ఆ ఐకానిక్ పెయింటింగ్ ను ‘సామ్ మానేక్ షా’ కేంద్రానికి తరలించిన ఆర్మీ
x

ఆ ఐకానిక్ పెయింటింగ్ ను ‘సామ్ మానేక్ షా’ కేంద్రానికి తరలించిన ఆర్మీ

అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రా


బంగ్లాదేశ్ ఆవిర్భావానికి ముందు భారత్ - పాకిస్తాన్ మధ్య 1971 లో యుద్ధం జరిగింది. 13 రోజుల పాటు జరిగిన ఈ పోరులో ఇస్లామాబాద్ సేనలు తొకముడిచాయి. ఈ సందర్భంగా అప్పటి తూర్పు పాకిస్తాన్ నేటీ బంగ్లాదేశ్ లో ఉన్న పాకిస్తాన్ ఆర్మీ లొంగి పోతున్నట్లు ఒప్పందం చేసుకున్నాయి.

ఇందులో భారత ఆర్మీకి చెందిన లెప్టినెంట్ జనరల్ జగ్జిత్ సింగ్ అరోరా- పాకిస్తాన్ లెప్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ సంతకం చేస్తున్న సందర్భంగా తీసిన చిత్రం అత్యంత ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం ప్రస్తుతం ఉన్న ఆర్మీ ప్రధాన కార్యాలయం నుంచి ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్ షా పేరు మీద నెలకొల్పిన కేంద్రంలోకి మార్చారు. సోమవారం నిర్వహించిన ‘విజయ్ దివస్’(పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ ను విడగొట్టిన డిసెంబర్ 16ను విజయ్ దివస్ గా నిర్వహిస్తారు) సందర్భంగా ఆర్మీ చీఫ్ స్వయంగా ఈ పెయిటింగ్ ను పున: ప్రారంభించారు.

కాంగ్రెస్ అభ్యంతరం..
కేంద్రం చరిత్రను చెరిపేసి తిరగరాసే ప్రయత్నం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ లోక్‌సభలో లేవనెత్తారు. “పాకిస్తాన్ సైన్యం భారత్‌కు లొంగిపోతున్నట్లు చూపించే చిత్రాన్ని ఆర్మీ హెడ్‌క్వార్టర్స్ నుంచి తొలగించారు. ఆ చిత్రాన్ని తిరిగి పెట్టాలి” అని ఆమె అన్నారు.
అయితే దీనిపై సైన్యం వివరణ ఇస్తూ.. ఆ చిత్రం ఇప్పుడే సముచితమైన స్థానంలో ఉందంది. "ఈ పెయింటింగ్ #ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ గొప్ప సైనిక విజయాలలో ఒకటి. అందరికీ న్యాయం, మానవత్వం కోసం #భారతదేశం నిబద్ధతకు నిదర్శనం" అని సైన్యం తెలిపింది.
"#ManekshawCentre #NewDelhiలో దీని ప్లేస్‌మెంట్ ఈ వేదిక వద్ద # భారతీయులతో సహ, విదేశాల నుంచి వచ్చే వారికి గొప్ప అనుభూతిని మిగులుస్తుందని ఆర్మీ వెల్లడించింది. ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌లోని ఇప్పుడు ఈ చిత్రం తీసేసిన తరువాత 'కర్మ్ క్షేత్రం' అనే పెయింటింగ్ పెట్టారు.
ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో సైనిక జనరల్ గా సామ్ మానేక్ షా ఉన్నారు. బంగ్లాదేశ్ ఆక్రమణకు సైనిక చర్య చేయాలని జూన్ లో ఇందిరాగాంధీ ఆదేశించారు. అయితే ఈ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. ఇప్పుడు సైన్యం వెళ్తే వర్షాకాలంలో బంగ్లాలోని చిత్తడి నేల వరదల్లో చిక్కుకుంటుందని హెచ్చరించారు.
దాడికి అనువైన కాలం నవంబర్ నుంచి జనవరి అని వివరించారు. చివరకు ఆయన ప్రణాళిక ప్రకారం పాకిస్తాన్, భారత్ పై దాడి చేయగానే భారత సైన్యాలు రంగంలోకి దిగాయి.కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్ భారత్ ముందు లొంగిపోయింది. 90 వేల పాకిస్తాన్ సైనికులు మనకు బందీలుగా చిక్కారు. రెండో ప్రపంచయుద్ధం తరువాత ఇంతమంది సైనికులుగా పట్టబడటంతో ఇస్లామాబాద్ దిగిరాక తప్పలేదు.
ఇందిరాగాంధీ నిర్ణయాన్ని వ్యతిరేకించినందుకు తరువాత కాలంలో సామ్ మానేక్ షా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఆయన పీఎఫ్ కూడా ఆగిపోవడంతో తరువాత అబ్దుల్ కలాం కాలంలో వాటిని క్లియర్ చేసినట్లు వినికిడి.


Read More
Next Story