‘‘ఆ కూటమి ముస్లిం లీగ్, మావోయిస్ట్ పార్టీ ’’
x
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

‘‘ఆ కూటమి ముస్లిం లీగ్, మావోయిస్ట్ పార్టీ ’’

కాంగ్రెస్ పై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు


ప్రతిపక్ష ‘ఇండి’ బ్లాక్ పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి బ్లాక్ ను ముస్లిం లీగ్, మావోయిస్టు పార్టీగా అభివర్ణించిన ఆయన, ఈ కూటమిని దేశం తిరస్కరించిందని అన్నారు.

ప్రతిపక్ష కూటమి గురించి నేరుగా ప్రస్తావించకుండా, ప్రధానమంత్రి విమర్శలు గుప్పించారు. ఆ కూటమి నాయకులు ప్రస్తుతం ఉన్న నాయకత్వంపై ఆందోళనకు గురవుతున్నారని, వారిని ఎవరూ రక్షించలేరని బాధపడుతున్నారని ఆరోపించారు.

బీహార్ అసెంబ్లీలో అఖండ విజయం సాధించిన తరువాత ప్రధాని మోదీ గుజరాత్ లోని సూరత్ లోపర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘ముస్లింలీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఎంఎంసీని దేశం తిరస్కరించింది. జాతీయవాద ఆదర్శాలలో లోతుగా పాతుకుపోయిన వారు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ వంటి ప్రముఖుల నేతృత్వంలో పనిచేసిన కొంతమంది నాయకులు నామ్ దార్ చర్యలతో విసుగుచెందారు. కాంగ్రెస్ పార్టీని ఎవరూ రక్షించలేరని వారు అంటున్నారు. ఇది ఆ పార్టీ చేరుకున్న స్థితి’’ అని మోదీ అన్నారు.
ఓటమికి సాకులు వెతుకుతోంది
కాంగ్రెస్ పార్టీ తన ఓటమికి కారణాలు వెతుకుతోందని కార్యకర్తలకు ఏమి వివరించలేని స్థితిలో ఉందని ప్రధాని మోదీ విమర్శించారు. ఏం చెప్పుకోలేకనే ఈవీఎంలని ఒకసారి, కొన్నిసార్లు ఎన్నికల కమిషన్ గురించి, మరోసారి ‘సర్’ పై నిందలు వేస్తోందని దుయ్యబట్టారు.
‘‘కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన విషయం. వారు తమ కార్యకర్తలకు ఓటమికి గల కారణాలను వివరించలేకపోతున్నారు. అందుకోసం కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. కొన్నిసార్లు ఈవీఎంలు, కొన్నిసార్లు ఎన్నికల కమిషన్, కొన్ని సార్లు ఓటర్ల జాబితా వల్ల తాము ఓడిపోయామని సాకులు చెబుతున్నారు. ఈ సాకులు వారిని కొన్ని రోజులు సంతృప్తి పరవచ్చు. కానీ వారి కేడర్ ఎక్కువ కాలం సంతృప్తిగా ఉండదు’’ అని మోదీ అన్నారు.
‘‘మేము పార్లమెంట్ లో యువ కాంగ్రెస్ సభ్యులను లేదా ఇండి కూటమి సభ్యులను కలిసినప్పుడూ వారు మాట్లాడుతూ మా భవిష్యత్ ముగింపు దశకు చేరుకుంటున్నాయి.
ఈ వ్యక్తులు ప్రతిసారీ పార్లమెంట్ ను లాక్ చేయండని చెబుతున్నారు. కాబట్టి మాకు మాట్లాడే అవకాశం కూడా దొరకడం లేదు. వారు తమ సొంత నియోజకవర్గాలకు సమాధానం చెప్పలేకపోతున్నారు’’ అని ఆయన అన్నారు.
పదిశాతం ఓట్ల తేడా..
సూరత్ విమానాశ్రాయంలో అంతకుముందు ప్రసంగించిన మోదీ ఎన్డీఏ, మహాఘట్ బంధన్ మధ్య పది శాతం ఓట్ల తేడా ఉందని అన్నారు. ‘‘ఇది చాలా పెద్ద మొత్తం. దీని అర్థం సగటు ఓటరు ఒక విధంగా ఓటు వేశారు. ఏ అంశంపై అభివృద్ది. నేడు బీహార్ లో అభివృద్ది కోసం ఆరాటం స్పష్టంగా కనిపిస్తోంది’’ అని మోదీ చెప్పారు.
‘‘బీహార్ క్రమంగా అభివృద్ది చెందింది. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా మీకు బీహార్ ప్రతిభ కనిపిస్తుంది. బీహార్ ఇప్పుడు అభివృద్ది లో కొత్త శిఖరాలను చేరుకోవడానికి సిద్దంగా ఉంది.
ఈ ఎన్నికలు ఆ సంసిద్ధతను తెలియజేస్తున్నాయి. బీహార్ మహిళలు, యువత కలయిక ఏర్పడింది. ఇది భవిష్యత్ రాజకీయాలను పునాదిని బలోపేతం చేసింది. బీహార్ ఎన్నికల చిక్కులను విశ్లేషించడానికి నెలల సమయం పడుతుంది’’ అని మోదీ చెప్పారు.
రాహుల్, తేజస్వీపై విమర్శలు..
రాహుల్ గాంధీ, తేజస్వీ యాదవ్ ల పేరు ప్రస్తావించకుండా ప్రధాని విమర్శలు గుప్పించారు. గత రెండు సంవత్సరాలుగా బెయిల్ పై ఉన్న నాయకులు బీహార్ లో తిరుగుతూ కుల రాజకీయాల కుంపటిని రగిలించడానికి ప్రయత్నించారు. కానీ బీహార్ ప్రజలు ఈ విషాన్ని పూర్తిగా తిరస్కరించారని అన్నారు.


Read More
Next Story