ఈ బంధానికి పాతికేళ్లు.. మరో 26 ‘జెట్’లతో కొత్త అనుబంధం
x
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్

ఈ బంధానికి పాతికేళ్లు.. మరో 26 ‘జెట్’లతో కొత్త అనుబంధం

భారత్,ఫ్రాన్స్.. ఇరుగు పొరుగు దేశాలు ఏం కాదు. అయినా పాతికేళ్లుగా వీరి ఇద్దరి ప్రయాణం విశ్వాసం ప్రాతిపదికగా నడిచింది. ఇంకా నడుస్తోంది.


భారత రిపబ్లిక్ దినోత్సవానికి విశిష్ఠ అతిథిగా హజరవుతున్న ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ గురువారం జైపూర్ చేరుకున్నారు. ఆయనకు విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్, రాజస్తాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఘనంగా స్వాగతం పలికారు. ఆయన ఈ పర్యటనలో రెండు రోజల పాటు భారత్ లో గడపనున్నారు.

పింక్ సిటీలోని అంబర్ కోట, హవా మహల్ చూసిన తరువాత ప్రధానితో చర్చలు చేస్తారు. తరువాత ఢిల్లీలోని జంతర మంతర్ ను సందర్శిస్తారు. జంతర్ మంతర్ ఫ్రెంచి వారికి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

ఫ్రెంచ్- భారత్ వ్యూహత్మక భాగస్వామ్యానికి పాతికేళ్లు పూర్తి అయింది. భారత్ అణు పరీక్షలు నిర్వహించిన తరువాత ప్రపంచం మొత్తం మనపై ఆంక్షలు విధించింది. అయితే ఫ్రెంచ్ మాత్రం మనదేశంపై పూర్తిగా విశ్వాసం ఉంచింది. అలా అలా రెండు దేశాల మధ్య బంధం పెరుగుతూ ఇంతదాకా వచ్చింది. యూఎన్ లో మనకు రష్యాతో పాటు ఫ్రాన్స్ కూడా అనేక సందర్భాల్లో అండగా నిలబడింది.

చర్చలు

ప్రధాని నరేంద్ర మోడీ- ఫ్రాన్స్ అధ్యక్షుడి మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, వాతావరణ మార్పులు, స్వచ్ఛమైన ఇంధనం, విద్యార్థులు, నిఫుణుల కదలిక రంగాల్లో సహకారాన్ని పెంచడం వంటి చర్చకు రానున్నాయి. ఇవే కాకుండా ఇండో ఫసిఫిక్ లో సముద్ర సహకారం విస్తరించడం, ఎర్ర సముద్రంలో హౌతీల దాడులు, ప్రపంచ వాణిజ్య పరిస్థితి, హమాస్- ఇజ్రాయెల్ యుద్దం వంటి సైతం చర్చించే అవకాశం ఉంది.

చర్చల అనంతరం సాయంత్రం ప్రధాని మోదీ రాంబాగ్ ప్యాలెస్ లో మాక్రాన్ కు విందు ఇస్తారు. తరువాత రిపబ్లిక్ పరేడ్ కోసం ఆయన ఢిల్లీ వెళ్తారు. ఈ పరేడ్ కోసం ఇప్పటికే 95 మందితో కూడిన ఫ్రాన్స్ ఆర్మీ బృందం ఢిల్లీ చేరుకుంది.

‘జాతీయ దినోత్సవ వేడుకలకు ఈ పరస్పర ఆహ్వానం అపూర్వమైంది. ఇరువురు దేశాధినేతల పర్యటనలు ఇండో - ఫ్రెంచ్ సంబంధాలకు ఆధారమైన లోతైన విశ్వాసం, అచంచలమైన స్నేహాన్ని చూపుతుంది’ అని ఫ్రెంచ్ రీడౌట్ తెలిపింది. గత జూలైలో ఫ్రాన్స్ లో జరిగిన ప్రతిష్టాత్మక బాస్టిల్ డే పరేడ్ కు మోదీ గౌరవ అతిథిగా హాజరైయ్యారు. ప్రస్తుతం భారత్ లో జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఫ్రెంచ్ అధ్యక్షుడు హజరవుతున్నారు.

మరోమారు రాఫెల్ ఒప్పందం

ఈ పర్యటనలో ప్రధాని, అధ్యక్షుడు మాక్రాన్ మధ్య 26 రాఫెల్ ఫైటర్ మెరైన్ వెర్షన్ కోసం ఒప్పందం కుదరబోతున్నట్లు అంచనాలున్నాయి. అంతే కాకుండా మూడు స్కార్పిన్ శ్రేణీ జలాంతర్గాములు కొనుగోలు ఒప్పందం కూడా కుదిరే అవకాశం ఉంది. ముఖ్యంగా రాఫెల్ ఫైటర్ జెట్ ల కోసం ఇరుదేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.

భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ మీద రాఫెల్(ఎం) లు మోహరించాలని నేవీ కోరుకుంటోంది. ఇప్పటికే భారత్ ఎయిర్ ఫోర్స్ కోసం 36 ఫైటర్ జెట్ లు కొనుగోలు చేసింది. రెండు వెర్షన్ లలో యుద్ద విమానాలు కొనుగోలు చేయడంతో వీటి నిర్వహణ ఖర్చు మీద కొంత నియంత్రణ ఉంటుంది. నౌక దళం కోసం అవసరమైన మార్పులు చేయడానికి కూడా దసాల్ట్ కంపెనీ సిద్దంగా ఉన్నట్లు సమాచారం.

Read More
Next Story