నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీ లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు
x

నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీ లో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు

దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించిన తొలి రాష్ట్రం గా నిలవడానికి ఉత్తరాఖండ్ అడుగులు వేస్తోంది. మంగళవారం అసెంబ్లీకి బిల్లు రానుంది.


యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టి, ఆమోదించిన తొలి రాష్ట్రంగా నిలవడానికి ఉత్తరాఖండ్ అడుగులు వేస్తోంది. ఈ బిల్లు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం పొందింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెడుతున్నాం, ఆమోదించాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి ప్రతిపక్ష నాయకులను కోరారు. ఈ బిల్లు కోసమే ప్రత్యేకంగా సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.

సెషన్ ప్రారంభం కావడానికి కంటే ముందు సీఎం ఫుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ "యూసీసీ అన్ని వర్గాల కోసం ఉంటుంది, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. బిల్లును సభలో సానుకూలంగా చర్చించాలని ఇతర పార్టీల సభ్యులను కోరుతున్నా" అన్నారు. సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా ప్రయాస్, సబ్ కా విశ్వాస్, ఇంకా ‘ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన దార్శనికతను ఇది సాకారం చేస్తుందని సీఎం విలేకరులతో అన్నారు.

" యూసీసీ కోసం ఉత్తరాఖండ్ మాత్రమే కాదు. దేశం మొత్తం ఎదురుచూస్తోంది. మంగళవారం ఈ బిల్లును అసెంబ్లీతో ప్రవేశపెట్టడంతో ఎన్నోఏళ్ల నిరీక్షణకు తెరపడనుంది. ఈ బిల్లును ఇక్కడ సభలో ఎలా తీసుకొచ్చి ఆమోదిస్తారో దేశం మొత్తం చూస్తోంది" అని సీఎం ధామి అన్నారు.

సమావేశాల తొలిరోజు గత సెషన్ నుంచి మరణించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలను సభ నివాళులర్పించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మంగళూర్ సర్వత్ కరీం అన్సారీ, మాజీ ఎమ్మెల్యేలు మోహన్ సింగ్ రావత్, పూరన్ చంద్ర శర్మ, కిషన్ సింగ్ తాడగి, కున్వర్ నరేంద్ర సింగ్, ధనిరామ్ సింగ్ నేగీలకు సభ తరఫున కేబినేట్ మంత్రులు మరణించిన నాయకులకు నివాళులర్పించారు.

బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం లో సభ ఎన్నిరోజులు జరగాలి అనే నిర్ణయం తీసుకున్నారు. అలాగే యూసీసీని శాసన రూపంలో సభలో ఉంచాలని, మంగళవారం దానిపై చర్చను ప్రారంభించాలని నిర్ణయించారు.

Read More
Next Story