చివరి అంకానికి చేరుకున్న మహాకుంభమేళా
x

చివరి అంకానికి చేరుకున్న మహాకుంభమేళా

ప్రయాగ్ రాజ్ కు కోట్లాదిగా తరలివస్తున్న భక్తులు


మహాకుంభమేళా చివరి అంకానికి చేరడం, ఇదే రోజు మహా శివరాత్రి కావడంతో ప్రయాగ్ రాజ్ కు లక్షలాది మంది భక్తులు చేరుకున్నారు. పురాణ శ్లోకాలు చదువుతూ, మహాశివుడిని, గంగా నదీని కీర్తిస్తూ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్నారు.

మహాకుంభమేళా జనవరి 13 పుష్య పూర్ణిమ సందర్భంగా ప్రారంభమైంది. ఇప్పటి వరకు పవిత్ర సంగంలో దాదాపు 64 కోట్ల మంది ప్రజలు పుణ్య స్నానాలు ఆచరించారు. మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు దాదాపుగా 2 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా.
ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రయాగ్ రాజ్ మొత్తాన్ని నిన్న సాయంత్రం నుంచి నో వెహికల్ జోన్ గా ప్రకటించారు. కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే మినహయింపు ఇచ్చారు.
మహాకుంభమేళా ప్రపంచంలోనే అతిపెద్ద మత ఉత్సవంగా పేరుంది. ఇది అంతరిక్షం నుంచి సైతం కనిపిస్తుంది. భారత్ లో చివరిగా 1882 లో మహాకుంభమేళా జరిగింది.
మహాశివరాత్రి సందర్భంగా చేసే పవిత్ర స్నానాన్ని చివరి స్నానంగా భావిస్తారు. ఇందుకోసం ఇప్పటికే కోట్లాది భక్తులు ప్రయాగ్ రాజ్ కు చేరుకున్నారు. బుధవారం అర్థరాత్రితో ఈ పండగ ముగుస్తుంది. చాలామంది బ్రహ్మీ ముహూర్తంలో స్నానం చేయడానికి వేచి ఉన్నారు.
మహాశివరాత్రి రోజున పరమాత్మ లింగరూపంలో ఆవిర్భావించాడని భారతీయ పురాణ వాగ్మయం పేర్కొంటుంది. ఈరోజు శివుడు- పార్వతీదేవీ పెళ్లి జరిగిందని చెబుతారు. మహాకుంభమేళా జరగడానికి కారణమైన సముద్ర మథనం జరిగిన సమయంలో మొదట ఉద్భవించిన హాలహలాన్ని శివుడు స్వీకరించి నీలకంఠుడిగా, గరళకంఠుడిగా మారాడు.
Read More
Next Story