కరెంట్ స్తంభం ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
x
కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర జాతి

కరెంట్ స్తంభం ఎక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ముగ్గురు ఉన్నతాధికారుల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేత, కరెంట్ కోతలు విధిస్తున్నారనే ఆగ్రహంతో ఉత్తరాఖండ్ ఎమ్మెల్యే వీరేంద్ర నిరసన


ఉత్తరఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు కరెంట్ స్తంభం ఎక్కి, విద్యుత్ శాఖకు చెందిన ముగ్గురు ఉన్నతాధికారుల ఇళ్లకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు.

విద్యుత్ కోతలతో విసుగు చెందిన ఆయన ఈ ఘటనకు పూనుకున్నారు. హరిద్వార్ జిల్లాలోని ఝబ్రేడాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీరేంద్ర మంగళవారం ఈ ఘటనకు పాల్పడ్డారు.

దీనితో విద్యుత్ శాఖ రూర్కీ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్ లో సదరు కాంగ్రెస్ ఎమ్మెల్యే పై ఫిర్యాదు చేసింది. విద్యుత్ కనెక్షన్ తీసేసిన వారిలో ఒకరు ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ అని సమాచారం.

వీరేంద్ర మొన్నతన మద్దతుదారులతో ఒక నిచ్చెన, కొన్ని పనిముట్లతో రూర్కీకి వచ్చాడు. అతను మొదట బోట్ క్లబ్ లోని సూపరింటెండింగ్ ఇంజనీర్ వివేక్ రాజ్ పుత్ అధికారిక నివాసం వెలుపల ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కి విద్యుత్ కనెక్షన్ నిలిపివేశాడు.

దీని తరువాత ఎమ్మెల్యే తన కాన్వాయ్ తో చీఫ్ ఇంజనీర్ అనుపమ్ సింగ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వినోద్ పాండే అధికారిక నివాసాలకు చేరుకుని, వారి ఇళ్లకు కూడా విద్యుత్ కనెక్షన్ కట్ చేశారు. ఈ పనులన్నీ ఎమ్మెల్యేనే స్వయంగా చేశారు.

తన నియోజకవర్గంలో రోజుకు ఐదు నుంచి ఆరు గంటల పాటు అప్రకటిత విద్యుత్ కోతలు అమలవుతున్నాయని, దీనివల్ల ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని వ్యాపారాలు చేసుకోలేక చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారని వీరేంద్ర ఆరోపించారు.
విద్యుత్ కోతల అంశాన్ని తాను పదిరోజులుగా విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నానని, కానీ వారి నుంచి ఆశించిన స్థాయిలో చర్యలు రాలేదని తెలిపారు.
ప్రజలు బాధ అధికారులకు తెలియజేయాలనే లక్ష్యంతో వారికి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేసినట్లు తన చర్యలను సమర్థించుకున్నారు. ఈ సంఘటనతో విద్యుత్ శాఖ అధికారులు ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు.
ఎటువంటి షట్ డౌన్ లేకుండా ప్రజల భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా విద్యుత్ లైన్లను కత్తిరించారని ఆరోపించింది. ఇలాంటి పెద్ద విపత్తులకు దారితీసే అవకాశం ఉందని పేర్కొంది. ఇది నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదని, ప్రభుత్వ పనిలో ప్రత్యక్ష జోక్యం వంటిదని కూడా ఆరోపించింది. ప్రస్తుతం ఉత్తరాఖండ్ లో బీజేపీ అధికారంలో ఉంది. పుష్కర్ సింగ్ ధామి సీఎంగా కొనసాగుతున్నారు. గత రెండు టర్మ్ లు అక్కడ బీజేపీ తన పట్టును నిలుపుకుంది.


Read More
Next Story