఉండవచ్చని స్వరూప్ వివరించారు.
‘‘అమెరికా సుంకాలను ఎందుకు విధించిందో మనం అర్థం చేసుకోవాలి. నాకు వ్యక్తిగతంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి మనం బ్రిక్స్ లో కీలక దేశం కాబట్టి ట్రంప్ న్యూఢిల్లీపై సంతోషంగా లేడు.
ఆయన ఆలోచనల్లో బ్రిక్స్ అనేది అమెరికా వ్యతిరేక కూటమి అని ముద్రపడింది. ఇది డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీ తీసుకురావాలని నిశ్చయించుకుంది. కాబట్టి భారత్ బ్రిక్స్ లో సభ్యురాలిగా ఉండకూడదని ట్రంప్ భావిస్తున్నారు.
రెండోది ఆపరేషన్ సిందూర్ లో కాల్పుల విరమణ ప్రకటనను ట్రంప్ తనకు ఆపాదించుకుంటున్నారు. దీనిని భారత్ ఖండించింది’’ అని స్వరూప్ అంచనా వేశారు.
ట్రంప్ కు నోబెల్ బహుమతి ఆశలు..
భారత్- పాక్ కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం వహించానని ట్రంప్ అనేకసార్లు పునరావృతం చేశారని, రెండు దేశాల మధ్య అణు సంఘర్షణ ఆపానని ట్రంప్ చెప్పుకుంటున్నారు. అయితే ఆయన ప్రతిపాదలను ఇండియా తోసిపుచ్చుతూ వస్తోంది.
ఆయన చేసిన సహకారాన్ని న్యూఢిల్లీ గుర్తించకపోవడంతో ట్రంప్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పాకిస్తాన్ ఇప్పటికే దానిని అంగీకరించి ఆయనను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసిందని స్వరూప్ గుర్తు చేశారు.
‘‘ట్రంప్ ఒక ఒప్పందదారు. ఇప్పుడు తనకు తానే శాంతిని సృష్టించే వ్యక్తిగా మార్చుకున్నాడు. అతను మధ్యవర్తిత్వం వహించిన అనేక సైనిక సంఘర్షణల పరిస్థితి చూడండి.
థాయిలాండ్, కంబోడియా, రువాండా, కాంగో, ఆర్మేనియా, అజార్ బైజాన్ కావచ్చు. వాటిలో ప్రతి అంశంలో తలదూర్చాడు. వీటిలో అతిపెద్దది.. భారత్ - పాక్ సైనిక ఘర్షణ. ఎందుకంటే ఇవి పెద్ద అణ్వాయుధ శక్తులు.’’అని ఆయన వివరించారు.
‘‘ట్రంప్ తన ఆలోచనల నుంచి నోబెల్ ప్రైజ్ కు అర్హుడినని భావించారు. నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏకైక అమెరికా అధ్యక్షుడు ఒబామా. ట్రంప్ నిజంగా ఒబామా కంటే మెరుగ్గా పనిచేయాలని అనుకుంటున్నాడు.
అందుకే ఆయన తన కోరికను దాచుకోలేదు. ప్రస్తుతం రష్యా- ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ కుదిరిస్తే అది తనకు నోబెల్ ప్రైజ్ తీసుకువస్తుందని ట్రంప్ ఆశిస్తున్నాడు’’ అని మాజీ దౌత్యవేత్త విశ్లేషించారు.
అమెరికా ఒత్తిడి..
ప్రస్తుతం అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందం కుదరడానికి భారత్ తో చర్చలను కూడా నిలిపివేసింది. తన డిమాండ్లకు భారత్ అంగీకరించేలా వాషింగ్టన్ ఒత్తిడి వ్యూహాలను అమలు చేస్తోంది.
భారత్ పాడి, వ్యవసాయ రంగాలకు ఎంట్రీ కోసం వైట్ హౌజ్ ఒత్తిడి చేయడం, దాని భారత్ నిరాకరించడం సుంకాలకు కారణమన్నారు.
‘‘పాడి పరిశ్రమ, వ్యవసాయం, జన్యుమార్పిడి పంటలకు సంబంధించిన అమెరికా చేస్తున్న గరిష్ట డిమాండ్లపై భారత్ సంతకం చేయమని అతని ఒత్తిడి వ్యూహాలలో ఇది ఒక భాగం.
మేము దానిని వదులుకోలేదు. ఇది ఒక విధంగా రష్యాకు సంకేతం. ఎందుకంటే జెలెన్ స్కీ అంగీకరించిన కాల్పుల విరమణకు పుతిన్ ఒప్పించలేకపోతున్నందుకు ట్రంప్ నిరాశ పడుతున్నాడు’’ అని ఆయన విశ్లేషించారు.
Read More
Next Story