ఆ శీతాకాలపు రాత్రిలో ‘రామ్ లల్లా’.. అయోధ్య కథలు
x

ఆ శీతాకాలపు రాత్రిలో ‘రామ్ లల్లా’.. అయోధ్య కథలు

రామజన్మభూమి వివాదం దాదాపు ఐదువందల సంవత్సరాల తరువాత ఓ కొలిక్కి వచ్చింది. అయితే దీని వెనక జరిగిన కొన్ని ముఖ్యమైన విషయాలు మీకోసం


రామ్ జన్మభూమి స్థానంగా హిందువులు భావిస్తున్న ప్రాంతంలో మసీదును ఎప్పుడో నిర్మించారు. ఇందులోకి రామ్ లల్లా విగ్రహం ఎలా వచ్చింది. ఈ ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరూ? ఫెడరల్ 2020 ఆగష్టులో ప్రచురించిన కథనాన్ని మరోసారి మీ ముందుకు తెచ్చింది. వివాదాస్పద బాబ్రీ కట్టడంలోకి స్వాతంత్రం వచ్చిన రెండు సంవత్సరాలకు అంటే 1949 డిసెంబర్ 23న రామ్ లల్లా విగ్రహం అక్కడ ప్రతిష్టించినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

అయోధ్య లో జరిగిన సంఘటన చిన్నది కాదు. అప్పటి నుంచి దేశ రాజకీయ, చట్టపరమైన, సామాజిక - సాంస్కృతిక పోరాటానికి ఇది నాందీగా మారింది. ఎన్నో పోరాటాలు, మరెన్నో బలిదానాలు అయోధ్య చుట్టూ జరగడానికి దీనిని కారణంగా చెప్పవచ్చు. ప్రభుత్వాలను పడగొట్టి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడటానికి ఈ సంఘటనే కారణం.




మలుపు తిప్పిన రూ. 179.20 కేసు

1978లో షా బానో, విడాకుల కేసులో భరణం కావాలని ఆశిస్తూ కోర్టులో సుదీర్ఘ న్యాయపోరాటం చేశారు. తన భర్త తలాక్ చెప్పారని, ఐదుగురు పిల్లలు ఉన్నందున భరణం ఇప్పించాలని, అదికూడా రూ. 179.20 కావాలని కోరింది. దీనిపై అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన కొన్ని తప్పులు అయోధ్య ఉద్యమం ఉధృతం కావడానికి కారణం అయ్యాయి అని చెప్పవచ్చు.

1984 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత అప్పటి యూపీ లో కాంగ్రెస్ మాజీ మంత్రి దావు దయాల్ ఖన్నా అయోధ్యలో ఉన్న బాలరాముడికి పూజలు చేయాలని డిమాండ్ చేస్తూ రామ్- జానకీ యాత్రలు యూపీ లో నిర్వహించారు. అలా 1986లో అప్పటి ప్రభుత్వ ఆమోదం, కోర్టు అనుమతితో నిత్య పూజలు ప్రారంభం అయ్యాయి. అయితే తరువాత రాజీవ్ గాంధీ షాబానో కేసులో వ్యవహరించిన తీరుతో కొన్ని వర్గాలు ఆగ్రహాలు వ్యక్తం చేశాయి. తరువాత జరిగిన పరిణామాలు వీహెచ్ పీ ఉద్యమంలో నాయకత్వం వహించడానికి తోడ్పడింది.




మండల్ వర్సెస్ కమండల్

మండల్ కమిషన్ వివాదం వచ్చే సమయానికి యూపీ ముఖ్యమంత్రిగా ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. అయోధ్యలో తాను పూర్తిగా రక్షణ ఏర్పాట్లు చేశానని ప్రకటించారు. అంతే కాకుండా "కర్ సేవక్ తో క్యా పరింద భీ అయోధ్య మే పర్ నహీ మార్ సాకేగా " (అయోధ్యలో పక్షులు సైతం నా అనుమతి లేకుండా ఎగరలేనంత భద్రత ఉంది, ఇక కరసేవకులు ఎలా వస్తారు అనే అర్థం వచ్చేలా ) అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అయితే వీహెచ్ పీ తరవాత అయోధ్య యాత్రకు పిలుపునిచ్చింది. అనుకున్నది సాధించింది.



జై శ్రీరామ్, హో గయా కామ్

1980 దశకం చివరి నాటికి దేశంలో సంకీర్ణ శకం ప్రారంభం అయింది. అప్పుడు ప్రధాని గా ఉన్న చంద్రశేఖర్ అంటే రాజీవ్ గాంధీకి ఇష్టంలేకపోవడంతో జరిగిన రాజకీయ పరిణామాలు మళ్లీ మధ్యంతర ఎన్నికలకు దారి తీసింది. తరువాత ప్రధానిగా ఎన్నికైన పీవీ నరసింహరావు, యూపీలో అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ సీఎం కల్యాణ్ సింగ్ మాటలను నమ్మారు. రాష్ట్ర ప్రభుత్వం బాబ్రీను కాపాడతారనే నమ్మకంతో కాస్త ఏమరపాటుగా ఉండడంతో పురాతన కట్టడం నేలకూలింది. అప్పటికే అద్వానీ రథయాత్ర, వాజ్ పేయ్ ప్రసంగాలతో బీజేపీ క్రమంగా ఢిల్లీ పీఠానికి చేరువయ్యేలా చేశాయి.



మసీద్ కూల్చివేత తరువాత మందిర నిర్మాణంపై సంఘ్ నేతలు ఎక్కడ పెద్దగా మాట్లాడింది లేదు. 2004 ఎన్నికల్లో కూడా బీజేపీ ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. అయితే వరుసగా పది సంవత్సరాలు అధికారానికి దూరం కావడంతో మందిరాన్ని నిర్మిస్తామనే ప్రచారం తిరిగి ప్రారంభించింది.

2019 నవంబర్ లో వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆతరువాత మందిరం నిర్మాణానికి, ప్రారంభానికి ఈ తీర్పే మార్గం చూపింది.

Read More
Next Story