జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. తాజాగా ఎవరంటే..
x

జమ్మూకాశ్మీర్ లో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. తాజాగా ఎవరంటే..

జమ్మూకాశ్మీర్ పోలీసులు ప్రముఖ న్యాయవాదీ, ఆ రాష్ట్ర హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రస్తుత చైర్మన్ నజీర్ అహ్మద్ రోంగా ను అరెస్ట్ చేశారు.


జమ్మూకాశ్మీర్ లోని సీనియర్ న్యాయవాదీ నజీర్ అహ్మద్ రోంగాను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రి 1.10 నిమిషాల ప్రాంతంలో ఆయన ఇంటికి చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేసి తమ వెంట తీసుకెళ్లారు. J&K హైకోర్టు బార్ అసోసియేషన్ ప్రస్తుత చైర్మన్ నజీర్ రోంగాపై పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఇది ఒక వ్యక్తిని విచారణ లేకుండా ఒక సంవత్సరం పాటు నిర్బంధించడానికి అధికారులకు అధికారం ఇస్తుంది. ఈ హాఠాత్ పరిణామంతో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

న్యాయవాది కుమారుడు ఉమైర్ రోంగా ఈ అరెస్ట్ విషయమై సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు. "నా తండ్రి, J&K హైకోర్టు బార్ అసోసియేషన్ ఛైర్మన్, NA రోంగా, తీవ్ర కలకలం రేపుతున్న కొన్ని సంఘటనలతో ఇప్పుడే అరెస్టు చేయబడ్డారు" అని పోస్ట్ చేశాడు.
తెల్లవారుజామున 1.10 గంటలకు, J&K పోలీసుల బృందం ఎటువంటి అరెస్ట్ వారెంట్ లేకుండా మా ఇంటికి వచ్చారు, కేవలం 'ఇది పై నుంచి వచ్చిన ఆర్డర్' ( "అపర్ సె ఆర్డర్ హై ") అని పేర్కొన్నారు. మేము దిగ్భ్రాంతి చెందాము. తీవ్ర బాధలో ఉన్నాము. J&K హైకోర్టు బార్ అసోసియేషన్ సభ్యులను భయపెట్టడానికి PSA దుర్వినియోగం చేస్తున్నారు" అని రోంగా పోస్ట్ లో రాశారు.
రెండు వారాల్లో మూడో అరెస్ట్
రెండు వారాల్లో J&K పోలీసులు అరెస్ట్ చేసిన మూడో వ్యక్తి నజీర్ అహ్మద్ రోంగా. ఇంతకుముందు న్యాయవాది బాబర్ ఖాద్రీని 2020లో ఉగ్రవాదులు హత్య చేసిన కేసులో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మియాన్ అబ్దుల్ ఖయూమ్‌ను జూన్‌లో అరెస్టు చేశారు. ఆదివారం అర్ధరాత్రి, మియాన్ ఖయూమ్ మేనల్లుడు న్యాయవాది మియాన్ ముజఫర్‌ను కూడా పోలీసులు శ్రీనగర్‌లోని అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. తరువాత పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
ప్రజా భద్రతా చట్టం
నజీర్ ను ఇంటి నుంచి తీసుకెళ్లడం సీసీ కెమెరాలో రికార్డు అయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద రోంగాను అదుపులోకి తీసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు, అయితే పోలీసులు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు చేయడానికి ముందు J&K పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ కింద నిర్బంధించబడిన అనేక మంది నాయకులలో ఆయన ఒకరు.
తప్పు పట్టిన ముఫ్తీ..
నజీర్ రోంగా ఆకస్మిక అరెస్టును పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ తప్పుబట్టారు. "ఉగ్రవాదాన్ని అరుదుగా చూసే ప్రాంతాలలో కూడా హింస నిరంతరం కొనసాగుతోంది. ప్రతిరోజూ సైనికులు అమరులవుతున్నారు. భారత ప్రభుత్వంతీవ్రవాదాన్ని అంతం చేయడంలో విఫలమవ్వడమే కాకుండా నిస్సహాయులపై దుర్మార్గపు అణిచివేతను ప్రారంభిస్తోంది. కాశ్మీరీలు నజీర్ రోంగా దాని అణచివేత చర్యలకు తాజా బాధితుడు" అని ఆమె ఎక్స్‌లో రాసింది.


Read More
Next Story