సంధి లేదు.. సమరమే.. తిరుగుబాటు ఎమ్మెల్యే విషయంలో కాంగ్రెస్
తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో వెనక్కి తగ్గకూడదనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ ప్రభావం లోక్ సభ ఎన్నికల్లో పడకుండా ఎన్నికల హమీలను అమలు చేయాలని..
హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పై తిరుగుబాటు జెండా ఎగరవేసిన ఆరుగురు శాసన సభ్యులతో కఠినంగా వ్యవహరించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం సుఖ్ విందర్ సింగ్ సుఖు ప్రభుత్వానికి అండగా నిలవబడాలని కూడా నిర్ణయించుకుంది. రెబెల్ ఎమ్మెల్యేలతో ఎలాంటి చర్చలు కూడా జరిపే ప్రసక్తే లేదంటోంది.
తిరుగుబాటు చేసిన సుధీర్ శర్మ, జమ్మూ కాశ్మీర్ ఏఐసీసీ సెక్రటరీగా ఇంతకు ముందు పని చేశాడు. కాంగ్రెస్ పార్టీ తాజాగా అతడిని ఆ పదవి నుంచి తొలగించింది. ఈయన ధర్మశాల నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే తనను పార్టీ బాధ్యతల నుంచి తొలగించడంతో చాలా ఫ్రీ అయ్యాయని, అనవసర బంధనాలు తొలగిపోయాయని ఆయన ఎక్స్ వేదికగా ప్రకటించారు.
అలాగే రాజేందర్ రాణా కూడా తనకు పార్టీ అప్పగించిన పదవులకు కూడా రాజీనామా చేశాడు. వీరంతా ఇప్పటికీ పంచకులలోని హోటల్ లోనే ఉన్నారు. వీరితో పాటు అనర్హత వేటు పడ్డ మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా రాబోయే రోజుల్లో తమ అస్త్రాలను ఎక్కు పెట్టాలని నిశ్చయంగా ఉన్నారు. వీరిలో ఠాకూర్ మాత్రం తాను బీజేపీతో ఉన్నానని బహిరంగంగా ప్రకటించారు. మిగిలిన వారు మాత్రం మాకు కాంగ్రెస్ హై కమాండ్ తో ఎలాంటి ఇబ్బంది లేదని, సీఎం సుఖుతో తమ పోరాటమని చెబుతున్నారు.
తిరుగుబాటు ఎమ్మెల్యేలు పంచకులలోని హోటల్ గదుల్లోకి పరిమితం కావడంపై సీఎం సుఖు వారిపై విమర్శలు ఎక్కుపెట్టారు. వారిని హోటల్ లోని ఖైదీలుగా అభివర్ఱించారు. గత ఏడు రోజులుగా వారు హోటల్ నుంచి బయటకు రాలేదని, ఇంటికి కూడా వెళ్లలేదని పలు బహిరంగ సభల్లో ప్రస్తావించారు. ఇదే విషయంపై సీఎం సన్నిహితుడు ఒకరు ఫెడరల్ తో మాట్లాడారు. " తిరుగుబాటు ఎమ్మెల్యేల విషయంలో ఒక్క ఇంచుకూడా తగ్గకూడదనే సందేశం హై కమాండ్ ఇచ్చిందనే, మిగిలిన ఎమ్మెల్యేలకు గట్టి సందేశం ఇచ్చేలా తమ అడుగులు ఉంటాయి " అని ఆయన వివరించారు.
విక్రమాదిత్య, ప్రతిభా సింగ్ పనితీరుపై..
మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ భార్య, గత ఎన్నికల తరువాత సీఎం అభ్యర్థిత్వానికి గట్టి పోటీగా ఉన్నా ప్రతిభా సింగ్, ఆమె కుమారుడు మంత్రి విక్రమాదిత్య అడుగులను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వీరు ఇద్దరు బీజేపీలో చేరుతున్నారనే ఆరోపణలను ఖండించారు. అలాగే తిరుబాటు ఎమ్మెల్యేలతో మాట్లాడే విషయాన్ని కూడా పార్టీ విక్రమాదిత్యకే అప్పగించింది. ఆయన ఢిల్లీ వెళ్లి ప్రియాంక వాద్రా, కేసీ వేణుగోపాల్ ను కలిశారు. తమ సమస్యలతో పాటు, ఎమ్మెల్యేల సమస్యలు హై కమాండ్ కు తెలియజేశానని, పార్టీ హై కమాండ్ అప్పగించిన బాధ్యతలు మాత్రమే తాను నెరవెర్చానని ఆయన అన్నారు.
సింఘ్వీ ఎన్నికల్లో పరాజయం కేవలం సీఎం ప్రవర్తన వల్లె జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. అయితే పార్టీకి, ప్రభుత్వానికి సరైన సమన్వయం లేదని భావించిన ఏఐసీసీ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి కాంగ్రెస్ హై కమాండ్ సైతం ఆమోద ముద్ర వేసింది. అలాగే తన భర్త వీరభద్ర సింగ్ విగ్రహం ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని కేటాయించడంలో సీఎం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రతిభా సింగ్ ఆరోపిస్తున్నారు.
దీనిని సీఎం ఖండిచారు. స్థలం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఇదే సమయంలో జుబ్బల్ కోట్ ఖాయ్ ఎమ్మెల్యే మాట్లాడుతూ... వీరభద్ర సింగ్ విగ్రహం పెడితే, మాజీ సీఎం ఠాకూర్ రామ్ లాల్ విగ్రహాన్ని సైతం పెట్టాలని డిమాండ్ చేశారు.
కేబినెట్ పునరుద్దరణ
తిరుగుబాటు ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ పై నిర్ణయం వెలువడిన తరువాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తెలుస్తోంది. విక్రమాదిత్య, ప్రతిభా సింగ్ పార్టీ వీడమని హమీ ఇచ్చిన నేపథ్యంలో వారి వర్గానికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కుతుంది. అయితే ఇదీ కత్తి మీద సాము వంటిదే. రెండు వర్గాలను బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే పార్టీలో చీలిక వస్తుందో అన్న బెంగ ఉంది.
ఎన్నికల వాగ్థానాలను నెరవేర్చండి
పార్టీలో పరిస్థితులు ఇలా ఉండగా చాలా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హమీలను నెరవేర్చాలని సీఎం, డిప్యూటీ సీఎంలను ప్రియాంక వాద్రా ఆదేశించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మహిళలకు నెలకు రూ. 1500 లను అందించే పథకమైన ఇందిరా గాంధీ ప్యారీ బెహనా సుఖ్ సమ్మాన్ నిధి యోజనను ఆమోదించడానికి మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించారు.
ఆరుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు వల్ల ప్రజల్లో పార్టీ పలుచబడిందని, పార్టీలో ఏదో జరుగుతుందనే చర్చను ఆపాలనే కృత నిశ్చయంతో ప్రభుత్వం ఉంది. లోక్ సభ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనెందుకు పలు అభివృద్ధి పథకాలను సైతం చేపట్టాలని హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
Next Story