కాలమే తిరిగి సమాధానం చెబుతుంది: నవజ్యోత్ సింగ్ సిద్దూ
x
నవజ్యోత్ సింగ్ సిద్దూ

కాలమే తిరిగి సమాధానం చెబుతుంది: నవజ్యోత్ సింగ్ సిద్దూ

కొత్త యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించిన మాజీ క్రికెటర్


రాజకీయాల్లో తిరిగి క్రియాశీలకంగా మారడంపై కాలమే సరైన సమాధానం చెబుతుందని క్రికెటర్, వ్యాఖ్యాత నవజ్యోత్ సింగ్ సిద్దూ అన్నారు. పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ గత చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆయన పార్టీ తరఫున ప్రచారం చేయలేదు.

ఈరోజు కొత్త యూట్యూబ్ ఛానెల్ ‘నవజ్యోత్ సిద్దూ అఫీషియల్’ ను ప్రారంభించారు. దీనిలో ఆయన తన జీవిత అనుభవాలు, క్రికెట్, వ్యాఖ్యానం, ప్రేరణాత్మక చర్చలు, జీవన శైలి గురించి మాట్లాడతానని, రాజకీయాల గురించి మాత్రం కాదని చెప్పారు.
జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభించబోతున్నాని అన్నారు. ‘‘నా అభిప్రాయాలను నేను ప్రస్తావిస్తాను. అందులో నా జీవితానికి సంబంధించిన ప్రతిదీ ఉంటుంది.
కానీ రాజకీయాలు మాత్రం కాదు’’ అని అన్నారు. రాజకీయాలను వ్యాపారంగా తీసుకున్న నాయకులు చాలామంది ఉన్నారని మీడియా తో మాట్లాడుతూ అన్నారు.
‘‘నేను ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేశాను. అది ఎప్పుడూ వ్యాపారం కాదు. నా పాత్రతో రాజీ పడలేదు. రాజకీయాల నుంచి ఒక పైసా కూడా రాలేదని నా పిల్లలు నన్ను అడగవచ్చు’’ అని సిద్దూ అన్నారు.
ఐపీఎల్ 2024 సీజన్ లో సిద్ధూ తిరిగి క్రికెట్ వ్యాఖ్యాతగా తిరిగి వచ్చాడు. ‘‘వ్యాఖ్యానంలో నాకు అత్యున్నత ఆనందం లభిస్తుంది. రాజకీయాలు నాకు గరిష్ట సంతృప్తి లభించే ప్రదేశం. కానీ ఈ రెండింటి మధ్య తేడా ఏమిటంటే రాజకీయాల్లో మీరు కొన్నింటిపై ఆధారపడి ఉంటారు. కానీ మీరు వ్యాఖ్యానం చేసినప్పుడూ క్రికెట్ ఆడినప్పుడూ, ప్రేరణాత్మక చర్చలు చేసినప్పుడు మీరు ఆటనిర్భర్ అవుతారు’’ అని సిద్దూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు.
నా జీవితంలో ఎక్కువ సమయం కేటాయించబోయే మొదటి వేదిక ఇదే కావచ్చు’’ అని సిద్దూ అన్నారు. ‘‘ నా అనుభవాలను పంచుకుంటాను, అది తెరిచిన పుస్తకం లాంటిది. నేను దానిని ప్రొఫెనషల్ పద్దతిలో చేస్తాను. నా ఉనికిని ఎటువంటి పరిమితులు లేని ఏకైక ఛానెల్ ఇదే. మీరు రాజకీయాలు చేసినప్పుడు, మీకు కొన్ని పరిమితులు ఉంటాయి. మీరు దానిని గౌరవించాలి’’ అని ఆయన అన్నారు.
‘‘నా వృత్తి వేరే చోట ఉంది. ఇది దురదృష్టకరం. నేను అన్నింటి గురించి మాట్లాడను. కానీ రాజకీయాలను వ్యాపారం, వృత్తిగా అర్థం చేసుకునే వారు చాలామంది ఉన్నారు’’ అని సిద్ధూ ఉన్నారు. అమృత్ సర్ తూర్పు అసెంబ్లీ స్థానానికి గతంలో సిద్ధూ ప్రాతినిధ్యం వహించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి అడిగినప్పుడూ దేశ ప్రజలు ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని ఆయన అన్నారు. భారత్- పాక్ గురించి ప్రశ్నలు సంధించినప్పుడు ఈ సమాధానం ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుందని సిద్దు అన్నారు.
Read More
Next Story