సభకు గైర్హాజరు కావాలని విప్ జారీ చేసిన పార్టీ
x

సభకు గైర్హాజరు కావాలని విప్ జారీ చేసిన పార్టీ

హర్యానాలో రేపు జరగబోయే విశ్వాస తీర్మానం సందర్భంగా జేజేపీ పార్టీ తన ఎమ్మెల్యెలకు విప్ జారీ చేసింది. అయితే ఇందులో సభకు హజరుకాకూదని పేర్కొంది.


లోక్ సభ ఎన్నికల వేళ హర్యానాలో రాజకీయాలు రక్తి కడుతున్నాయి. అసెంబ్లీ రేపు నయాబ్ సింగ్ సైనీ ప్రభుత్వం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. కాగా ప్రభుత్వం తీసుకురానున్న విశ్వాస తీర్మానంపై, ఓటింగ్ సందర్భంగా తమ 10 మంది శాసనసభ్యులు సభకు గైర్హాజరు కావాలని జననాయక్ జనతా పార్టీ (జెజెపి) బుధవారం (మార్చి 13) విప్ జారీ చేసింది.

మనోహర్ లాల్ ఖట్టర్ తన క్యాబినెట్ మంత్రులతో కలిసి పదవికి రాజీనామా చేసిన కొన్ని గంటల తర్వాత, మంగళవారం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీని బిజెపి నియమించింది.
సాయంత్రం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తమకు 48 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనే లేఖను గవర్నర్‌కు అందించామని సీఎం సైనీ తెలిపారు. సభలో మెజారిటీ నిరూపించుకునేందుకు బుధవారం అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించాలని గవర్నర్ ను కోరామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో బిజెపి-జననాయక్ జనతా పార్టీ (జెజెపి) పొత్తు ఇక ముందు ఉండదనే ప్రచారం నేపథ్యంలో ఫ్లోర్ టెస్ట్ నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశించారు. అయితే పొత్తు పై ఇప్పటి వరకూ ఇరు పార్టీలు అధికారిక ప్రకటన చేయలేదు.
"హర్యానా శాసనసభలోని JJP సభ్యులందరూ బుధవారం విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభకు గైర్హాజరు కావాల్సిందిగా ఆదేశించినట్లు" అందులో పార్టీ అధికార ప్రతినిధి పేర్కొన్నారు.
90 మంది సభ్యుల రాష్ట్ర అసెంబ్లీలో, బిజెపికి 41 మంది సభ్యులు ఉన్నారు. ఏడుగురు స్వతంత్రులలో ఆరుగురితో పాటు హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే గోపాల్ కందా యొక్క మద్దతు కూడా బీజేపీకే ఉంది. సభలో జేజేపీకి 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌కు 30 మంది ఎమ్మెల్యేలు ఉండగా, ఇండియన్ నేషనల్ లోక్ దళ్‌కు ఒకరు ఉన్నారు.
JJP మద్దతు లేకపోయినా హర్యానాలో బీజేపీ ప్రభుత్వం సునాయాసంగా ఫ్లోర్ టెస్ట్ లో గెలిచేలా ఉన్నట్టు కనిపిస్తోంది.


Read More
Next Story