నెల రోజుల్లో మరో ముగ్గురిని అరెస్ట్ చేస్తారు: ఆప్ మంత్రి అతీషీ
తనకు బీజేపీ చేరాలని ఆహ్వనం వచ్చినట్లు ఢిల్లీ మంత్రి ఆతీషీ మార్లేనా అన్నారు. లేకపోతే నెల రోజుల్లో అరెస్ట్ చేసి జైలులో వేస్తారని సంచలన ప్రకటన చేశారు.
ఢిల్లీ మంత్రి అతిషీ మార్లేనా సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజుల్లోగా కమలదళంలో జాయిన్ కాకపోతే తదుపరి తనను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెప్పారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తికి బీజేపీ ఈప్రతిపాదన తీసుకొచ్చిందని ఆమె వెల్లడించారు. మంగళవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించిన ఆప్ నాయకురాలు, ఆమెతో పాటు మరో ముగ్గురు ఆప్ నేతలను కూడా అరెస్టు అవుతారని ప్రకటించారు. వారిలో ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్, ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా ఉన్నారని ఆరోపించారు. రాబోయే రోజుల్లో తన నివాసం, ఆమె బంధువులపై ED దాడులు నిర్వహిస్తుందని తనకు చెప్పారని అతిషి పేర్కొన్నారు.
"ర్యాలి సక్సెస్ అయింది"
ఆదివారం నాడు ‘ఇండి కూటమి’ రాంలీలా మైదాన్ లో నిర్వహించిన ర్యాలీ విజయంతో బిజెపి ఉలిక్కిపడిందని, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను జైలుకు పంపడం ఆప్ విచ్ఛిన్నానికి దారితీయదనే విషయం కమల దళం గ్రహించిందని ఆమె చెప్పారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మార్చి 21న అరెస్ట్ చేసింది. ఆయను కోర్టు ఏప్రిల్ 15 వరకూ జ్యూడిషియల్ కస్టడీ విధించింది. సోమవారం కేజ్రీవాల్ ను కోర్టులో హాజరు పరచిన దర్యాప్తు సంస్థ ఓ నివేదికను కోర్టుకు సమర్పించింది. ఈ కేసులో నిందితుడైన మాజీ ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్‌చార్జి విజయ్ నాయర్ అతీషి భరద్వాజ్‌లకు విషయాలను నివేదించారని నాయర్ తనకు పెద్దగా టచ్ లో లేడని కేజ్రీవాల్ చెప్పినట్లు ఏజెన్సీ నివేదించింది. ”. తాను ఢిల్లీ మంత్రి కైలాష్ గహ్లాట్‌కు కేటాయించిన బంగ్లాలో ఉంచి కేజ్రీవాల్ కార్యాలయంలో పనిచేశానని నాయర్ పేర్కొన్నట్లు సమాచారం.
తమ శాసనసభ్యులను వేటాడి, పార్టీని విచ్ఛిన్నం చేయడం ద్వారా ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ భావిస్తోందని ఆప్ ఆరోపించింది. ఆప్ కిరారి ఎమ్మెల్యే రితురాజ్ ఝా కాషాయ పార్టీలో చేరేందుకు తనకు రూ.25 కోట్లు ఆఫర్ చేశారని పేర్కొన్నారు.
Next Story