లంచాలు ఇచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నారని అమెరికా కంపెనీ పై కేసు
x

లంచాలు ఇచ్చి కాంట్రాక్టు దక్కించుకున్నారని అమెరికా కంపెనీ పై కేసు

విచారణ ప్రారంభించిన ఇండియన్ అయిల్ కార్పొరేషన్


పెట్రోలియం సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ఆయిల్ శుద్ధి చేయడానికి ఉపయోగించే ఉత్ప్రేరకాలు సప్లై చేసేందుకు అమెరికా సంస్థ లంచాలు ఇచ్చిందనే అభియోగాలపై ఆ సంస్థ విచారణ ప్రారంభించింది. యూఎస్ లోని స్పెషాలిటీ కెమికల్స్ సంస్థ అధికారులు లంచాలు ఎరవేసి తమ సంస్థ అధికారులను లోబర్చుకున్నారని తెలిపింది.

చమురు శుద్ధి కర్మాగారాల నిర్వహణలో ఉపయోగించే ఉత్ప్రేరకాలను అభివృద్ధి చేసి విక్రయించే గ్లోబల్ స్పెషాలిటీ కెమికల్స్ సరఫరాదారు అల్బెమార్లే కార్పొరేషన్, "ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వ్యాపారానికి సంబంధించి భారతదేశ మధ్యవర్తి కంపెనీకి సుమారు USD 1.14 మిలియన్ల కమీషన్ చెల్లించి, దానిపై సుమారు USD 11.14 మిలియన్ల లాభాలను పొందిందనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యాపారం 2009 నుంచి 2011 వరకూ జరిగిందని ఆ సంస్థ వర్గాలు వెల్లడించాయి.
అల్బెమర్లే 2017లో US అధికారులు లంచం ఇవ్వజూపుతూ అరెస్ట్ కాబడ్డాడు. ఆ కేసులో 198 మిలియన్ డాలర్ల జరిమానా విధించి ఈ కేసు నుంచి బయటపడ్డాడు. ఆ కంపెనీపై అమెరికాలో నమోదయిన కేసు విషయంలో ఐఓసీపై ఎటువంటి అభియోగాలు లేనప్పటికీ, తన పరిధిలో విచారణ చేయాలని కంపెనీ నిర్ణయించింది.
ఐఓసీకి మొత్తం 22 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. అందులో పది కర్మాగారాలు ఇండియాలో ఉన్నాయి. ఇవి సంవత్సరానికి 80. 8 మిలియన్ టన్నుల ముడి చమురును పెట్రోల్, డీజీల్ ను శుద్ది చేయగలవు. ఇది ఇంధన మార్కెట్‌లో దాదాపు 40 శాతానికి సమానం.
"మా వాటాదారులు, భాగస్వాములు, ఉద్యోగులకు మేము చట్టాన్ని గౌరవించే కంపెనీ అని, అన్ని చట్టాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని మేము హామీ ఇస్తున్నాము" అని భారతదేశపు అతిపెద్ద చమురు సంస్థ ఫైలింగ్‌లో తెలిపింది.
కొన్ని రోజుల కింద భారతీయ వ్యాపారవేత్త గౌతమ్ ఆదానీపై అమెరికాలోని కోర్టులో కేసు నమోదు అయింది. దేశంలోని పవర్ ప్రాజెక్ట్ లు పొందడానికి ఆదానీ గ్రూపు 2 వేల కోట్ల ను లంచాలుగా ఇచ్చిందని దీనివల్ల కంపెనీకి 20 వేల కోట్లు లాభాలు వచ్చాయని బైడెన్ ప్రభుత్వం యూఎస్ కోర్టులో కేసు నమోదు చేసంది.
అయితే ఈ ఆరోపణలను ఆదానీ గ్రూపు ఖండించింది. భవిష్యత్ లో అమెరికా నుంచి పెట్టుబడులు సేకరించకూడదని నిర్ణయించుకుంది. ఇప్పుడు ఇండియా కంపెనీ అమెరికా కంపెనీపై అదే అభియోగాలతో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.


Read More
Next Story