‘‘బీహార్ అధికార్ యాత్ర’’ ప్రారంభించిన తేజస్వీ యాదవ్
x
తేజస్వీ యాదవ్

‘‘బీహార్ అధికార్ యాత్ర’’ ప్రారంభించిన తేజస్వీ యాదవ్

రాహుల్ గాంధీ సీఎం అభ్యర్థిగా ప్రకటించకపోవడంతోనే కొత్త యాత్ర అన్న బీజేపీ


బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొలది రాజకీయ పార్టీలు యాత్రల ద్వారా ప్రజలకు చేరువకావడానికి ప్రయత్నిస్తున్నాయి. తాజాగా రాష్ట్రంలో ఇండి కూటమికి నాయకత్వం వహిస్తున్న ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ మంగళవారం ‘‘బీహార్ అధికార్ యాత్ర’’ అనే కొత్త ర్యాలీని ప్రారంభించబోతున్నారు.

ఇది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల గుండా ఐదురోజులు పాటు నిర్వహించబోతున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అయిన తేజస్వీ యాదవ్ జెహనాబాద్ నుంచి ఈ ఉద్యమాన్ని ప్రారంభించబోతున్నారని ఆర్జేడీ ఒక ప్రకటనలో తెలిపింది.

ఎన్డీఏ కంచుకోటలే లక్ష్యంగా..
తేజస్వీ యాదవ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న నేషనల్ డెమోక్రాటిక్ అలయన్స్ (ఎన్డీఏ) కు పట్టున్న ప్రాంతాలలో తన పర్యటన కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సీఎం నితీశ్ కుమార్ సొంత జిల్లా అయిన నలందలో ఆయన ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది.
అలాగే బెగుసరాయ్ కూడా పర్యటించబోతున్నారు. ఇక్కడ కేంద్రమంత్రి, ఫైర్ బ్రాండ్ గా పేరున్న బీజేపీ నాయకుడు గిరిరాజ్ సింగ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నెల 20న మొదటి దశ ర్యాలీ మధ్య, పశ్చిమ బీహర్ లోని వైశాలిలో ముగిసేలా ప్రణాళిక రచించారు.
తేజస్వీ సొంత నియోజవర్గమైన రాఘోపూర్ వైశాలి జిల్లాలో ఉంది. ఆయన అన్న తేజ్ ప్రతాప్ నాయకత్వం వహిస్తున్న మహువా నియోజకవర్గం కూడా ఇక్కడే ఉంది. పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తరువాత తేజ్ ప్రతాప్ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు.
బీహార్ లో ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్( ఎస్ఐఆర్- సార్) కు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ ‘‘ఓటర్ అధికార్ యాత్ర’’ నిర్వహించిన తరువాత మరోసారి ఆ కూటమిలో నాయకుడైన తేజస్వీ రెండో యాత్రను ప్రారంభించబోతున్నారు.
ప్రజలు ఆశీర్వదించాలి..
రాబోయే తన ర్యాలీ గురించి తేజస్వీ యాదవ్ ఒక వీడియో విడుదలు చేశారు. ర్యాలీలో ప్రజలు భారీ సంఖ్యలో హజరుకావాలని కోరారు. ‘‘మీరందరూ మద్దతు ఇచ్చిన ఓటర్ అధికార్ యాత్రర తరువాత దయచేసి బీహర్ అధికార్ యాత్రలో మాతో చేరండి. ఇది తేజస్వీ గురించి కాదు. ఇది నిరుద్యోగులకు ఉద్యోగాలు, మహిళలకు భద్రతను నిర్ధారించే కొత్త దార్శనికత గురించి’’ అని అందులో పేర్కొన్నారు.

అయితే అధికార పక్షం మాత్రం దీనిపై సెటైర్లు గుప్పించింది. ఇటీవల ముగిసిన ఓటర్ అధికార్ యాత్రలో బీహార్ లో తేజస్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడానికి రాహుల్ విముఖత చూపడంపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారని, అందుకే ఆర్జేడీ నాయకుడు అర్జెంట్ గా బీహార్ అధికార్ యాత్రకు ప్లాన్ చేసిందని ఆరోపించాయి.
రాష్ట్రంలోని 25 జిల్లాలో పక్షం రోజుల పాటు జరిగిన యాత్రలో తేజస్వీ కాంగ్రెస్ నాయకుడిని తదుపరి ప్రధానమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు.
ఈ ఆరోపణలను ఆర్జేడీ తోసిపుచ్చింది. తేజస్వీ యాదవ్ సన్నిహితుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ యాదవ్ మాట్లాడుతూ.. ‘‘ఓటర్ అధికార్ యాత్ర అనేది ప్రత్యేక ఇంటెన్సివ్ ఓటర్ల జాబితా సవరణ సమయంలో ప్రజల పేర్లను తొలగించడం గురించి అని బీహార్ అధికార్ యాత్ర మన యువ నాయకుడు ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవడానికి మరో అవకాశం అని చెప్పారు.
Read More
Next Story