ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
x
ఉమర్ ఖలీద్

ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు

బెయిల్ పిటిషన్ ను తిరస్కరించిన అత్యున్నత న్యాయస్థానం, మరో ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు


2020 ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో సామాజిక కార్యకర్తలుగా చెలమణి అవుతున్న ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ ల బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు మరోసారి తిరస్కరించింది. అయితే ఇదే కేసులో అరెస్ట్ అయిన గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్, మహ్మద్ సలీమ్ ఖాన్, షాదాబ్ అహ్మద్ లకు బెయిల్ మంజూరు చేసింది.

ఇతర నిందితులతో పోలిస్తే ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ లపై వచ్చిన అభియోగాలు భిన్నమైనవని జస్టిస్ అర్వింద్ కుమార్, ఎన్వీ అంజారియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
‘‘రక్షిత సాక్షుల విచారణ పూర్తయిన తరువాత లేదా ఈ ఉత్తర్వూ నుంచి ఒక సంవత్సరం పూర్తయిన తరువాత ఈ అప్పీల్ దారులు బెయిల్ మంజూరు కోసం దరఖాస్తు చేసుకునే స్వేచ్ఛ ఉంది’’ అని బార్ అండ్ బెంచ్ నివేదిక పేర్కొంది.
ఇతర నిందితులకు బెయిల్ మంజూరు సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ నిందితులకు బెయిల్ ఇచ్చినంత మాత్రాన వారిపై ఉన్న అభియోగాలు నీరుగార్చినట్లు కాదని పేర్కొంది.
వారికి సుమారు 12 షరతులు విధించి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. షరతులు ఉల్లంఘించినట్లు అయితే నిందితుల వాదనలు విన్న తరువాత ట్రయల్ కోర్టు బెయిల్ రద్దు చేసే అధికారం ఉందని పేర్కొంది. ఢిల్లీ పోలీసులు, నిందితుల వాదనలు విన్న తరువాత డిసెంబర్ 10న అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.
ముందస్తు కుట్ర ప్రకారం అల్లర్లు..
ఢిల్లీ అల్లర్ల కేసు నిందితులకు బెయిల్ పిటిషన్లు ఢిల్లీ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఫిబ్రవరి 2020 లో అల్లర్లు ఆకస్మికంగా జరిగలేదని, భారత సార్వభౌమాధికారంపై వ్యవహారికంగా ముందస్తు ప్రణాళికతో బాగా రూపొందించి అమలు చేసిన దాడులుగా పేర్కొంది.
షార్జీల్ ఇమామ్ ప్రసంగాలను ఉమర్ ఖలీద్ కు ఆపాదించవచ్చు. షార్జీల్ ఇమామ్ కేసును ఇతరులపై సాక్ష్యంగా పరిగణిస్తారు’’ అని ఆయన బెయిల్ పిటిషన్లపై అనేక రోజుల పాటు విచారణ నిర్వహించిన ధర్మసనానికి తెలిపారు. బాధ్యతను తిప్పికొట్టడానికి ఖలీద్ ఉద్దేశపూర్వకంగా అల్లర్లకు ముందే ఢిల్లీ విడిచి వెళ్లాలని ప్లాన్ చేశాడని అదనపు సోలిసిటర్ జనరల్ వాదించారు.
ఉగ్రవాద అభియోగాలు..
పూర్తి స్థాయి విచారణ లేదా ఒకే శిక్ష లేకుండానే తనను ప్రమాదకరమైన మేధో ఉగ్రవాదిగా ముద్ర వేసినందుకు ఇమామ్ బెయిల్ కోరుతూ సుప్రీంకోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇమామ్ తరఫున సీనియర్ న్యాయవాదీ సిద్ధార్థ్ దవే జనవరి 28, 2020 న ఈశాన్య ఢిల్లీలో మత హింస చెలరేగడానికి ముందు అల్లర్ల కేసులో నేరపూరిత కుట్ర నేరంగా పరిగణించలేని ప్రసంగాల కారణంగా ఆయనను అరెస్ట్ చేశారని వాదించారు. కానీ దీనిని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకోలేదు.
53 మంది మృతి చెందగా 700 మందికి పైగా గాయపడిన అల్లర్లకు సూత్రధారులు అని ఆరోపిస్తూ ఖలీద్, ఇమామ్, ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహమాన్ లపై కఠినమైన ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ద కార్యకలాపాల (నివారణ) చట్టం 1967(యూఏపీఏ) భారత శిక్షాస్మృతి (ఐపీసీ) నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
యూఏపీఏలోని సెక్షన్ 16 ప్రకారం.. ఎవరైన ఉగ్రవాద చర్యకు పాల్పడితే అలాంటి చర్య ఎవరికైనా మరణానికి దారితీసి ఉంటే వారికి మరణశిక్ష లేదా జీవిత ఖైదు విధించబడుతుంది. జరిమానా కూడా విధిస్తారు.
పౌరసత్వ సవరణ చట్టం సీఏఏ, జాతీయ పౌర రిజిస్టర్ ఎన్ఆర్సీ కు వ్యతిరేకంగా విస్తృతంగా జరిగిన నిరసనల సందర్భంగా హింస చెలరేగింది. ఫిబ్రవరి 2020 అల్లర్ల పెద్ద కుట్ర కేసులో ఢిల్లీ హైకోర్టు సెప్టెంబర్ 2 న బెయిల్ నిరాకరిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.


Read More
Next Story